DaatarBabu Posted October 12, 2020 Report Posted October 12, 2020 అమరావతి పరిరక్షణకు అలుపెరగని పోరాటం పది నెలలుగా ప్రజ్వరిల్లుతున్న ఉద్యమజ్వాల ఏకైక రాజధానిగా నిలబెట్టుకోవడమే అంతిమ లక్ష్యం రాజధాని రైతుల ఉద్యమజ్వాల మూడొందల రోజులుగా ప్రజ్వరిల్లుతూనే ఉంది. 33 వేల ఎకరాల భూములను రాజధాని కోసం ఇస్తే.. ఇప్పుడు మూడు రాజధానులంటూ తమను రోడ్డున పడేస్తున్నారన్న ఆక్రోశం వారిని నిత్యం పోరుకు పురికొల్పుతోంది. ఏకైక రాజధానిగా అమరావతి.. అనే లక్ష్యంతో ఉద్యమం హోరెత్తుతోంది. వైకాపా తప్ప అన్ని పార్టీల మద్దతు, ప్రజాసంఘాల దన్ను, మహిళా రైతుల పోరాట పటిమ.. కలగలిసి సాగుతున్న ఈ సమరానికి సోమవారంతో 300 రోజులు నిండాయి. Quote
DaatarBabu Posted October 12, 2020 Author Report Posted October 12, 2020 * రాజధాని ఉద్యమంలో ఇప్పటి వరకు పోలీసులు సుమారు 3 వేల మంది రైతులపై, 200 కేసులు పెట్టినట్టు జేఏసీ ప్రతినిధులు చెబుతున్నారు. * ఉద్యమంలో పాల్గొన్నవారిలో ఇప్పటి వరకు 83 మంది రైతులు, రైతు కూలీలు చనిపోయారు. వారంతా రాజధాని తరలిపోతుందన్న ఆవేదనతోనే మరణించారని ఐకాస నాయకులు చెబుతున్నారు. Quote
DaatarBabu Posted October 12, 2020 Author Report Posted October 12, 2020 రాజధానికి భూములిచ్చిన రైతులు, రైతు కూలీల ఐక్య కార్యాచరణ సమితి, వివిధ వర్గాలప్రతినిధులతో ఏర్పడిన అమరావతి పరిరక్షణ సమితి.. పది నెలలుగా అకుంఠిత దీక్షతో పోరాడుతున్నాయి. నిరాహార దీక్షలు, ధర్నాలు, ఆందోళనలు, రహదారులపై బైఠాయింపు, అసెంబ్లీ ముట్టడి, మౌన ప్రదర్శనలు, ర్యాలీలు, ప్రార్థనలు, యాగాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నపాలు, వేడుకోళ్లు... ఇలా అన్ని మార్గాల్లోనూ ప్రయత్నిస్తూనే ఉన్నాయి. రాజధాని రైతులు అమరావతి నుంచి దిల్లీ వరకు తమ ఉద్యమ నినాదాన్ని వినిపిస్తూనే ఉన్నారు. పోలీసులు నిర్బంధిస్తున్నా.. లాఠీలు ఝుళిపిస్తున్నా.. కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నా వారు వెనక్కి తగ్గడం లేదు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికీ వెరవకుండా వివిధ రూపాల్లో పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. మరోవైపు న్యాయపోరాటమూ చేస్తున్నారు. అందరి మాట... అమరావతే * రాజధాని రైతులకు మద్దతుగా విజయవాడ, గుంటూరుతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోనూ ఆందోళనలు జరిగాయి. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరి తదితర భాజపా నాయకులు, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, మధు రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతులకు మద్దతు తెలిపారు. * ఆధ్యాత్మిక, సినీ ప్రముఖులూ సంఘీభావం తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచీ, ఇతర రాష్ట్రాల నుంచి రైతు నాయకులు వచ్చి మద్దతు ప్రకటించారు. * అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా దిల్లీ వెళ్లి రాజ్‌ఘాట్ వద్ద మౌన ప్రదర్శన చేశారు. సీఎం ప్రకటనతో మొదలైన ఉద్యమం 2019 డిసెంబరు 17న శాసనసభలో సీఎం జగన్ మూడు రాజధానుల ఆలోచన బయటపెట్టడంతో రాజధాని ప్రజలు, రైతులు హతాశులయ్యారు. ఆ మర్నాడే వెలగపూడిలో దీక్షా శిబిరం మొదలైంది. అప్పటి నుంచి రాజధాని గ్రామాల ప్రజలు, రైతులంతా అమరావతే ఆశ, శ్వాసగా పోరాడుతున్నారు. కరోనా సమయంలోనూ ప్రభుత్వ నిబంధలకు లోబడి ఇళ్లలోనే నిరసన కొనసాగించారు. సీఆర్డీఏ చట్టం రద్దు, మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఈ ఏడాది జులై 31న ఆమోదం తెలపడంతో.. రాజధాని రైతాంగం, అమరావతి పరిరక్షణ సమితి, వివిధ పార్టీలు ఆందోళన ముమ్మరం చేశాయి. ఆ రెండు చట్టాల్ని హైకోర్టులో సవాల్ చేశాయి. వాటిపై కోర్టు స్టేటస్కో విధించింది. అమరావతిపై ప్రభుత్వ నిర్ణయాల్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ సాగుతోంది. Quote
DaatarBabu Posted October 12, 2020 Author Report Posted October 12, 2020 అతివలే ఆదిశక్తులై.. రాజధాని పరిరక్షణ ఉద్యమంలో మహిళలే క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. మందడంలో నిరసన ర్యాలీ చేసినా, దుర్గమ్మకు మొక్కులు చెల్లించుకునే కార్యక్రమైనా, అసెంబ్లీ ముట్టడైనా, జాతీయ రహదారి దిగ్బంధమైనా.. అతివలే ముందుండి నడిచారు. పోలీసులు బూటు కాళ్లతో తన్నినా, లాఠీలతో కొట్టినా మౌనంగా భరించారు. శాంతియుతంగానే ఆందోళన కొనసాగిస్తున్నారు. అమరావతికి చెందిన మహిళా ప్రతినిధులు, వారి తరపున పోరాడుతున్న మహిళా నేతలు ఇటీవల దిల్లీ వెళ్లి... కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, మురళీధరన్, వివిధ పార్టీల జాతీయ నాయకులు సీతారాం ఏచూరి, డి.రాజా, డెరిక్ ఒబ్రెయిన్ తదితరుల్ని కలసి తమ పోరాటానికి మద్దతివ్వాలని కోరారు. లాఠీలకు ఎదురొడ్డి.. * రైతుల ఉద్యమం మొదలయ్యాక రాజధాని గ్రామాల్లోకి ప్రభుత్వం వేల సంఖ్యలో పోలీసు బలగాల్ని దించింది. దాదాపు గ్రామాలన్నింటినీ దిగ్బంధించింది. 144 సెక్షన్, పోలీసు చట్టంలోని 30 సెక్షన్లను ప్రయోగించి ఉద్యమాన్ని కట్టడి చేయాలని చూసింది. * కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించుకుని, తమ గోడు వెళ్లబోసుకునేందుకు రాజధాని గ్రామాల నుంచి బయల్దేరిన మహిళలు, రైతుల్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసు వలయాన్ని ఛేదించుకుని వెళ్లేందుకు ప్రయత్నించిన వారిపై లాఠీఛార్జి చేశారు. * రాజధాని రైతులు జాతీయ రహదారి దిగ్బంధానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు లాఠీలు ఝళిపించారు. * జనవరిలో శాసనసభ జరుగుతుండగా.. పెద్దసంఖ్యలో రైతులు, మహిళలు అసెంబ్లీని ముట్టడించడానికి ప్రయత్నించడంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు. రైతులతో పాటు ముట్టడిలో పాల్గొన్న గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ను అరెస్టు చేశారు. * మహిళలు, రైతులపై పోలీసుల దాడిని నిరసిస్తూ రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో బంద్ పాటించారు. మందడంలో దీక్షా శిబిరం నుంచి నిరసనకారుల్ని వెళ్లగొట్టేందుకు పోలీసులు దాడి చేయడంతో ఒక మహిళ తీవ్రంగా గాయపడ్డారు. దానిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశం జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది. జాతీయ మహిళా కమిషన్ నియమించిన ప్రత్యేక కమిటీ రాజధాని గ్రామాల్లో పర్యటించి విచారణ జరిపింది. ప్రవాసాంధ్రుల మద్దతు రైతుల పోరాటం 200వ రోజుకి చేరినప్పుడు... వివిధ దేశాల్లోని ప్రవాసాంధ్రులు వారికి మద్దతుగా కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించారు. అమరావతి పరిరక్షణ సమితి నిర్వహించిన జాతీయస్థాయి వెబినార్‌లో తెదేపా అధినేత చంద్రబాబు సహా దిల్లీ నుంచి వివిధ పార్టీలు, సంఘాల నాయకులు పాల్గొన్నారు. Quote
Hydrockers Posted October 12, 2020 Report Posted October 12, 2020 3000 iana chesedi em ledu ani @DaatarBabu kuda annadu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.