DaatarBabu Posted August 25, 2020 Report Posted August 25, 2020 ‘రాగానే ప్రజావేదిక కూల్చివేతతో తన విధ్వంస ఎజెండాను జగన్ మొదలుపెట్టారు. అమరావతి ప్రాజెక్టును కుప్పకూల్చడం తప్ప ఈ 15 నెలల్లో సాధించిందేంటి?’ ‘విశాఖను మేం ఆర్థిక రాజధాని చేయాలనుకున్నాం. పది ప్రాజెక్టులు ఇచ్చాం. మీరు ఇంకో పది ఇచ్చి అన్నీ పూర్తి చేసి ఉంటే ఆ నగరం హైదరాబాద్‌ను మించిపోయేది.’ ‘అమరావతి రాష్ట్రానికి ఆర్థిక పునాదిగా తయారవ్వాలని శ్రమించాం. దానికి కులం ముద్ర వేసి చంపాలని చూస్తున్నారు.’ ‘రాజధానిని ఆ ప్రాంతంలో పెడుతున్నామని అధికారిక ప్రకటన చేసేలోపు అక్కడ అమ్మకం జరిగిన భూమి కేవలం 120 ఎకరాలు. ఇది ఇన్‌సైడర్ ట్రేడింగా?’ - చంద్రబాబు వరద బాధితులను ఆదుకునే దిక్కే లేదు అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా అదే ఆయన ప్రధాన ఎజెండా అమరావతిని కుప్పకూల్చడం తప్ప ఈ 15 నెలల్లో ఏం సాధించారు? ఒక రోడ్డు వేశారా.. కాల్వ తీశారా? భూములిచ్చిన 25 వేల మందీ రెండెకరాల్లోపు సన్నకారు రైతులే! వారికి కులం అంటగడతారా? కరోనాతో రోజుకు వందమంది మృతి ప్రజలను గాలికి వదిలేశారు: బాబు Quote
DaatarBabu Posted August 25, 2020 Author Report Posted August 25, 2020 అమరావతి, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): విధ్వంసం ముఖ్యమంత్రి జగన్ డీఎన్‌ఏలోనే ఉందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. ‘అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా విధ్వంసమే ఆయన ప్రధాన ఎజెండా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానిలో తోటలు తగులబెట్టించారు. రాజధానికి ప్రపంచబ్యాంకు రుణం రాకుండా తప్పుడు ఫిర్యాదులు చేయించారు. ప్రతి పనికీ అడుగడుగునా అడ్డుపడ్డారు. అధికారంలోకి రాగానే ప్రజావేదిక కూల్చివేతతో తన విధ్వంస ఎజెండాను మొదలు పెట్టారు. తెలుగువారికి గర్వకారణమైన అమరావతి ప్రాజెక్టును కుప్ప కూల్చడం తప్ప ఈ 15 నెలల్లో సాధించింది ఏమిటి? ఎక్కడైనా ఒక కాల్వ తీశారా? ఒక రోడ్డు వేశారా’ అని ధ్వజమెత్తారు. సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘మేం ఒక్క అమరావతితో ఆపలేదు. మొత్తం 13 జిల్లాల సమగ్రాభివృద్ధికి ప్రణాళిక ముందు పెట్టుకుని పనిచేశాం. విశాఖను ఆర్థిక రాజధానిగా చేయాలనుకున్నాం. మేం పది ప్రాజెక్టులు ఇచ్చాం. మీరు ఇంకో పది ఇచ్చి అన్నీ పూర్తి చేసి ఉంటే హైదరాబాద్‌ను ఆ నగరం మించిపోయేది. కర్నూలును దేశానికి విత్తన రాజధాని చేయాలని సంకల్పించాం. విమానాశ్రయం, ఓర్వకల్లు పారిశ్రామికవాడ ఇచ్చాం. మేం చేసినట్లుగా తిరుపతిని ఇంకా అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి మూడు పెద్ద నగరాలు ఉండేవి. చివరకు ఏదీ కాలేదు. విధ్వంసంలో నంబర్ వన్ అన్న పేరు మాత్రం మిగిలింది’ అన్నారు. ఇంకా ఏమన్నారంటే.. Quote
DaatarBabu Posted August 25, 2020 Author Report Posted August 25, 2020 ఆదాయం సాధించి పెట్టాలని.. ‘హైదరాబాద్ నగరం ఎలా తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం సంపాదించి పెడుతోందో అమరావతి కూడా అదే మాదిరిగా మొత్తం రాష్ట్రానికి ఆర్థిక పునాదిగా తయారవ్వాలని శ్రమించాం. కానీ కులం ముద్ర వేసి చంపాలని చూస్తున్నారు. అమరావతికి భూములిచ్చిన వారిలో పాతిక వేల మంది కేవలం రెండు ఎకరాలలోపు రైతులు. వారికి ఏం కులం ఉంటుంది? రాజధానిని ఆ ప్రాంతంలో పెడుతున్నామని అధికారిక ప్రకటన చేసేలోపు అక్కడ అమ్మకం జరిగిన భూమి కేవలం 120 ఎకరాలు. ఇది ఇన్‌సైడర్ ట్రేడింగా? ఒకసారి ఫలానా ప్రాంతంలో రాజధానిని పెడుతున్నామని ప్రకటించిన తర్వాత ఎవరికైనా కొనుక్కునే హక్కు.. అమ్ముకునే హక్కు ఉంటుంది. దేశంలో ఎక్కడైనా రైతులు తమంతట తాము వచ్చి స్వచ్ఛందంగా భూములిచ్చిన ఘటన ఉందా? ఆ చరిత్రను కూడా మట్టిపాలు చేశారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలూ ఇలాగే రద్దు చేయాలని చూస్తే అది సరికాదని కేంద్రం హెచ్చరించింది. కోర్టులు మొట్టికాయలు వేశాయి. రైతులతో కుదిరిన ఒప్పందాలకు కూడా ఇంత విలువ ఉంది. అటు రైతులుగానీ, ఇటు ప్రభుత్వంగానీ వెనుతిరిగి వెళ్లడానికి వీల్లేదు. వెళ్తే రైతులకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. రూ.2-3 వేల కోట్లు ఖర్చు చేస్తే అమరావతిలో నడుస్తున్న నిర్మాణాలు పూర్తయ్యేవి. కోర్టులో లాయర్లకు, జగన్ సొంత మీడియాకు వందల కోట్లు పోస్తున్నారు. ఈ పనికి మాత్రం డబ్బులు ఇవ్వడం లేదు. ఫలానా కులానికి మేలు చేశాననో... చేయలేదనో కొందరు వైసీపీ నేతలు నాపై ప్రకటనలు చేస్తున్నారు. నా రాజకీయ జీవితంలో వివక్ష లేకుండా అందరికీ సాయం చేసినవాడినే తప్ప కులం చూడడం నా రక్తంలోనే లేదు. నాడు ప్రత్యేక హోదా గురించి గొంతు చించుకున్న జగన్.. ఇప్పుడా మాటే ఎత్తడం లేదు. ఇటువంటి మోసాలు నాకు రావు. రాష్ట్రానికి ధర్మకర్తలా ఉండాలని ప్రజలు అవకాశమిస్తే నాశనం చేసి పోతామంటే కుదరదు. దానిని జరగనివ్వం.’ వరద బాధితులకు ఏదీ సాయం? ‘ఉభయ గోదావరి ప్రజలు గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఈసారి వరదలతో నష్టపోయారు. వారిని గాలికి వదిలేశారు. పోయినేడాది వరదలు వచ్చినప్పుడు కుటుంబానికి రూ.5వేలు పరిహారం ఇస్తామని చెప్పారు. ఇంతవరకూ ఇవ్వలేదు. ఈ ఏడాది మరీ తక్కువగా రూ.2వేలు ఇస్తామన్నారు. అది చాలదు. కుటుంబానికి రూ.10వేలు ఇవ్వాలి. తమకు కనీస సౌకర్యాలు లేవని జూనియర్ వైద్యులు, నర్సులు ఆందోళనలకు దిగాల్సిన పరిస్థితులు తెచ్చారు. వైసీపీ నేతలు ఇష్టానుసారం తిరిగి వైరస్ వ్యాప్తికి సూపర్ స్ర్పెడర్లుగా మారుతున్నారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపే వారిపై కేసులు పెట్టడం, పోలీసు బలగాలను ప్రయోగించి అణచివేయడం సరికాదు. పోలీసువ్యవస్థ రెఫరీగా ఉండాలి. చట్టాన్ని అందరికీ సమానంగా వర్తింపజేయాలి’. అమరావతిపై వెబ్‌సైట్ అమరావతికి సంబంధించి మొత్తం వాస్తవాలు అందరికీ తెలియడం కోసం కొత్తగా ఒక వెబ్‌సైట్ ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ‘ఏపీ విత్ అమరావతి డాట్ కాం’ పేరుతో ఈ వెబ్ సైట్ పెడుతున్నామని, ఇందులో అమరావతిపై ప్రజాభిప్రాయ సేకరణ జరపడంతోపాటు ఆసక్తిఉన్నవారు తమ అభిప్రాయాలు పంచుకునే అవకాశం కూడా కల్పిస్తున్నామని తెలిపారు. Quote
Ryzen_renoir Posted August 25, 2020 Report Posted August 25, 2020 విశాఖను మేం ఆర్థిక రాజధాని చేయాలనుకున్నాం Ok అమరావతి రాష్ట్రానికి ఆర్థిక పునాదిగా తయారవ్వాలని శ్రమించాం does not compute with above statement . Capital antey development antey Jagan chesedhi correct kadha ? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.