Jump to content

Recommended Posts

Posted

ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్న మౌనరాగం సీరియల్‌ ఫేమ్‌ శ్రావణి
దేవరాజ్‌రెడ్డి బెదిరింపులే కారణమంటూ తల్లిదండ్రుల ఫిర్యాదు
పరారీలో నిందితుడు09Main-5a.jpg

Posted

ఈనాడు, హైదరాబాద్‌, అమీర్‌పేట, న్యూస్‌టుడే: మానసిక, లైంగిక వేధింపులు మరో బుల్లితెర నటిని బలిగొన్నాయి. రంగుల ప్రపంచంలో భవిష్యత్తును వెతుక్కున్న ఆమె కలలను కాల్చేశాయి. సినిమాల్లో నటించాలనే కోరికతో ఎక్కడో కాకినాడ నుంచి హైదరాబాద్‌ వచ్చి చివరికి టీవీ నటిగా అవకాశాలు అందుకున్న ఆమె మానసికంగా కుంగిపోయి చివరికి అర్ధంతరంగా తనువు చాలించారు. హైదరాబాద్‌ ఎస్సార్‌నగర్‌ ఠాణా పరిధి మధురానగర్‌లోని తన నివాసంలో మంగళవారం రాత్రి ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం ఉదయం గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలిôచగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులుతేల్చారు. తాను ప్రేమించిన వ్యక్తి వేధింపులే కుమార్తె మరణానికి కారణమని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసుల కథనం ప్రకారం..కాకినాడ సమీపంలోని గొల్లప్రోలుకు చెందిన కొండపల్లి భాస్కర్‌రావు, పాపరత్నం దంపతుల కుమార్తె శ్రావణి(26) సినిమాల్లో నటించాలనే కోరికతో కుటుంబంతో సహా ఎనిమిదేళ్ల కిందట హైదరాబాద్‌ వచ్చారు. ప్రస్తుతం మధురానగర్‌లో నివాసం ఉంటున్నారు. సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న ఆమెకు టీవీ సీరియల్స్‌లో అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం మౌనరాగం, మనసు మమత వంటి సీరియళ్లలో నటిస్తున్నారు. టిక్‌టాక్‌ ద్వారా గతేడు కాకినాడకు చెందిన దేవరాజ్‌రెడ్డి ఆమెకు పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటాననే ప్రతిపాదన తేవడంతో శ్రావణి అందుకు అంగీకరించింది.గతేడాది సెప్టెంబరులో అతను హైదరాబాద్‌ రాగా, తన ఇంట్లోనే ఉండేలా ఆమె తల్లిదండ్రులను ఒప్పించింది కూడా. కొంతకాలం తర్వాత అతను పలువురు అమ్మాయిలతో ఫోన్‌లో సన్నిహితంగా మాట్లాడటాన్ని గుర్తించి నిలదీయడంతో అతను ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.
అప్పట్నుంచి వేధింపులు ఆరంభం
ఆ తర్వాత అప్పుడప్పుడూ డబ్బులు కావాలంటూ ఫోన్‌ చేసేవాడు. ఒకసారి రూ.30 వేలు ఇవ్వగా, తర్వాత రూ.లక్ష కావాలంటూ డిమాండ్‌ చేశాడు. అడిగినంత ఇవ్వకపోతే ఇద్దరం సన్నిహితంగా మెలిగిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఉంచుతానంటూ బెదిరించడం ఆరంభించాడు. రెండుసార్లు డబ్బులిచ్చినా వేధింపులు ఆగకపోవడంతో ఆమె జూన్‌ 22న హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్‌ పీఎస్‌లో అతనిపై ఫిర్యాదు చేసింది. దేవరాజ్‌రెడ్డి ఫిబ్రవరి 25న తనపై అత్యాచారయత్నం చేసినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, నోటీసు జారీ చేసి మిన్నకుండిపోయారు.09Main-5b-R.jpg

Posted

ee small time actress la baadhalu maamul ga undav... krishna nagar lo konni 1000s mandi untaru veella laaga and everyone wants to exploit them

Posted

why girls always choose wrong guys\

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...