Jump to content

Recommended Posts

Posted

Britain-PM-Boris-Johnson-696x398.jpg

చాలీ చాలని జీతంతో సర్దుకుపోతూ బతకాలంటే కష్టమే. అలా ఇబ్బందులు పడటం కంటే మంచి జీతం వచ్చే ఉద్యోగం చేసుకోవడం బెటర్. మిడిల్ క్లాస్ బతుకులు, చాలీ చాలని జీతాలు, సంసారాన్ని ఎలా ఈదాలి? ఏదైనా మంచి జీతం వచ్చే ఉద్యోగం ఉంటే… ఈ ఆఫీసులో రిజైన్ చేసి ఆ ఉద్యోగంలో చేరడం మంచిది. మనలాంటి సామాన్యులు ఇలా అనుకోవడం పెద్ద షాకింగ్ గా ఉండదు. కానీ ఓ దేశ ప్రధాని జీతం చాలట్లేదని పదవికి రిజైన్ చేయడం సంచలనమే కదా..! ఇంతకీ ఆ ప్రధాని ఎవరు? ఆయన జీతం ఎంత? ప్రధాని పదవికంటే ఆయనకి మంచి జీతం తెచ్చే ఉద్యోగం ఏంటో తెలియాలంటే కింద  ఉన్న మ్యాటర్ చదవాల్సిందే.

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తనకు జీతం సరిపోవడం లేదని పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మరో ఆరు నెలల కాలంలో ఆయన ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకునే అవకాశం కనిపిస్తోంది. బోరిస్ జాన్సన్ బ్రిటన్ పీఎం గా 1.5 లక్షల పౌండ్ల జీతం అందుకుంటున్నారు. ఇది గతంలో ఆయన చేసే ఉద్యోగానికి వచ్చే జీతంలో దాదాపు సగం ఉండటం గమనార్హం. ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టక ముందు బోరిస్ ఒక పత్రికలో కాలమిస్టుగా పనిచేసే వారు.

ఆ పత్రికలో ఆయనకు 2.75 లక్షల పౌండ్ల జీతం అందేది. ఇక అదనంగా డబ్బులు కూడా వచ్చేవి. కానీ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకరం చేసినప్పటి నుండి బోరిస్ ఆ పదవికి గాను 1.5 లక్షల పౌండ్ల జీతం మాత్రమే అందుకుంటున్నారు. దీంతో ఆయనకు ఆ జీతం సరిపోవడం లేదట. తన సంతానాన్ని చూసుకోవడం ఇబ్బందిగా మారుతుందని ప్రధాన మంత్రి పదవిని వదులుకోవాలని తీసుకున్నారు బోరిస్ జాన్సన్. ప్రధాన మంత్రులకు కూడా జీతాలు చాలకపోతే కష్టమే కదా మరి..!

Posted

intoti daniki resign cheyyala, kcheer sab ni adigite cheppevadu ga, maname penchukuni approve cheskovali ani

Posted

AP/TG lo ento mandi unnar.. vaarini adarsam ga teeskonunte ee paristiti vachedi kaadu

I'm telling that!!!

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...