manadonga Posted September 17, 2020 Report Share Posted September 17, 2020 వికేంద్రీకరణ జాడలు బైబిల్లో కీ.పూ. 1805లో కనిపిస్తాయి. ఈజిప్టు ఫరో బానిసత్వం నుంచి ఇజ్రాయెలీయులు మోజెస్ నాయకత్వంలో విముక్తి పొందాక, వారందరికీ జెహోవా ధర్మశాస్త్రం ప్రకారం వ్యాజ్యాలు తీర్చవలసిన బాధ్యత మోజెస్ మీద పడుతుంది. మోజెస్ మామ ఇత్రో అది గమనించి, ‘ప్రతిదీ నువ్వే చూడాలి అంటే నువ్వు నలిగి పోతావు, ప్రజలకు సకాలంలో న్యాయం అందడం ఆలస్యం అవుతుంది, వాళ్ళను వేర్వేరు గణాలుగా విడగొట్టి ఎంపిక చేసిన వారికి వాటిని అప్పగించు. వాళ్ళతో కానివి నువ్వు పరి ష్కరించు’ అంటాడు. మామ సలహా ప్రకారం మోజెస్ న్యాయాధిపతులను నియమిస్తాడు. మోజెస్ తర్వాత జాషువా యుద్ధంలో కానన్ దేశాన్ని ఆక్రమించి తెగల ప్రాతి పదికగా భూమిని గణరాజ్యాలుగా విడగొట్టి వాటి సరిహద్దు మ్యాప్లు సిద్ధం చేసిన భూమిని వారికి అప్పగిస్తాడు. ఆధునిక రాజ్యం ఉపాంగాలు అయిన– ప్రజలు, ప్రాంతం, ప్రభుత్వం, ఈ మూడు అంశాలతో తొలిసారిగా ఊపిరి పోసుకున్న ‘రాజ్యం’ పుట్టుక ఛాయలు ఇక్కడ చూస్తాం. తాత్వికులు ‘పోస్ట్ మోడరన్’ అంటున్న ఇప్పటి కాలం లోకి రావడానికి ఇప్పటికే దాటి వచ్చిన మజిలీలను కలగాపులగం చేస్తే, ఇక్కణ్ణించి ముందుకు మనకు దారి దొరకదు. ఇప్పటికీ మనకది అర్థం కానప్పుడు, ఇది – ‘లాస్ట్ క్రై’ గానే మిగులుతుంది. Quote Link to comment Share on other sites More sharing options...
MiryalgudaMaruthiRao Posted September 17, 2020 Report Share Posted September 17, 2020 thank you @BrotherAnil Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.