DaatarBabu Posted October 6, 2020 Report Posted October 6, 2020 పోలీసులపై నమోదవుతున్న కేసులు కనిపిస్తున్నాయా? దేశవ్యాప్తంగా 4,068 నమోదైతే.. అందులో మన పోలీసులపైనే 1,681 వారి పనితీరుకు ఇదే నిదర్శనం.. అన్యాయాలను పట్టించుకోవడం లేదు ప్రశ్నిస్తే అర్ధరాత్రి అరెస్టులు, దాడులు.. డీజీపీ సవాంగ్‌కు బాబు లేఖ డీజీపీకి లేఖలతో జోకర్లా చంద్రబాబు: సజ్జల ఇప్పటికైనా నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలి అమరావతి, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పోలీసులపై దేశంలోనే అత్యధికంగా కేసులు నమోదవడం కనిపిస్తోందా అని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. సోమవారం ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా పోలీసులపై 4,068 కేసులు నమోదైతే.. అందులో ఏపీ పోలీసులపైనే 1,681 కేసులు (41 శాతం) ఉండడం ఆందోళనకరమని తెలిపారు. నేర వివరాల నమోదు జాతీయ బ్యూరో ఈ లెక్కలు వెల్లడించిందని గుర్తుచేశారు. ‘పోలీసులు చట్ట నిబంధనలను పాటించడం లేదు. అధికార వైసీపీతో కుమ్మక్కై ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన వారిని వెంటాడడం , అర్ధరాత్రి అరెస్టులు, హింసాత్మక దాడులు, ఆస్తుల విధ్వంసం, బెదిరింపులు, దుష్ప్రచారం ద్వారా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. దీన్ని పోలీసులు చూస్తూ ఊరుకుంటున్నారు. ఇటువంటి నిష్ర్కియాపరత్వం రాష్ట్ర చరిత్రలో మున్నెన్నడూ లేదు’ అని దుయ్యబట్టారు. రాజమహేంద్రవరం ఎస్పీ కార్యాలయం ముందు షేక్ సత్తార్ అనే వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటనను చంద్రబాబు తన లేఖలో ప్రస్తావించారు. ప్రాణాలు కాపాడాల్సిన కార్యాలయాల ఎదుట ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్ధితి రావడం ఏమిటని ప్రశ్నించారు. విజయవాడలో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ఇంటి సమీపంలో పోలీసు పికెట్ ఉన్నా పలువురు కలిసి ఆయన కారుపై దాడి చేసి ధ్వంసం చేశారని చెప్పారు. ‘వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై గొంతెత్తి మాట్లాడకూడదనే పట్టాభి వాహనంపై దాడి జరిగింది. ప్రభుత్వ చర్యలను గర్హించిన టీడీపీ నేతలపై గొలుసుకట్టు దాడులు అనేకం గతంలో కూడా జరిగాయి. తమను ప్రశ్నించేవారి ఇళ్లను అర్ధరాత్రి కూల్చడం ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుంది. వీటితోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, మహిళలు, పాత్రికేయులపై దాడులు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. శిరోముండనాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. దేవాలయాలు, ప్రార్థనామందిరాలపై దురుద్దేశపూరిత దాడులు జరుగుతూనే ఉన్నాయి. వీటిలో పోలీసులు నిష్పక్షపాతంగా తమ విధిని నిర్వర్తించడంలో విఫలమవుతున్నారు’ అని తెలిపారు. ఇకనైనా పోలీసులు నిష్పక్షపాతంగా తమ విధులను నిర్వర్తించి శాంతి భద్రతలను కాపాడాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. నేరాలకు అడ్డుకట్టవేసి ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడాలన్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.