Jump to content

Recommended Posts

Posted

విజయవాడ : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పరిపాలనలో అనుభవం లేదని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. శుక్రవారం రాత్రి విజయవాడ పార్లమెంట్‌ సమీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. పరిపాలనను 3 ముక్కలాటగా జగన్‌ మార్చారని వ్యాఖ్యానించారు. జగన్‌కు పరిపాలనలో అనుభవం లేదని.. క్రైసిస్ మేనేజ్‌మెంట్‌ తెలియదని.. గవర్నెన్స్‌ అస్సలే చేతకాదని బాబు చెప్పుకొచ్చారు. 

ప్రతి దానిలో కుంభకోణాలే..

టాప్‌-3లో ఉన్న రాష్ట్రాన్ని 20వ స్థానంలోకి దిగజార్చారు. 150 ఏళ్ల కృష్ణా డెల్టా చరిత్రలో జూన్‌లో నీళ్లివ్వడం టీడీపీ ఘటనే. అప్పుడు పట్టిసీమ దండగ అన్నారు, ఇప్పుడదే దిక్కైంది. అమరావతిలో 130 సంస్థలను వెళ్లగొట్టారు. సెంటు పట్టా కాదు.. స్కామ్ పట్టాగా ఇళ్ల స్థలాల పథకాన్ని చేశారు. ఇంత పనికిమాలిన ప్రభుత్వాన్ని చరిత్రలో చూడలేదు. మూర్ఖత్వం, వితండ వాదనతో రాష్ట్రానికి జగన్ తీవ్ర నష్టం చేస్తున్నారు. ఇసుక, మద్యం, భూములు,గనులు, ప్రతిదానిలో వైసీపీ కుంభకోణాలే. కొండలు కొట్టేస్తున్నారు.. అడవులు నరికేస్తున్నారు.. మట్టి, ఇసుక మింగేస్తున్నారు. 

వైసీపీ అవినీతి కుంభకోణాలకు హద్దు అదుపు లేకుండా పోయింది. ఇంత దుర్మార్గ పరిపాలన రాష్ట్రంలో గతంలో చూడలేదు. ఇలాంటి అరాచక శక్తిని ముందెప్పుడూ చూడలేదు. ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ ఇన్ని అఘాయిత్యాలు జరగలేదు. ఇంత అప్రతిష్ట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో ఎప్పుడూ రాలేదు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

 

మళ్లీ శంకుస్థాపనలా..!?

హత్యలు చేయడంలో, ఆత్మహత్యలుగా చిత్రించడంలో వైసీపీ నాయకులు సిద్దహస్తులు. దేశంలో అమలయ్యేది అంబేద్కర్ రాజ్యాంగమే తప్ప రాజారెడ్డి రాజ్యాంగం కాదు. టీడీపీ చేసిన పనులకు రిబ్బన్ కటింగులు, టీడీపీ కట్టిన భవనాలకు వైసీపీ రంగులు. టీడీపీ శంకుస్థాపన చేసిన పథకాలకు మళ్లీ శంకుస్థాపనలు చేస్తున్నారు. టీడీపీ హయాంలోనే కృష్ణా జిల్లాలో గణనీయమైన అభివృద్ది జరిగింది. కృష్ణా డెల్టా ఆధునీకరణకు రూ1200కోట్లు ఖర్చు చేశాం అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

  • Haha 1
Posted

అమరావతిలో 130 సంస్థలను వెళ్లగొట్టారు

Posted
1 minute ago, snoww said:

అమరావతిలో 130 సంస్థలను వెళ్లగొట్టారు

4crzxw.gif
Please list them ... 

 

Posted

అనుభవజ్ఞుడు లోకేష్ నీ dinchaali 

Posted
2 hours ago, Sucker said:

Is it zoom meeting ? Naku invitation raaledu ??

Cbn photo tatoo epinchuko 

Wife adigite ayana daya valle nenu US ki vachi job chestunna he is inventor of computer and mobile phone in india ani cheppesai

  • Haha 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...