DaatarBabu Posted August 23, 2020 Report Posted August 23, 2020 అమరావతి: రాజధాని అమరావతి ఉద్యమం 250వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ‘రాజధాని రణభేరి’ పేరుతో మందడం, తుళ్లూరు, వెలగపూడి, దొండపాడులో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రైతులు, మహిళలు, వివిధ రాజకీయపార్టీలు, ప్రజా సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో ఆందోళనలో పాల్గొన్నారు. రాజధాని ప్రజల దుస్థితిపై బతుకు జట్కాబండి రూపకం ప్రదర్శించారు. భాజపాది ద్వంద వైఖరి: నక్కా ఆనందబాబు అమరావతి ఉద్యమానికి సంఘీభావంగా తెదేపా నేతలు నిరసన దీక్షలు చేపట్టారు. గుంటూరువసంతరాయపురంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ రామకృష్ణ నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ.. ఉద్యమం 250వ రోజుకు చేరినా సర్కారులో చలనం లేదన్నారు. అడ్డగోలు నిర్ణయాలతో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. అమరావతి విషయంలో భాజపా ద్వంద వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు. ఐదు కోట్ల మందికి న్యాయం జరగాలంటే అమరావతే రాజధానిగా ఉండాలన్నారు. సీఎం జగన్ తన నిర్ణయం మార్చుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామన్నారు. ఆందోళనతో ఉద్యమకారుడి మృతి రాజధానిలో మరో ఉద్యమకారుడి ఊపిరి ఆగింది. ఐనవోలుకు చెందిన ఎస్సీ నేత బేతపూడి కోటేశ్వరరావు మృతి చెందారు. రాజధాని గురించి ఆందోళన చెందుతూ కోటేశ్వరరావు మరణించినట్లు అతని బంధువులు తెలిపారు. 2 Quote
DaatarBabu Posted August 23, 2020 Author Report Posted August 23, 2020 రణభేరి పేరుతో నేడు రాజధాని గ్రామాల్లో రైతుల నిరసనలు అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళనలు ఆదివారం నాటికి 250 రోజులకు చేరాయి. దీంతో ఇవాళ రాజధాని రణభేరి పేరుతో రాజధాని గ్రామాల్లో రైతుల నిరసనలు చేయనున్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. కరోనా సమయంలోను నిరసనలు హోరెత్తుతున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రాజధాని గ్రామాల రైతులు, రైతు కూలీలు, మహిళల నిరసనలు సాగుతున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, ఉద్దండరాయనిపాలెం, లింగాయపాలెం, దొండపాడు, పెదపరిమి, నెక్కళ్ళు, పొన్నెకళ్ళు, కిష్టయపాలెం, ఎర్రబాలెం, వెంకటపాలెం,రాయపూడి, తాడికొండ అడ్డరోడ్డు,నేలపాడు, ఐనవోలు, శాఖమూరు తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పేవరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం చేశారు. ఆదివారం నాటికి 250వ రోజుకి ఉద్యమం చేరడంతో అమరావతి జేఏసీ ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించింది. 250వ రోజు కార్యక్రమం పేరు రాజధాని రణభేరిగా నామకరణం చేసింది. అన్ని దీక్షా శిబిరాలలో డప్పులు, పళ్ళెము గరిట మ్రోగించటం, ప్రతి శిబిరంలో దళిత జేఏసీ ఆధ్వర్యంలో "దగాపడ్డ దళిత బిడ్డ" పేరుతో తమ ఆవేదనను 5 కోట్ల ఆంధ్రులతో పంచుకొనే కార్యక్రమం.. ఆలకించు ఆంధ్రుడా బజారున పడిన బడుగుజీవుల బ్రతుకులు పేరుతో దృశ్యరూపం... అండగా నిలవాలని 13 జిల్లాల ప్రజలను కొంగు చాచి రైతుల "భిక్షాటన".. రాజధాని ప్రజల బతుకు జట్కా బండి పేరుతో రూపకం, సాయంత్రం 7 గంటలకు ప్రతి శిబిరం వద్ద కాగడాల ప్రదర్శన. 5 కోట్ల ఆంధ్రుల వెలుగు అనే పేరుతో నిరసన కార్యక్రమాలు ఉంటాయని అమరావతి జేఏసీ తెలిపింది. మరోవైపు రాజధాని ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఐడీ కార్డులుంటేనే గ్రామాల్లోకి పోలీసులు అనుమతిస్తున్నారు. ఎక్కడిక్కడ వాహనాలను పూర్తిస్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసి క్షుణ్ణంగా పరిశీలించాకే అనుమతి ఇస్తున్నారు. 2 Quote
Printcopyscan Posted August 23, 2020 Report Posted August 23, 2020 బాబు ల్యాండ్ avvaledu ఇంకా.... అయితే power లో unnadiki బాండ్ baaje Quote
Printcopyscan Posted August 23, 2020 Report Posted August 23, 2020 500 days ki cbn adykshatha వహించాలి Quote
Hydrockers Posted August 23, 2020 Report Posted August 23, 2020 1 hour ago, Printcopyscan said: 500 days ki cbn adykshatha వహించాలి 5000 days iana.pikedi em ledu ani @DaatarBabubabu antunadu 1 Quote
DaatarBabu Posted August 23, 2020 Author Report Posted August 23, 2020 రాజధాని పరిరక్షణ ఉద్యమం 250 రోజుల రణభేరి అమరావతి: రాజధాని పరిరక్షణ ఉద్యమం 250 రోజుల సందర్భంగా రణభేరి నిర్వహించారు. 13 జిల్లాల్లో 104 నియోజకవర్గ కేంద్రాలు, 206 మండల కేంద్రాల్లో రాజధాని రణభేరి మోగించారు. ఢమరుకాలు-డప్పులు, కంచాలు-గరిటె మోతతో రణభేరి దద్దరిల్లింది. అమరావతి రైతులు, మహిళలు, రైతు కూలీలకు రాష్ట్రవ్యాప్తంగా సంఘీభావం తెలిపారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. రాష్ట్రం కోసం ‘‘భూములిచ్చాం-రోడ్డున పడ్డాం’’ అంటూ రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలు, రైతు కూలీలు భిక్షాటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు, వినతి పత్రాలు ఇచ్చారు. Quote
DaatarBabu Posted August 23, 2020 Author Report Posted August 23, 2020 రైతుల కన్నీళ్లలో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం: వెంకట్రావు విజయవాడ: సీఎం జగన్ తెచ్చిన మూడు రాజధానుల విధానం.. దేశ వ్యాప్తంగా విమర్శల పాలైందని టీడీపీ నేత కళా వెంకట్రావు విమర్శించారు. రాజధాని తరలింపు 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని, ప్రజల జీవితాలతో ఆటలాడుకునే హక్కు మీకెవరిచ్చారు? అని వెంకట్రావు ప్రశ్నించారు. రైతుల కన్నీళ్లలో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని హెచ్చరించారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటో జగన్ తెలుసుకోవాలన్నారు. అమరావతి ఎజెండాతో ఎన్నికలకు వెళ్లేందుకు టీడీపీ సిద్ధమని, 3 రాజధానులతో ఎన్నికలకు వెళ్లేందుకు మీరు సిద్ధమా..? అని కళా వెంకట్రావు ప్రశ్నించారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.