DaatarBabu Posted September 23, 2020 Report Posted September 23, 2020 గుళ్లపై దాడులను ఎందుకు ఖండించరు? మంత్రుల వ్యాఖ్యలకు సాధువుల కన్నీరు ప్రశాంత రాష్ట్రంలో మత చిచ్చు రాష్ట్రాన్ని తగలబెట్టాలని చూస్తున్నారు చంద్రబాబు ఆగ్రహం టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ Quote
DaatarBabu Posted September 23, 2020 Author Report Posted September 23, 2020 అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): దేవాలయాలపై అనేక దాడులు జరుగుతున్నా సీఎం జగన్ ఎందుకు ఖండించడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నిలదీశారు. రాష్ట్రంలో అరాచకాల వెనుకా ఆయన హస్తం, ప్రోత్సాహం ఉందని ఆరోపించారు. మంగళవారం పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘రథాలకు నిప్పు, విగ్రహాల ధ్వంసం, ఆలయాల్లో అరాచకాలు గతంలో ఎన్నడూ లేవు. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం మాట్లాడరు. సంఘటనలు జరిగిన ఆలయాలను సందర్శించరు. భక్తులకు భరోసా ఇవ్వరు. నిందితులను హెచ్చరించరు. తన మంత్రులతో మాత్రం అవాకులు, చవాకులు మాట్లాడిస్తున్నారు. ఇది తప్పని చెప్పేవాళ్లే వైసీపీలో లేరు. బూతులు తిడితే శభాష్ అంటారు. మంత్రుల వ్యాఖ్యలకు సాధువులు కంటతడి పెడుతున్నారు. ప్రశాంత రాష్ట్రంలో మత చిచ్చు రగిలుస్తున్నారు. సీఎం ఏ మతస్ధుడైనా అన్ని మతాలను సమ దృష్టితో చూడాలి. ఓట్ల కోసం ఎన్నికల ముందు హిందూ మ తం స్వీకరించినట్లు నాటకమాడారు. ఎన్నికలు కాగానే బైబిల్ పక్కన పెట్టుకుని ప్రమాణం చేశారు. ఓట్ల రాజకీయం తప్ప దేనిపైనా విశ్వాసం లేదు. నేరగాళ్లలో విచ్చలవిడి స్వభావాన్ని పెంచేలా ఆయన ప్రవర్తిస్తున్నారు’అని దుయ్యబట్టారు. ఇంకా ఏమన్నారంటే.. ఎందుకు చొక్కాలు చించుకుంటున్నారు..? ‘అమరావతిలో ఏమీ లేకపోయినా ఏదో జరిగినట్లుగా బురదజల్లారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు మొత్తం ఖ ర్చు పెట్టిందే రూ.700 కోట్లు. అయితే రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇంతకంటే దిగజారుడుతనం మరొకటి లేదు’ టీడీపీ ఎమ్మెల్యేల కొనుగోలు ‘జగన్‌కు తన కేసుల విచారణ వేగవంతం చేస్తున్నారని కోర్టులపై అక్కసు పెంచుకొన్నారని, అందుకే న్యా యమూర్తులు, కోర్టులపై బురదజల్లడానికి తెగబడుతున్నారు. పెరుగుతున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి టీడీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి చే ర్చుకుంటున్నారు. టీడీపీ నుంచి ఎవరినైనా తీసుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించే తీసుకుంటాం. ఏదైనా పొరపాటు జరిగితే స్పీకర్ వెంటనే వారిపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీలో జగన్ పెద్ద ఉపన్యాసమిచ్చారు. సభా నాయకుడు చాలా గొప్పగా చెప్పారని, ఎవరైనా సరే రాజీనామా చేసి.. గెలిచి మళ్లీ రావాలని స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా చెప్పారు. మరి ఇప్పుడు ఏం జరుగుతోంది? ఆ ఉపన్యాసాలు ఎటు పో యాయి? ఆ నీతి వాక్యాలు మళ్లీ పలకరేం?’ అన్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.