Jump to content

Recommended Posts

Posted
ఉద్యోగంపై బెంగ! 

సగం మందిలో ఆందోళన.. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సర్వేలో వెల్లడిఉంటుందో..ఊడుతుందో.. ఉద్యోగంపై బెంగ!

కొవిడ్‌ కారణంగా కంపెనీలు మూత పడ్డాయి. చాలా వరకు ఉద్యోగాలు పోయాయి. ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయి. అయితే, ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతన్నాయి. అయినా ఉద్యోగుల్లో ఆందోళన అలానే ఉంది. ఎక్కడ తమ ఉద్యోగం పోతోందన్న భయం వారిలో గూడుకట్టుకుంది. ఏ ఒకరిద్దిరిలోనో కాదు ప్రపంచవ్యాప్తంగా సగానికి పైగా మందిలో ఈ భయం వెంటాడుతోంది. రాబోయే 12 నెలల్లో ఉద్యోగంపై నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. భారత్‌లో దాదాపు 57 శాతం మంది తమను ఎక్కడ తొలగిస్తారోనన్న భయంతో బిక్కుబిక్కుమంటున్నారని తేలింది. ఈ మేరకు వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌), ఐపీఎస్‌వోఎస్‌ సంస్థలు సంయుక్తంగా 27 దేశాల్లో 12 వేల మందికి పైగా వయోజనులపై ఆన్‌లైన్‌లో నిర్వహించిన సర్వేలో ఈ నిజాలు వెలుగుచూశాయి.

రష్యాలోని ఉద్యోగుల్లో ఉద్యోగంపై బెంగ ఎక్కువగా ఉంది. అక్కడ పనిచేసే ప్రతి నలుగురిలో ముగ్గురిని ఈ భయం వెంటాడుతోంది. జర్మనీలో నలుగురిలో ఒకరికి మాత్రమే ఈ భయం ఉంది. ప్రపంచవ్యాప్తంగా సగటున 54 శాతం మంది ఈ విధమైన ఆందోళనతో ఉండగా.. రష్యాలో మాత్రం ఏకంగా 75 శాతం మంది ఆందోళనలో ఉన్నారు. ఈ విషయంలో స్పెయిన్‌లో (73 శాతం), మలేసియా (71శాతం) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక భారత్‌ విషయానికొస్తే 57 శాతం మంది ‘ఉద్యోగంపై ఆందోళన’ వ్యక్తంచేశారు. అందులో 25 శాతానికి పైగా తీవ్ర ఆందోళన వ్యక్తంచేయగా.. 31 శాతం మంది కొంతమేర భయంతో ఉన్నట్లు చెప్పారు. ఈ విషయంలో జర్మనీలో పరిస్థితి మెరుగ్గా ఉంది. కేవలం 26 శాతం మంది మాత్రమే ఈ విధమైన ఆందోళనలు వ్యక్తంచేయడం గమనార్హం. స్వీడన్‌ (30శాతం), నెథర్లాండ్స్‌ (36శాతం), యూఎస్‌ (36శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఉద్యోగాలు కోల్పోతాయన్న ఆందోళనల నేపథ్యంలో కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికీ తాము సిద్ధమని ఉద్యోగులు అంటున్నారు. ఇప్పుడున్న కంపెనీలో ఉద్యోగంలో కొనసాగేందుకు కొత్త నైపుణ్యాలు అందిపుచ్చుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా 67 శాతం మంది సంసిద్ధత వ్యక్తంచేస్తున్నారు. స్పెయిన్‌లో అత్యధికంగా 10 మందిలో 9 మంది ఈ విధంగా మందుకొస్తున్నారు. మన దేశంలోనూ 80 శాతం మంది నైపుణ్యాలు పెంచుకునేందుకు సిద్ధమంటున్నారు. అయితే, ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో రెండేళ్లతో పోలిస్తే ఉద్యోగాల కల్పన బాగా తగ్గినప్పటికీ.. ఆశావహ దృక్పథం మాత్రం ఉందని డబ్ల్యూఈఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సాది జహీద్‌ తెలిపారు.

Posted
18 minutes ago, Boomer said:

@~` navaratana oil vadutunava?

Nenu multi task la specialist ra. Ippudu DB kuda add chesina list la electiona yye varaku saava 10ngude andarni

Posted
Just now, Sucker said:

Nenu multi task la specialist ra. Ippudu DB kuda add chesina list la electiona yye varaku saava 10ngude andarni

⬆️yourock

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...