Jump to content

Recommended Posts

Posted
పార్కులో వర్కౌట్‌ చేస్తుండగా.. వీడియో వైరల్‌పొట్టిదుస్తులు వేసుకుందని హీరోయిన్‌పై దాడి!

బెంగళూరు: కన్నడ కథానాయిక సంయుక్త హెగ్డే, ఆమె స్నేహితులపై కొందరు దాడికి దిగారు. పొట్టి దుస్తులు వేసుకుని పార్కులో కసరత్తులు చేస్తున్నారని దూషించి, దాడి చేశారు. అంతేకాదు కన్నడ చిత్ర పరిశ్రమలోని డ్రగ్స్‌ రాకెట్‌ కేసులో తనను కూడా ఇరికిస్తామని బెదిరించినట్లు సంయుక్త శనివారం ఇన్‌స్టా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం బెంగళూరులోని అగర సరస్సు సమీపంలో ఉన్న పార్కులో ఈ ఘటన చోటుచేసుకుంది. సంయుక్త ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. సోషల్‌మీడియా వేదికగా తన అనుచరులకు కూడా సూచనలు, సలహాలు చెబుతుంటారు. ఇప్పటికే ఆమె ఫిట్‌నెస్‌కు సంబంధించి పలు వీడియోలు, ఫొటోలు షేర్‌ చేశారు.

ఈ నేపథ్యంలో కసరత్తులు చేయడానికి మంగళవారం సాయంత్రం సంయుక్త తన స్నేహితులతో కలిసి పార్కుకు వెళ్లారు. వ్యాయామం చేస్తుండగా ఓ మహిళ తనపై దాడికి దిగిందని, పబ్లిక్‌లో స్పోర్ట్స్‌‌ అవుట్‌ఫిట్‌ వేసుకున్నందుకు అసభ్యంగా మాట్లాడిందని సంయుక్త ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపారు. అంతేకాదు ఎటువంటి కారణం లేకుండా తన స్నేహితులపై చేయిచేసుకుందని బాధపడ్డారు. ఇదే సమయంలో కొందరు యువకులు తన చుట్టూ చేరి.. చిత్ర పరిశ్రమలోని డ్రగ్స్‌ మాఫియాతో తనకు సంబంధాలు ఉన్నట్లు చెప్పి, ఇరికిస్తామని బెదిరించినట్లు సంయుక్త వీడియోలో పేర్కొన్నారు. ట్విటర్‌ వేదికగా బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ఇవాళ మనం చేసే పనులే రేపు మన దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అగర సరస్సు వద్ద ఉన్న పార్కులో కవితా రెడ్డి (దాడి చేసిన మహిళ) మమ్మల్ని దారుణంగా వేధించింది. ఇది సరైన పద్ధతి కాదు. దయచేసి పోలీసులు చర్యలు తీసుకోవాలి’ అని ఆమె పేర్కొన్నారు. వీడియోలు చూసిన అభిమానులు సంయుక్తకు మద్దతు తెలిపారు. ఇవి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. నటి ప్రస్తుతం తమిళ సినిమా ‘పప్పీ’లో నటిస్తున్నారు. మరోపక్క ఆమె కథానాయికగా ఓ కన్నడ సినిమా రూపొందుతోంది. లాక్‌డౌన్‌ కారణంగా ఈ చిత్రం షూటింగ్‌ ఆగిపోయింది.

 

Posted
2 hours ago, r2d2 said:

కవితా రెడ్డి

calling reddy sangham

Posted

Karnataka lo kooda teddy arachakam , inko saari  CBN Telugu vallani inspire cheyali 

Posted

Chala godava avtondi social media lo... Aa constable sleeveless pics esi samyu fans tidutunnaru

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...