DaatarBabu Posted October 17, 2020 Report Posted October 17, 2020 అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక చెబుతోంది గుంటూరు లోక్‌సభ నియోజకవర్గ నేతలతో సమావేశంలో చంద్రబాబు Quote
DaatarBabu Posted October 17, 2020 Author Report Posted October 17, 2020 ఈనాడు డిజిటల్, అమరావతి: జగన్‌కు 10 నుంచి 30 ఏళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశం ఉన్నట్లు దిల్లీ సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొందని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. అవినీతిపరుడు ముఖ్యమంత్రై న్యాయ వ్యవస్థపైనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గుంటూరు లోక్‌సభ నియోజకవర్గ నేతలతో శుక్రవారం జరిగిన సమన్వయ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో ఉన్మాదులు స్వైర విహారం చేస్తున్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోయింది. శాంతిభద్రతలు లోపిస్తే ఎలా ఉంటుందో చెప్పేందుకు విజయవాడలో యువతిపై జరిగిన దాడే నిదర్శనం. దిశ చట్టం తీసుకొచ్చామని వైకాపా వాళ్లు గొప్పలు చెబుతున్నారు. ఇప్పుడు ఆ చట్టానికి మార్పులు చేయాలని కేంద్రం వెనక్కి పంపింది. నిర్భయ చట్టంతోనే మహిళలపై జరిగే అన్యాయాలను అరికట్టొచ్చని నాడు మేం చెప్పినా.. వైకాపా వినిపించుకోలేదు. రాజధానిని మార్చబోమని ఎన్నికల హామీగా చెప్పిన జగన్ నేడు మూడు ముక్కలాట ఆడుతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో టిడ్కో నిర్మించిన 1,800 ఇళ్లు పేదలకు ఇవ్వలేదు. ఎనిమిది వేల మందికి ఇళ్ల స్థలాలు పంచకుండా ఇబ్బంది పెడుతున్నారు. అయిదు వేల ఇళ్లు తెదేపా ప్రభుత్వం నిర్మిస్తే.. వాటినీ ఇవ్వలేదు. అమరావతి ప్రాంతం నుంచి రోజూ వెయ్యి లారీల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అమరావతి ప్రాంత వైకాపా ఎమ్మెల్యేలు కట్టుబానిసల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. డబ్బు కోసం రాజధాని ప్రజలకు ద్రోహం చేస్తున్నారు. ఈ నెల 22వతేదీ నాటికి అమరావతికి ప్రధాని శంకుస్థాపన చేసి అయిదేళ్లవుతోంది. తెదేపా ప్రభుత్వం వచ్చి ఉంటే అమరావతి ప్రాంతం అభివృద్ధి చెందేది. రైతులను పలకరించే నాథుడే లేడు.. వరదలతో పంట నష్టపోయిన రైతులను అధికార పార్టీ నేతలేవరూ పలకరించలేదు. తెదేపా ప్రభుత్వ హయాంలో గుంటూరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో రూ.వేల కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాం. అదనంగా 5లక్షల ఎకరాలకు సాగు నీరిచ్చాం. రూ.237 కోట్లతో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం పూర్తిచేస్తే.. దాన్నీ ఈ ప్రభుత్వం సరిగ్గా వినియోగించుకోలేదు’ అని వెల్లడించారు. 2022లో జమిలి ఎన్నికలొస్తాయంటున్నారు: గల్లా ‘2022లో జమిలి ఎన్నికలు వస్తాయని దిల్లీలో జోరుగా ప్రచారం నడుస్తోంది. తెదేపా అయిదేళ్లలో చేసిన అప్పులకు సమానంగా వైకాపా ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే చేసింది. జగన్ కేసుల విషయంలో త్వరలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరిగే అవకాశముంది. అందుకే వైకాపా నాయకులు న్యాయవ్యవస్థపై బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారు’ అని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. గుంటూరు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, నాయకులు గంజి చిరంజీవి, పోతినేని శ్రీనివాసరావు, సాంబశివరావు, వంగా సాంబిరెడ్డి, కె.ఏడుకొండలు, ఆకుల సాంబశివరావు తదితరులు సమావేశంలో మాట్లాడారు. Quote
Ryzen_renoir Posted October 17, 2020 Report Posted October 17, 2020 2022 lo address lekunda potharu YCP , deposits kooda Ravu jaffas ki 2 Quote
Migilindi22 Posted October 17, 2020 Report Posted October 17, 2020 31 minutes ago, Ryzen_renoir said: 2022 lo address lekunda potharu YCP , deposits kooda Ravu jaffas ki Ramanaaa burnol raay ra Quote
ARYA Posted October 17, 2020 Report Posted October 17, 2020 super inka next 30 yrs ki CBN CM ipoyinatte Quote
Ryzen_renoir Posted October 17, 2020 Report Posted October 17, 2020 1 hour ago, Migilindi22 said: Ramanaaa burnol raay ra Quote
Hydrockers Posted October 17, 2020 Report Posted October 17, 2020 Yeah YCP party ni kuda cancel chestaru Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.