ParmQ Posted September 26, 2020 Report Posted September 26, 2020 ప్రేమ పెళ్లి చేసుకుందని.. కూతురి భర్త దారుణ హత్య ఇంట్లోంచి బలవంతంగా తీసుకెళ్లి దారుణం గచ్చిబౌలిలో కిడ్నాప్.. సంగారెడ్డిలో మర్డర్ కిరాయి హంతకులకు రూ.10 లక్షల సుపారీ ముళ్లపొదల్లో మృతదేహాన్ని పడేసిన కిరాతకులు యువతి తండ్రి సూత్రధారి.. మేనమామలు, బావలు, వదినలు పాత్రధారులు 12 మందిని అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు హైదరాబాద్ సిటీ/గచ్చిబౌలి/ చందానగర్/మంగళ్‌హాట్,, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): మరో కులోన్మాద హత్య.. కూతురి ప్రేమ పెళ్లిని అంగీకరించక సుపారీ ఇచ్చి, ఆమె భర్తను చంపించిన తల్లిదండ్రులు. రెండేళ్ల క్రితం మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యను రాష్ట్ర ప్రజలు ఇంకా పూర్తిగా మరువక ముందే సరిగ్గా అలాంటి ఘటనే హైదరాబాద్ నగర శివారులో చోటుచేసుకుంది. తమ కులం కాని, తమ అంతస్తుకు తగని వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కారణంతో కన్నవారే కర్కశంగా కూతురి భర్తను హత్య చేయించారు. ఇంట్లో నుంచి తీసుకెళ్లి.. మరీ చంపించారు. శుక్రవారం తెల్లవారుజామున వెలుగుచూసిన ఈ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి, వైశ్య సామాజికవర్గానికి చెందిన అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకోగా.. ఇది ఇష్టం లేని అమ్మాయి తల్లిదండ్రులు ఈ దారుణానికి ఒడిగట్టారు. మాదాపూర్ ఇన్చార్జి డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించిన వివరాల ప్రకారం.. చందానగర్‌కు చెందిన దొంతిరెడ్డి లక్ష్మారెడ్డి కూతురు అవంతిరెడ్డి (23), అదే ప్రాంతంలో ఉంటున్న చింత మురళీకృష్ణ కుమారుడు చింత యోగ హేమంత్‌కుమార్ (28) ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి ఇరుగు పొరుగు ఇళ్లలోనే ఉండేవారు. అమ్మాయి తండ్రి రేషన్ డీలర్‌షిప్‌తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. హేమంత్ తల్లిదండ్రులు గుంటూరు జిల్లా పిడుగురాళ్ల నుంచి 20 ఏళ్ల క్రితంనగరానికి వచ్చారు. తండ్రి మురళీకృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారంతోపాటు పెయింటింగ్ ట్రాక్టర్‌గా చేస్తున్నారు. తల్లి బ్యూటీపార్లర్ నిర్వహిస్తున్నారు. కాగా, అవంతి, హేమంత్ల ప్రేమ విషయం తెలుసుకున్న అవంతి తల్లిదండ్రులు గతేడాది నవంబరు నుంచి ఆమెను సుమారు 8 నెలలపాటు ఇంటినుంచి బయటకు రాకుండా చేశారు. కాగా, 2020 జూన్ 9న అవంతిరెడ్డి రహస్యంగా బయటకు వచ్చింది. హేమంత్‌ను కలిసి జూన్ 10న బీహెచ్ఈఎల్లోని సంతోషిమాత ఆలయంలో వివాహం చేసుకున్నారు. అనంతరం నేరుగా సైబరాబాద్ కమిషనరేట్‌కు వెళ్లి కమిషనర్ సజ్జనార్‌ను కలిశారు. రక్షణ కల్పించాలని కోరారు. దీంతో ఆయన ధైర్యం చెప్పి చందానగర్ పోలీ్‌సస్టేషన్‌కు పంపించారు. చందానగర్ పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆస్తులు రాసి ఇచ్చేసిన అవంతి... యువతి తల్లిదండ్రుల డిమాండ్ మేరకు అవంతిరెడ్డి తన పేరున ఉన్న ఆస్తిపాస్తులన్నింటినీ పోలీస్ స్టేషన్లో తన తల్లిదండ్రులకు రాసి ఇచ్చేసి భర్తతో వెళ్లిపోయింది. ఆ సమయంలోనే ఆమె మేనమామ యుగంధర్‌రెడ్డి మీ సంగతి చూస్తాం అంటూ వారిని బెదిరించాడు. హేమంత్ తల్లి దండ్రులనూ హెచ్చరించాడు. దీంతో అవంతి, ఆమె మామ మురళీకృష్ణ చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, దంపతులు గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. హేమంత్‌కుమార్ డిగ్రీ పూర్తిచేసి ఇంటీరియర్, పెయింటింగ్ వర్క్ కాంట్రాక్ట్ చేస్తున్నాడు. తమ కులం కాని వ్యక్తిని పెళ్లి చేసుకుందని, వారికి సొంత ఇల్లు కూడా లేదని, అప్పుల్లో ఉన్నారని అవంతి తల్లిదండ్రులు భావించారు. ఎలాగైనా అతణ్ని అడ్డు తొలగించాలని నిర్ణయించుకున్నారు. అందుకు యువతి తండ్రి లక్ష్మారెడ్డి తన బావమరుదులు, వారి కొడుకుల సహకారం తీసుకున్నాడు. పట్టపగలు కిడ్నాప్.. రాత్రి హత్య... అవంతి తండ్రి లక్ష్మారెడ్డి సూచనల మేరకు.. రంజిత్‌రెడ్డి అతని భార్య స్పందన, రాకే్‌షరెడ్డి, విజయేందర్‌రెడ్డి, సంతో్‌షరెడ్డి, స్వప్న, సందీ్‌పరెడ్డి, యుగేందర్‌రెడ్డి, రజిత, డ్రైవర్ సాహెబ్ పటాన్లు (వారంతా యువతి మేన మామలు, మేన భావలు సహా అత్తలు, వదినలు) మొత్తం 13 మంది గురువారం మధ్యాహ్నం 2:30 గంటలకు మూడు కార్లలో గచ్చిబౌలిలోని హేమంత్ ఇంటికి వెళ్లారు. తమ ఇంటికి వెళ్లి మాట్లాడుకుందామని చెప్పి.. ఇద్దరిని బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. గౌలిదొడ్డి మీదుగా గోపన్‌పల్లి వైపు తీసుకువెళ్లగా అనుమానం వచ్చిన అవంతి తన తండ్రికి ఫోన్ చేసింది. కానీ ఆయన స్పందించకపోవడంతో అనుమానం మరింత బలపడింది. వెంటనే రన్నింగ్‌లో ఉన్న కారులో నుంచి కిందకు దూకి హేమంత్‌ను కూడా కిందకు లాగింది. ఇద్దరూ లింగంపల్లి వైపు పారిపోతుండగా.. అమ్మాయి మేనమామ యుగందర్‌రెడ్డి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి మరో కారులో వచ్చి హేమంత్‌ను బలవంతంగా ఎక్కించుకుని వెళ్లిపోయాడు. మిగిలిన వారు అవంతిని వెంబడించడంతో ఆమె హేమంత్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం అందించింది. వారు వెంటనే చందానగర్ పోలీసులకు, 100డయల్ చేసి చెప్పారు. వారు గచ్చిబౌలి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా, దుండగులు కారులో హేమంత్‌ను కొట్టుకుంటూ కొలూ రు మీదుగా ఓఆర్ఆర్ పైకి ఎక్కి అక్కడి నుంచి పటాన్చెరు వద్ద దిగారు. అటునుంచి సంగారెడ్డి వైపు తీసుకెళ్లారు. ఈ లోపు గచ్చిబౌలి పోలీసులు, హే మంత్ తల్లిదండ్రులు అవంతిని కలిశారు. అమ్మా యి తండ్రి లక్ష్మారెడ్డి, తల్లి అర్చనారెడ్డి, బంధువులు రంజిత్‌రెడ్డి, రాకే్‌షరెడ్డి, సందీ్‌పరెడ్డి, సంతో్‌షరెడ్డి, జితేందర్‌రెడ్డి, స్వప్న, రజిత, స్పందనను స్టేషన్‌కు తరలించా రు. వీరంతా స్టేషన్లో ఉండగానే దారుణం జరిగింది. జహీరాబాద్‌లో మద్యం, తాడు కొనుగోలు జహీరాబాద్‌లో మద్యం, తాడు కొనుగోలు చేసిన దుండగులు హేమంత్ కాళ్లు చేతులు కట్టేశారు. కారులోనే అతని మెడకు తాడుతో ఉరిబిగించి హత్యచేశారు. అనంతరం సంగారెడ్డిలోని గీతం కాలేజీ నుంచి లోపలికి సుమారు 20 కిలోమీటర్ల మేర నిర్మానూష్య ప్రాంతానికి హేమంత్‌కుమార్‌ను తీసుకువెళ్లి కిష్టాయిగూడ గ్రామ శివారు పొలాల వద్ద ఉన్న పొదల్లో మృతదేహాన్ని పడవేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత శామీర్‌పేటకు వెళ్లిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. కాగా తెల్లవారు జామున 3:30 గంటల సమయంలో యుగేందర్‌రెడ్డి ఫోన్ స్వీచ్ఆన్ చేయడంతో గచ్చిబౌలి పోలీసులు ట్రేస్ చేసి యుగేందర్‌రెడ్డి, అతని డ్రైవర్, బిచ్చుయాదవ్ను అదుపులోకి తీసుకుని పోలీ్‌సస్టేషన్‌కు తీసుకువచ్చారు. వారిని విచారించగా హేమంత్‌ను తామే చంపేశామని చెప్పారు. అవంతిరెడ్డిని, హేమంత్ తల్లిదండ్రులను పోలీసులు ఘటనా స్థలానికి తీసుకెళ్లి చూపించారు. ముఖానికి గాజుపెంకులు గుచ్చుకొని రక్తగాయాలతో మృతదేహం పడి ఉండటంతో వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ప్రధాన నిందితుడు యుగేంధర్‌రెడ్డి, బిచ్చుయాదవ్ను అరెస్టు చేశా రు. వారి నుంచి మూడు కార్లు, ఒక బైక్, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా, రూ.10 లక్షల సు పారీ తీసుకొని హత్య చేసిన ఆర్సీపురంనకు చెందిన బిచ్చు యాదవ్ పట్టుబడగా, ఎరుకల కృష్ణ, బాషా, పటాన్‌చెరుకు చెందిన జగన్, సయ్యద్ పరారీలో ఉన్నారు. పోస్ట్‌మార్టం పూర్తి హేమంత్ మృతదేహానికి ఉస్మానియా మార్చురీలో శుక్రవారం ఫోరెన్సిక్ విభాగం వైద్యులు డాక్టర్ ఝాన్సీ బృందం పోస్ట్ మార్టం నిర్వహించారు. హేమంత్ మొఖంపై గీసుకొపోయి రక్తపు మరకలు కనిపించినట్లు ఫోరెన్సిక్ నిపుణులు తెలిపారు. మృతుడి గొంతుకు తాడును బిగించి ఊపిరాడకుండా చేయడంతో ప్రాణాలను కోల్పోయినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. శుక్రవారం మధ్యాహ్నం 3.40 గంటల సమయంలో హేమంత్ మృతదేహాన్ని అతని భార్య అవంతి, తండ్రి మురళీకృష్ణ, తల్లి రాణీలకు అప్పగించారు. చందానగర్‌లో శనివారం హేమంత్ అంత్యక్రియలు పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు మొదలు పెట్టగా.. హేమంత్ సోదరుడు యూకే నుంచి రావాల్సి ఉండడంతో అవంతి విజ్ఞప్తి మేరకు మృతదేహాన్ని కాంటినెంటల్ ఆసుపత్రిలో భద్రపర్చినట్లు అధికారులు తెలిపారు. ఎన్కౌంటర్ చేయాలి అవంతిరెడ్డి కట్టుబట్టలతో ఇంట్లోంచి బయటకు వచ్చి, ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. నా పేరున ఉన్న ఆస్తంతా పోలీస్ స్టేషన్లోనే తిరిగి మా తల్లిదండ్రులకు రాసి ఇచ్చేశాను. ఇకనైనా మమ్మల్ని బతకనిస్తారని అనుకున్నాం. ఇంతలోనే ఇంతటి దారుణానికి పాల్పడ్డారు. తప్పు చేసింది నేను అందుకు నన్ను చంపాలి. అతనేం పాపం చేశాడు. అతన్ని ఎందుకు చంపాల్సి వచ్చింది? నా భర్తను చంపిన వాళ్లు కనిపించిన వెంటనే ఎన్కౌంటర్ చేయాలి. కఠినంగా శిక్షించాలి హేమంత్ తల్లిదండ్రులు అవంతి కుటంబ సభ్యులు బయటకు వెళ్లగొడితేనే తాము పెళ్లికి ఒప్పుకొని వివాహం జరిపించామని హేమంత్ తండ్రి మురళీకృష్ట తెలిపారు. గతంలో పలు మార్లు బెదిరింపులకు పాల్పడితే పోలీసుల సమక్షంలో రాజీ కుదుర్చుకున్నామని, ఇంత దారుణంగా హత్య చేస్తారని ఊహించలేదని అన్నారు. తన కొడుకును హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా, ధన అహంకారం, కులం పిచ్చితోనే తన కొడుకుని చంపారని హేమంత్ తల్లి లక్ష్మీరాణి అన్నారు. ఇలాంటి పరిస్థితి ఏ తల్లికి రాకుండా నిందితులకు శిక్షించాలన్నారు. Quote
trent Posted September 26, 2020 Report Posted September 26, 2020 no casette peeling for reds in bangaru telangana antunnava man Quote
No_body_friends Posted September 26, 2020 Report Posted September 26, 2020 12 minutes ago, trent said: no casette peeling for reds in bangaru telangana antunnava man Telangana emundhi le Everywhere same story 1 Quote
siru Posted September 26, 2020 Report Posted September 26, 2020 reddys ki caste feeling vundadu annaru Db lo .. where are all those neutrals? Quote
Popular Post nag_mama Posted September 26, 2020 Popular Post Report Posted September 26, 2020 4 minutes ago, siru said: reddys ki caste feeling vundadu annaru Db lo .. where are all those neutrals? 3 1 Quote
nag_mama Posted September 26, 2020 Report Posted September 26, 2020 1 hour ago, ParmQ said: కిరాయి హంతకులకు రూ.10 లక్షల సుపారీ ముళ్లపొదల్లో మృతదేహాన్ని పడేసిన కిరాతకులు యువతి తండ్రి సూత్రధారి.. మేనమామలు, బావలు, వదినలు పాత్రధారులు 12 మందిని అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు policollaku baane gittubaatu avtundi ee case 12 మందిని అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు 1 Quote
ChinnaBhasha Posted September 26, 2020 Report Posted September 26, 2020 crime easy aipondi.. jail life ela untadi ani more awareness ravali janalaki.. people take it easy it seems.. only experience aitene telustadi aa pain.. Intentional murders should be punished heavily, like 14 years in jail.. 1 Quote
csrcsr Posted September 26, 2020 Report Posted September 26, 2020 10 minutes ago, ChinnaBhasha said: crime easy aipondi.. jail life ela untadi ani more awareness ravali janalaki.. people take it easy it seems.. only experience aitene telustadi aa pain.. Intentional murders should be punished heavily, like 14 years in jail.. Ikada nallola ni vandha mandi oka oka jail lo esthe kutlu padithe apdu kani bayam raadu kodukulaki Quote
Lonavala Posted September 26, 2020 Report Posted September 26, 2020 Pulka dogs andaru kalisi oke taadu lo cherinaru ga 1 Quote
csrcsr Posted September 26, 2020 Report Posted September 26, 2020 Papam ramcharn, Allu arjun, Manchu vishnu ni lepi par10engalsindi Quote
ariel Posted September 26, 2020 Report Posted September 26, 2020 8 years love .. husband ni champite edo road meeda evarido incident explain chestunnattu chestundi ga Quote
ChinnaBhasha Posted September 26, 2020 Report Posted September 26, 2020 2 hours ago, ariel said: 8 years love .. husband ni champite edo road meeda evarido incident explain chestunnattu chestundi ga yep.. casual ga explain chestondi 😐 Quote
RedThupaki Posted September 26, 2020 Report Posted September 26, 2020 Eyy ookondi vaa...highly respected thokaaas ki cassette peelings endhi vaa.. Just edho vaalla 360 degrees vaalla cassette vaallu untaaru, vaalla Thokaas key support chesthaaru but arey ...malla adhey doubt they don't have cassette peelings vaa 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.