Jump to content

After 70 r u ok to join in anadha ashramam?


Recommended Posts

Posted

Dont think this generation kids would able to take care of you ..

But r u ok with that Idea?

 

 

Posted

40 ke russia lo freelancer ga permit teeskunta

100$ ki month motham luxury

just an idea

Posted

Sorry very big but worth reading

కన్నపేగుకు కష్టమొచ్చింది!

300820sun-cover1a.jpg

తల్లీ తండ్రీ గురువూ దైవం... అన్నారు పెద్దలు. దేవుడికన్నా ముందు స్థానాన్ని అమ్మానాన్నలకిఇచ్చారు. వారి వారసులేమో ఇప్పుడు మాకు ఆస్తులే ముద్దు అమ్మానాన్నలు వద్దు...  అంటున్నారు. దేవుడిగా కాదు కనీసం సాటి మనిషిగానైనా చూడలేకపోతున్నారు. బయటకు గెంటేసి ఇంటికి తాళం వేసేవారొకరు, బతికుండగానే వల్లకాట్లో వదిలేసేవారొకరు. మొన్నటికి మొన్న కన్నతండ్రికి అన్నంపెట్టని పాపానికి జైలుకు వెళ్లారు ముగ్గురు కొడుకులు. ఒక్కొక్కరికీ కోటి రూపాయల ఆస్తి రాసిచ్చిన తండ్రికే ఆ గతి పడితే ఇక నిరుపేద తల్లిదండ్రుల సంగతేమిటీ... కన్నబిడ్డలు ఎందుకింత కఠినాత్ములవుతున్నారూ అంటే- దానికి ఒకటీ రెండూ కాదు, చాలానే కారణాలుంటాయంటున్నారు నిపుణులు.
బాల్యంలో చదువుల పరుగు... యవ్వనంలో కెరీర్‌ పరుగు.
పెళ్లి చేసుకుని అలా స్థిరపడ్డారో లేదో చిటికెనవేలు పట్టుకునే చిట్టితండ్రి తయారు.
అమ్మానాన్నలుగా అప్పుడు మొదలయ్యే పరుగు ఓ పాతిక ముప్పయ్యేళ్లు- అంటే, పిల్లలు స్థిరపడేవరకూ నిరంతరంగా సాగుతుంది.
అలా జీవితమంతా కుటుంబానికి ధారపోసి అలసిసొలసిన మనిషికి ఇక విశ్రాంతి తీసుకుందామనుకునే వేళకి ఏమి మిగులుతోంది...
అనారోగ్యం... అసహాయత్వం... ఒంటరితనం... వాటికి ఆస్తులు పంచమనే బిడ్డల అఘాయిత్యాలూ తోడైతే ఇక ఆ అమ్మానాన్నలకి దిక్కెవరు?
కనుచూపు లేని తల్లిదండ్రుల్ని కావడిలో మోస్తూ తీర్థయాత్రలు చేయించిన శ్రవణ కుమారుడి కథ చదువుకున్నాం.
తండ్రి మాట నిలబెట్టడానికి రాజ్యాన్నే వదిలి అడవికి వెళ్లిన రాముడిని పూజిస్తున్నాం.
తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి... అన్న నీతి పద్యాన్ని చిన్నప్పుడే కంఠతా పట్టాం.
ఆ ప్రేమ... ఆ భక్తి... ఆ నీతి... ఇప్పుడు ఏమైపోయాయి?

300820sun-cover1b.jpg

ఎంత కష్టం
ఎనభై ఐదేళ్ల పున్నయ్య ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైరయ్యాడు. ఇల్లుంది, పింఛను వస్తోంది. చదువబ్బని కొడుకు పింఛనూ పీఎఫ్‌ డబ్బూ లాగేసుకుని తండ్రిని వృద్ధాశ్రమంలో చేర్పించాడు. దానికి నెలనెలా డబ్బు కట్టకపోగా మందులు తెచ్చిపెట్టమని అడిగిన  తండ్రికి ఆ కొడుకు చెప్పిన సమాధానం- నువ్వు బతికి ఏం సాధిస్తావు, చస్తేనన్నా నాకు ఇల్లు వస్తుంది... అని.
కౌసల్యకు ఇద్దరు కొడుకులూ ముగ్గురు కూతుళ్లూ. కానీ ఎవరూ ఆమెకు గుప్పెడు మెతుకులు పెట్టలేకపోయారు. కాసిని బియ్యమూ కిరసనాయిలూ ఇచ్చి వండుకు తినమని ఒంటరిగా వదిలేసి పోయారు. నిస్సహాయురాలైన ఆమె ఆ కిరసనాయిలు ఒంటిమీద పోసుకుని నిప్పంటించుకుని ఈ లోకం నుంచే సెలవు తీసుకుంది.
విద్యాబుద్ధులు నేర్పే పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా చేసి రిటైరైన ఓ పెద్దమనిషి తొంభై ఏళ్ల ముసలి తల్లిని నిర్దాక్షిణ్యంగా బాల్కనీలో నేలపై పడుకోబెట్టి తిండీ బట్టా కూడా ఇవ్వకుండా వేధించాడు. చుట్టుపక్కలవారి ఫిర్యాదుతో పోలీసులు వచ్చి ఆమెను రక్షించాల్సి వచ్చింది. ఇలాంటి ఎన్నో వార్తలు తరచుగా పేపర్లో వస్తున్నాయి. మన సమాజంలో వృద్ధుల దుస్థితికి అద్దం పడుతున్నాయి.
పెద్దల హక్కుల కోసం కృషిచేస్తున్న ఏజ్‌వెల్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ ఒక సర్వే చేసింది. దేశవ్యాప్తంగా జరిపిన ఈ అధ్యయనం ప్రకారం మనదేశంలో నూటికి డెబ్భై ఒక్క మంది పెద్దవాళ్లు ఏదో ఒక రూపంలో సొంత కుటుంబసభ్యులూ బంధువుల నుంచే వేధింపుల్నీ అవమానాల్నీ ఎదుర్కొంటున్నారని తేలింది. ప్రతి ఇద్దరిలో ఒకరు ఇంట్లో కన్నబిడ్డల చేతిలోనే వేధింపులకు గురవుతున్నారట.
నగరాల్లోని వృద్ధులపై చేసిన మరో సర్వేలో ప్రతి ఆరుగురిలో ఒకరికి సరైన ఆహారం లభించడం లేదనీ, ప్రతి ముగ్గురిలో ఒకరికి వైద్యం అందడం లేదనీ, ప్రతి ఇద్దరిలోనూ ఒకరికి వారి వయసుకు దక్కాల్సిన గౌరవమూ ఆదరణా దక్కడం లేదనీ తేలింది. అంతేకాదు, అరవైశాతం వృద్ధుల దగ్గర చేతిలో చిల్లిగవ్వ ఉండటం లేదట. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం... వారి ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా అందరూ వేధింపులకు గురికావడం.

300820sun-cover1c.jpg

దారుణం
నా పెంకుటిల్లు అమ్మేసి తను కొనుక్కున్న కొత్త ఇంట్లోకి నా పుస్తకాల చెత్త అంతా తేవద్దన్నాడు కొడుకు... అలా పుస్తకాలు నాకు దూరమయ్యాయి.
రెండో కోడలికి కాన్పు సమయమని నా భార్యను ఆమెకు సహాయంగా పంపించారు... అలా నలభయ్యేళ్లు తోడూ నీడగా ఉన్న భార్య నాకు దూరమైంది.
నాతో ఆడుతూ టైమ్‌ వేస్ట్‌ చేస్తున్నారని మనవళ్లకి ట్యూషన్లు పెట్టారు... అలా నాకు కాలక్షేపం దూరమైంది.
రోజంతా నేనూ, నా మందులూ... అంతులేని నిశ్శబ్దమూ... వృద్ధాశ్రమంలో కన్నుమూసిన ఓ వృద్ధుడి డైరీలోని ఈ మాటలు ఎందరు వృద్ధుల గుండెచప్పుళ్లో... చెప్పలేం.
పెద్దవారిపై వేధింపులు చాలా రకాలుగా జరుగుతున్నాయి. సూటిపోటి మాటలూ దుర్భాషలాడడం మొదటి స్థానంలో ఉంటే ఆస్తులూ డబ్బుకోసం వేధించడం రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో భౌతిక దాడులు చేసేవారూ, తిండి
పెట్టకుండా, డాక్టర్‌కి చూపించకుండా ఇబ్బంది పెడుతున్నవారూ ఉన్నారు.
సాధారణంగా మన దేశంలో 75 శాతం పెద్దవాళ్లు కొడుకుల కుటుంబాలతోనే కలిసి ఉంటారు. అయినా వేధింపుల విషయానికి వచ్చేసరికి కొడుకులూ కోడళ్లే కాదు, కూతుళ్లూ అల్లుళ్ల పాత్ర కూడా ఉంటోందని అధ్యయనాలు చెబుతున్నాయి.
వయసు పెరగడం అంటే... జ్ఞానం పెరగడం, అనుభవాలు పెరగడం. అందుకే పెద్దలను జాతి సంపదగా పరిగణిస్తాయి పలు సమాజాలు. కానీ మన సమాజంలో అభద్రతా, అమర్యాదా, అసౌకర్యాల నడుమ ఆ బక్క ప్రాణాలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయి. కుంగుబాటు, నిద్రలేమి, మతిమరుపు తదితర మానసిక, శారీరక అనారోగ్యాలతో ఇబ్బందిపడుతున్నారు పెద్దలు. ఆ బాధలను తట్టుకోలేని కొందరు అనాథల్లా రోడ్డున పడుతున్నారు. ఈ
పరిస్థితి కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలకూ దారితీస్తోంది.
తప్పెవరిది!
మనదేశంలో ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. నాలుగైదు తరాలవారు కలిసి ఉండే ఆ కుటుంబాల్లో పదిమంది మధ్యా పెద్దల కాలం ప్రశాంతంగా గడచిపోయేది. ఇప్పుడు అన్నీ చిన్న కుటుంబాలే కావడంతో కుటుంబ విలువల్లోనూ మార్పు వచ్చింది. ఒకప్పుడు కుటుంబకేంద్రంగా ఉండే వ్యవహారాలన్నీ ఇప్పుడు వ్యక్తికేంద్రంగా మారిపోయాయి. నేను, నా సంసారం, నా బిడ్డలూ అన్న స్వార్థం పెరిగింది. పిల్లల్ని వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడే ప్రయోజకుల్లా తీర్చిదిద్దడం మీద పెట్టాల్సిన దృష్టి, వారికోసం ఆస్తులు సమకూర్చడం మీద పెట్టడం- పెరిగింది. పైగా ‘ఇదంతా మీకోసమే కదా’ అంటూ తరచూ పిల్లలతో అంటుంటారు. దాంతో తల్లిదండ్రుల ఆస్తికి తామే వారసులమనీ అది తమ హక్కనీ వారు భావిస్తున్నారు. ఇలాంటి భావజాలమే విలువల పతనానికీ పెద్దల పట్ల వేధింపులకీ దారితీస్తోందంటారు ఏజ్‌వెల్‌ సంస్థ అధ్యయనాన్ని విశ్లేషించిన మానసిక నిపుణులు. వారు గమనించిన మరికొన్ని కారణాలు...
పేదరికం: భార్యాభర్తలిద్దరూ పనిచేయక తప్పని పరిస్థితి వల్ల అలసి ఇంటికి వచ్చినవారు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ల ఆరోగ్యం మీదా వారి అవసరాల మీదా దృష్టి పెట్టలేకపోతున్నారు. వారి వైద్యఖర్చుల్ని అదనపు భారంగా పరిగణిస్తున్నారు. చిన్న ఇంట్లో తమతో కలసి ఉంటున్న పెద్దల్ని ప్రైవసీకి అడ్డంగా భావిస్తున్నారు. ఆ అసహాయత పెద్దల మీద కోపంగా మారుతోంది. అలాంటి పరిస్థితుల్లో స్వార్థం కొందరిలో విచక్షణనీ చంపేస్తోందనీ అందుకే పెద్దలను వేధింపులకు గురిచేస్తున్నారనీ అంటున్నారు మానసిక నిపుణులు. నేరస్వభావం ఉన్నవాళ్లు దౌర్జన్యానికీ పాల్పడుతున్నారట.
పెద్ద బాధ్యత: మానసికంగానూ భౌతికంగానూ కూడా పెద్దల బాధ్యత పెద్ద బాధ్యతే. అనారోగ్యంతోనో, వయోభారంతోనో తమ పనులు తాము చేసుకోలేని పెద్దలు ఇంట్లో ఉంటే వారిని ఒక మనిషి ఎప్పుడూ కనిపెట్టుకుని ఉండాలి. సంవత్సరాల తరబడి సేవలు చేయగలగడం అందరి వల్లా కాదు. అలాంటివారు స్వేచ్ఛగా తమ ఇష్టప్రకారం ఉండలేకపోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. అది వారి
ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
ఆధారపడాల్సి రావడం: సంపాదన కానీ ఆస్తులు కానీ లేని పెద్దలు పిల్లల మీద ఆధారపడాల్సి వచ్చినందుకు మానసికంగా ఇబ్బంది పడుతుంటారు. వైద్యం కోసమో మరొకందుకో డబ్బు అడగడానికి మొహమాటపడి తమ ఆరోగ్యాన్ని
నిర్లక్ష్యం చేస్తున్నారు.  పిల్లలతో కలిసి ఉన్నా వారికి ఒంటరితనం తప్పట్లేదు.
హక్కులు తెలియవు: చాలామంది పెద్దలకు తమ హక్కులు తెలియవు. కొందరేమో ఎప్పటికైనా పిల్లలకు చెందవలసిందే కదా అనుకుంటే, మరికొందరు వాళ్లతో గొడవెందుకని ముందుగానే ఆస్తి రాసిచ్చేస్తున్నారు. దాంతో ఆస్తులు ఉన్నవాళ్లు కూడా చివరి దశలో అసహాయులుగా మిగలాల్సి వస్తోంది.

300820sun-cover1d.jpg

చట్టం ఉంది!
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ పెరుగుతున్న వృద్ధుల జనాభానీ, వారిపై వేధింపుల్నీ గమనించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ వృద్ధుల సంరక్షణకు చట్టాలు చేయాల్సిందిగా దేశాలను కోరింది. దాంతో గత రెండు దశాబ్దాల్లోనే దాదాపుగా అన్ని దేశాలూ వృద్ధుల సంరక్షణకు చట్టాలను చేశాయి. మనదేశంలోనూ కేంద్ర ప్రభుత్వం తల్లిదండ్రుల్ని చూసుకోవాల్సిన బాధ్యత బిడ్డలదేనని చెబుతూ ‘మెయింటెనెన్స్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఆఫ్‌ పేరెంట్స్‌ అండ్‌ సీనియర్‌ సిటిజెన్స్‌ యాక్ట్‌ 2007’ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం తల్లిదండ్రులే కాదు, తాతా బామ్మలు కూడా తమను తాము పోషించుకోలేని పరిస్థితిలో వారసుల నుంచి జీవనభృతి పొందవచ్చు. అలాగే పిల్లల్లేనివారు తమ ఆస్తికి చట్టపరంగా బంధువుల్లో ఎవరైతే వారసులవుతారో వారిని తమ బాగోగులు చూసుకోవాల్సిందిగా కోరవచ్చు. తమ బాధ్యత వహించని కొడుకుపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేయవచ్చు. విచారణలో అది నిజమని తేలితే చట్టం అతడికి జరిమానా, జైలుశిక్ష విధిస్తుంది. తర్వాత కూతురికీ అల్లుడికీ కూడా తల్లిదండ్రుల బాధ్యత అప్పగిస్తూ ఆ చట్టానికి సవరణ చేశారు. ఒక్క కన్నబిడ్డలే కాదు, చట్టపరంగా సంరక్షకులు ఎవరైనా సరే- ఆఖరికి ప్రభుత్వాలతో సహా- వృద్ధుల బాధ్యత తీసుకోవాలి. చాలినన్ని వృద్ధాశ్రమాలు నెలకొల్పడం, ఆర్థికంగా ఆదుకోవటానికి వృద్ధాప్య పింఛనులివ్వడం... లాంటివి ప్రభుత్వాల బాధ్యతలు.
కానీ చూస్తూ చూస్తూ కన్నబిడ్డల మీద ఫిర్యాదు చేయడానికి తల్లిదండ్రులు ఇష్టపడక పోవడంతో చట్టం వల్ల పూర్తి ప్రయోజనం ఉండటం లేదంటారు హెల్పేజ్‌ ఇండియా అధికారి రేఖామూర్తి. ‘కన్నబిడ్డల పరువు తీసి జైలుకు పంపించడానికి వారికి ప్రాణమొప్పదు. అంతెందుకూ... హెల్ప్‌లైన్‌కి వచ్చే ఫోన్లే చాలు మన సమాజ ధోరణి గురించి చెప్పడానికి. వృద్ధాశ్రమాల వివరాలు కోరుతూ తరచూ పెద్దల నుంచీ పిల్లల నుంచీ కూడా ఫోన్లు వస్తాయి. కానీ ఎవరూ ఆ వివరాలు తమకోసమని చెప్పరు. తమ స్నేహితుల కోసం అడుగుతున్నామంటారు...’ అని చెబుతారు రేఖ.
స్వచ్ఛంద సంస్థల కృషి
కాంతమ్మకి ముగ్గురు కొడుకులు. సొంతిల్లు ఉండటంతో పెన్షన్‌తో కాలం గడుపుతోంది. ఆ ఇంటిని తమ పేర రాసివ్వమని పెద్ద కోడలూ రెండో కొడుకూ ఆమెను వేధిస్తూ బలవంతంగా ఇంట్లోనుంచి గెంటేశారు. చిన్న కొడుకు సాయంతో బయట మెట్ల కింద ఉంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాళ్లు కూడా ‘ముసలిదానివి ఎన్నాళ్లుంటావు. వాళ్లతో గొడవ పడే బదులు రాసిచ్చేస్తే పోతుందిగా’ అని చెప్పారట. పోలీసులూ వారికే వత్తాసు పలకడంతో కాంతమ్మకు దిక్కుతోచలేదు. తాను బయటకు వెళ్తే తల్లిని ఏం చేస్తారోనని చిన్న కొడుకు పనికి కూడా వెళ్లకుండా తల్లి వెంటే ఉంటున్నాడు. సంతానంలోనే కాదు, సమాజంలోనూ పాతుకుపోయిన ఈ రకమైన ఆలోచనాధోరణిలో మార్పు తేవడానికి హెల్పేజ్‌ ఇండియా, ఏజ్‌వెల్‌ లాంటి స్వచ్ఛంద సంస్థలు అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఆఫీసుల్లో యువతకు వర్కుషాపులు నిర్వహిస్తూ విశ్రాంత జీవితాన్ని ప్రణాళికాబద్ధంగా మలచుకోవడమెలాగో చెబుతున్నాయి. అలాగే యాభై ఏళ్లు పైబడిన వారికి ఆరోగ్య, ఆర్థిక భద్రత ప్రాధాన్యాన్ని వివరిస్తున్నాయి. కాలనీల్లో, అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్సుల్లో మహిళలకు సమావేశాలు ఏర్పాటుచేసి ఇంట్లో ఉన్న వృద్ధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నాయి. వేధింపులకు గురవుతున్న వృద్ధులను కని పెట్టడం ఎలాగో ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నాయి. సీనియర్‌ సిటిజెన్స్‌ అసోసియేషన్స్‌తో కలిసి ఆర్థికాంశాలూ, ప్రభుత్వ పింఛను పథకాలూ, వీలునామా, ఆస్తుల పంపకానికి సంబంధించిన చట్టాలూ తదితర విషయాలపై నిపుణుల ప్రసంగాలు ఏర్పాటుచేస్తున్నాయి. అయితే ఇవన్నీ వేధింపులను నివారించడానికి బయటవారు చేపట్టే చర్యలే. అసలు వేధింపుల ప్రశ్నే తలెత్తకూడదనుకుంటే మనుషుల్లోనే మార్పు రావాలి, గౌరవంగా బతికే హక్కు పెద్దలకు ఉందని తెలుసుకోవాలి. వారికి ఏం కావాలో తెలుసుకుని మసలుకోవాలి- అంటారు ఏజ్‌వెల్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ హిమాంశు రథ్‌.

300820sun-cover1e.jpg

పెద్దలకేం కావాలి...
పంచప్రాణాలూ బిడ్డల మీద పెట్టుకుని బతికే పెద్దలు ఆ బిడ్డల నుంచి ఆశించేదేమిటీ... ప్రేమపూర్వక పలకరింపు. ఆత్మీయమైన స్పర్శ. వాటికి డబ్బు అక్కర్లేదు. కాస్త సమయం కేటాయిస్తే చాలు.
కుటుంబసభ్యులందరూ కలసి చర్చించుకుని తలా ఒక బాధ్యతా తీసుకుంటే ఇళ్లల్లో పెద్దలను చూసుకోవడం అంత కష్టమేం కాదంటారు మనస్తత్వ నిపుణులు. అందుకు వారు చెబుతున్న సూచనలేమిటంటే-
* రోజూ కాసేపు వారితో గడపాలి. అవసరాలు కనుక్కుంటూ ఉండాలి. ఒక్కపూటైనా వారితో కలిసి భోజనం చేయాలి.
* కుటుంబవిషయాలు చర్చిస్తూ సలహాలు తీసుకోవడం వల్ల వారికి తగిన గౌరవం ఇచ్చిన వారవుతారు.
* మనవలూ మనవరాళ్లతో ఆడుకోనివ్వాలి. తరాల అంతరాన్ని సహజంగా తీసుకోవాలి కానీ చాదస్తంగా భావించకూడదు.
* పెద్దలకు దూరంగా ఇతర ప్రాంతాల్లో ఉండేవారు రోజూ తప్పనిసరిగా ఫోనులో వారిని పలకరించాలి. తరచూ తమ పిల్లలతోనూ మాట్లాడించాలి.
* ఒంటరిగా ఉండే వృద్ధులకు నమ్మకస్తులైన సంరక్షకులను ఏర్పాటుచేయాలి.
* వృద్ధాశ్రమంలో ఉంచినట్లయితే అక్కడ అన్ని వసతులూ సరిగా ఉన్నాయో లేదో తెలుసుకుంటూ ఉండాలి. ఆశ్రమాల్లోనూ సంరక్షకుల వల్ల వేధింపులు చోటుచేసుకునే ప్రమాదం ఉంది, ఆ విషయం చెబితే
ఏమవుతుందోనని కొందరు చెప్పరు. వారి ప్రవర్తననీ, ఆరోగ్య పరిస్థితినీ జాగ్రత్తగా గమనిస్తే అలాంటి సమస్యలు ఏమన్నా ఉంటే తెలిసిపోతుంది.

* * * *

ఓ యువకుడు మొదటి జీతం అందుకున్న సందర్భంగా తన ఎనబై ఏళ్ల తాతను హోటల్లో డిన్నర్‌కి తీసుకెళ్లాడు. భోజనం మధ్యలో ఆయనకు పొలమారింది. కంగారులో చేయి పాత్రకు తగిలి పెద్ద శబ్దంతో కింద పడింది. దాంట్లోని కూర టేబుల్‌మీదా ఆయన దుస్తులమీదా పడింది. చుట్టు పక్కల ఉన్నవారంతా చిరాగ్గా చూశారు. ‘న్యూసెన్స్‌’ అని గొణుక్కున్నారు. యువకుడు అదేమీ పట్టించుకోకుండా తాతకు నీళ్లు తాగించి వాష్‌రూమ్‌కి తీసుకెళ్లి దుస్తులు శుభ్రంచేశాడు. జేబు రుమాలుతో ఆయన ముఖం తుడిచి కళ్లజోడును సరిగ్గా పెట్టాడు. చేయి పట్టుకుని తీసుకొచ్చి మరో కుర్చీలో కూర్చోబెట్టి తన చేత్తో అన్నం తినిపించాడు. బిల్లు చెల్లించి తాత చెయ్యి పట్టుకుని వెళ్లిపోతున్న యువకుడితో కౌంటర్‌లో ఉన్న మేనేజరు ‘బాబూ నువ్వేదో వదిలి వెళ్తున్నట్లున్నావు...’ అన్నాడు.
వెనక్కి తిరిగి తాను కూర్చున్న టేబుల్‌ వైపు చూసిన యువకుడు ‘ఏమీ లేదే...’ అని ఆయనవైపు ప్రశ్నార్థకంగా చూశాడు.
‘ఎందుకు లేదు... ప్రతి కొడుక్కీ ఒక పాఠం. ప్రతి తండ్రికీ ఒక నమ్మకం...’ అంటూ అభినందనగా ఆ యువకుడి భుజం తట్టాడు మేనేజరు.


వృద్ధాశ్రమాలేవీ!

మనదేశంలో వృద్ధుల జనాభా 2011 నాటికే పదికోట్ల పైన ఉంది. 2026 నాటికి అది 17 కోట్లు అవుతుందని అంచనా. ఇన్ని కోట్ల మంది వృద్ధులు ఉంటే దేశం మొత్తమ్మీద లక్ష మందికి సరిపోయే వృద్ధాశ్రమాలు కూడా లేవు. అవును, మనదేశంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన వృద్ధాశ్రమాల సంఖ్య కేవలం 728. అందులో 325 మాత్రమే ఉచితం. తెలంగాణలో 104, ఆంధ్రప్రదేశ్‌లో 267 వృద్ధాశ్రమాలు ఉంటే అందులో రెండేసి మాత్రమే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నాయి. నిజానికి సీనియర్‌ సిటిజెన్స్‌ యాక్ట్‌ ప్రకారం కనీసం 150 మందికి ఆశ్రయమిచ్చేలా ప్రతి జిల్లాకీ ఓ వృద్ధాశ్రమం ఉండాలి. ఆశ్రమాలూ వృద్ధులకు సంబంధించిన పథకాలూ తదితర సమాచారం కోసం హెల్పేజ్‌ ఇండియా వారి హెల్ప్‌లైన్‌ నంబరు: 1800-180-1253

Posted

Retired government employees get monthly pension deposited directly to their bank account. In the article it's mentioned that the pension money is fully  taken by the son and he joined him in old age home.

 

Posted
8 minutes ago, Truth_Holds said:

Retired government employees get monthly pension deposited directly to their bank account. In the article it's mentioned that the pension money is fully  taken by the son and he joined him in old age home.

 

You have 2 options 

either get lumsum or take in installments. So probably first one ayi vuntadhi.

Posted
2 hours ago, Murari_Murari said:

Dont think this generation kids would able to take care of you ..

But r u ok with that Idea?

 

 

@Vendeetta is serving our db @OreyPandhi telling to @tom bhayya

 

2 hours ago, Murari_Murari said:

Dont think this generation kids would able to take care of you ..

But r u ok with that Idea?

 

 

 

Posted
3 hours ago, Murari_Murari said:

Dont think this generation kids would able to take care of you ..

But r u ok with that Idea?

 

 

Now only i am ready to join anadha ashramam.  Whats so big deal in joining ? Not depending is an awesome thing.

 Hare ram hare krishna valladi undi 30,000 per month.  Its not anadha ashramam but you can pay and stay. Vere states ki vellachu and undachu too if you want to go for pilgrimage. My parents want to join eventually. They inquired too.

But, i am going to mars :( 

  • Upvote 1
Posted
2 minutes ago, Amrita said:

Now only i am ready to join anadha ashramam.  Whats so big deal in joining ? Not depending is an awesome thing.

 Hare ram hare krishna valladi undi 30,000 per month.  Its not anadha ashramam but you can pay and stay. Vere states ki vellachu and undachu too if you want to go for pilgrimage. My parents want to join eventually. They inquired too. 

Wassup

Posted
Just now, Amrita said:

Now only i am ready to join anadha ashramam.  Whats so big deal in joining ? Not depending is an awesome thing.

 Hare ram hare krishna valladi undi 30,000 per month.  Its not anadha ashramam but you can pay and stay. Vere states ki vellachu and undachu too if you want to go for pilgrimage. My parents want to join eventually. They inquired too. 

Wow good to know but not everyone is super devote to god to enjoy.

Honest ga Intermediate lo luxury colleges vunatu luxury anadrasham pedithay people may enjoy more their retired life.

Just club ashrama with anadha saranalyam deadly combination. 

But thanks for sharing though.

Posted
13 minutes ago, VictoryTDP said:

Wassup

Routine. How are you doing?

But, i am going to mars :(

Posted
13 minutes ago, Murari_Murari said:

Wow good to know but not everyone is super devote to god to enjoy.

Honest ga Intermediate lo luxury colleges vunatu luxury anadrasham pedithay people may enjoy more their retired life.

Just club ashrama with anadha saranalyam deadly combination. 

But thanks for sharing though.

God ki em sambandham? They want to stay there to be independent and not depend on kids when they are not physically active . Thats a luxury ashram aey where you can stay at peace with like minded people rather. 

Bochadu unnayi already ilantivi.

But, i am going to mars :(

Posted
10 minutes ago, VictoryTDP said:

All good, same here.

cool .

But, i am going to mars :(

Posted
50 minutes ago, Amrita said:

cool .

But, i am going to mars :(

Abhirama visa approve chesaadaa ? He owns mars know ? 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...