r2d2 Posted August 30, 2020 Report Posted August 30, 2020 వివాహాలు చేసుకొని రూ.లక్షలు కాజేసిన మహిళ ఇంటర్నెట్ డెస్క్: డబ్బు కోసం నిత్య పెళ్లి కుమారుడిగా మారిన పలువురి గురించి మనం విని ఉంటాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్.. డబ్బు కోసం ఓ మహిళ పలు వివాహాలు చేసుకుంది. మ్యాట్రిమొనీ సైట్లలో యువకులకు ఒక్కో పేరుతో వల వేసి వివాహం చేసుకొంటుంది. అనంతరం కొన్నాళ్లకు భర్త వేధిస్తున్నాడంటూ కేసులు పెట్టి డబ్బు వసూలు చేయడం ఆమెకు నిత్యకృత్యం. ఇలా ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుంది. స్వప్న, హర్షిణి, కావ్య పేర్లతో పలువురిని మోసం చేసింది. చివరకు పోలీసుల చేతికి చిక్కి కటకటాలకు వెళ్లింది. పోలీసుల వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన మహిళ ముందుగా తన మేనమామను వివాహం చేసుకుంది. విబేధాల సాకుతో కొన్నాళ్లకు అతడి నుంచి విడిపోయింది. తర్వాత తిరుపతికి చెందిన ఓ వ్యక్తిని మనువాడింది. కొన్ని రోజులకే అతడి నుంచి విడిపోయి వేధింపుల కేసు పెట్టింది. కర్నూలు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.25 లక్షలు కాజేసింది. ప్రకాశం జిల్లాకు చెందిన మరో వ్యక్తి సైతం ఆమె చేతిలో మోసపోయాడు. సదరు మహిళ స్నేహితురాలి ధ్రువపత్రాలను మార్ఫింగ్ చేసి అదే పేరుతో చలామణి అవుతూ పోలీసులకు చిక్కింది. Quote
r2d2 Posted August 30, 2020 Author Report Posted August 30, 2020 16 minutes ago, Hydrockers said: Db yuth kasta jagratta + 🛍 enthusiasts..😀 Quote
Sucker Posted August 30, 2020 Report Posted August 30, 2020 1 minute ago, Murari_Murari said: Why they hide her face? Future la malla ammai kada pelli kaadanta Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.