r2d2 Posted September 29, 2020 Report Share Posted September 29, 2020 చెన్నై: ప్రముఖ చిత్రకారుడు కేసీ శివశంకరన్ (96) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ప్రముఖ బాలల మాసపత్రిక ‘చందమామ’ ముఖచిత్రం రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ఆయన.. భేతాళ కథల బొమ్మలతో ప్రసిద్ధి పొందారు. 1951లో చందమామలో చేరిన శివశంకరన్.. 60 ఏళ్ల పాటు అందులోనే పనిచేశారు. ఆ పత్రికలో చిత్రకారుల బృందానికి శివశంకరన్ నేతృత్వం వహించారు. చందమామ మూతపడ్డాక ‘రామకృష్ణ విజయం’ పత్రికలో బొమ్మలు గీశారు. 93 ఏళ్ల వయసులోనూ మ్యాగజైన్‌కు శివశంకరన్ బొమ్మలు గీయడం విశేషం. ఆయన మృతిపట్ల పలువురు చిత్రకారులు సంతాపం తెలిపారు. శివశంకరన్ మరణం సాహిత్యలోకానికి తీరనిలోటని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. చందమామలో విక్రమార్-బేతాళ కథలకు శంకరన్ చిత్రరూపాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. ‘అంబులి మామ’గా ప్రసిద్ధిచెందిన విలక్షణ నటుడని, ఆయన చిత్రలేఖా నైపుణ్యం అద్వితీయమన్నారు. శంకరన్ చిత్రాలు చందమామ సంచికను మరోస్థాయికి చేర్చాయన్నారు. శంకరన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. కరతోలుపు శివశంకరన్ మరణం బాల సాహిత్యానికి తీరనిలోటని తెదేపా నేత నారా లోకేష్ అన్నారు. శంకరన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు లోకేష్ తెలిపారు. Quote Link to comment Share on other sites More sharing options...
Assam_Bhayya Posted September 29, 2020 Report Share Posted September 29, 2020 RIP . . All real gems who made their everlasting mark in India are leaving . . 😞 Inka current and future gen lo nameless useless quickly outdated techies and tiktok star matrame thayaru avtharemo 1 Quote Link to comment Share on other sites More sharing options...
kakatiya Posted September 29, 2020 Report Share Posted September 29, 2020 This is by vaddadi papaih Quote Link to comment Share on other sites More sharing options...
kakatiya Posted September 29, 2020 Report Share Posted September 29, 2020 This is shankar..most story pictures you saw are from shankar 1 Quote Link to comment Share on other sites More sharing options...
dasari4kntr Posted September 29, 2020 Report Share Posted September 29, 2020 RIP... 1 Quote Link to comment Share on other sites More sharing options...
MiryalgudaMaruthiRao Posted September 29, 2020 Report Share Posted September 29, 2020 rip Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.