DaatarBabu Posted October 26, 2020 Report Share Posted October 26, 2020 ఆకివీడు: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ప్రమాదం తప్పింది. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో ముంపునకు గురైన పంటలు, ఆక్వా చెరువులను పరిశీలించేందుకు పార్టీ నేతలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజుతో కలిసి లోకేశ్ వెళ్లారు. ఆకివీడు మండలంలోని మండపాడు, ఐ.భీమవరం గ్రామాల్లో ముంపు బారిన పడిన వరి చేలను పరిశీలించారు. అనంతరం ఆకివీడు నుంచి సిద్దాపురం వెళ్లేందుకు లోకేశ్ స్వయంగా ట్రాక్టర్ నడిపారు. ఈ క్రమంలో రహదారి పక్కన ఉప్పుటేరులోకి ట్రాక్టర్ జారింది. దీంతో ఆయన తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వెంటనే వేరే ట్రాక్టర్ తెప్పించి పర్యటన కొనసాగించారు. అనంతరం ఆకివీడులోని పునరావాస కేంద్రాన్ని లోకేశ్ సందర్శించారు. అక్కడ బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు Quote Link to comment Share on other sites More sharing options...
DaatarBabu Posted October 26, 2020 Author Report Share Posted October 26, 2020 ఏలూరు : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న లోకేష్.. ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద ట్రాక్టర్ నడిపారు. అయితే ఆ ట్రాక్టర్ అదుపుతప్పి ఉప్పటేరు కాల్వలోకి దూసుకెళ్లింది. పక్కనే ఉన్న ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే మంతెన రామరాజు అప్రమత్తమై ట్రాక్టర్‌ను అదుపుచేశారు. అనంతరం లోకేష్‌ను ట్రాక్టర్ నుంచి దింపేశారు. దీంతో ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఆయన వెంట ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, తెలుగు తమ్ముళ్లు ఊపిరిపీల్చుకున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
DaatarBabu Posted October 26, 2020 Author Report Share Posted October 26, 2020 తీవ్ర విమర్శలు.. ఈ ఘటనకు ముందు.. ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద వరదల వలన పాడైన చేపలను లోకేష్ పరిశీలించారు. అనంతరం మత్స్యకారులతో మాటామంతి జరిపి వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ తోడు దొంగలు తనను తిరగకుండా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. వారు తిరిగితే తాము ఎందుకు వరద బాధిత ప్రాంతాల్లో తిరుగుతామని ప్రశ్నించారు. కొల్లేరుకు ఇంతకు ముందు ఎన్నడూ లేని రీతిలో వరదలు వచ్చాయని... వారిని ఆదుకునే చర్యలు లేవని విమర్శించారు. తాము వరద బాధిత ప్రాంతాల్లో తిరుగుతున్నామని ఆగమేఘాల మీద ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోందని అవి కూడా అరకొరగానే ఉన్నాయని లోకేష్ దుయ్యబట్టారు Quote Link to comment Share on other sites More sharing options...
DaatarBabu Posted October 26, 2020 Author Report Share Posted October 26, 2020 లోకేష్ జిల్లాల బాట.. తెలుగు రాష్ట్రాల్లో గత పదిరోజులుగా భారీ వర్షాలకు ఏపీలోని లోతట్టు ప్రాంతంలో నివాసముండే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు పంటపొలాలు నీట మునిగి రైతన్నలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ తరుణంలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలు, పంటలు మునిగిన రైతన్నలను పరామర్శించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ సంకల్పించారు. ఇందులో భాగంగా ఇప్పటికే తూర్పుగోదావరి, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో పర్యటించి రైతులను పరామర్శించారు. అదే విధంగా వరద బాధితులను బాధలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో లోకేష్ పర్యటించారు Quote Link to comment Share on other sites More sharing options...
JustChill_Mama Posted October 26, 2020 Report Share Posted October 26, 2020 Tractor boltha padindhi... doctor vocchadu Quote Link to comment Share on other sites More sharing options...
Ryzen_renoir Posted October 26, 2020 Report Share Posted October 26, 2020 2014-2019 immediate ga compensation vachedhi , ippudu unmadhi dongala Rajyam asalu motham marchipoyaru prajalani Quote Link to comment Share on other sites More sharing options...
DaatarBabu Posted October 26, 2020 Author Report Share Posted October 26, 2020 Just now, Ryzen_renoir said: 2014-2019 immediate ga compensation vachedhi , ippudu unmadhi dongala Rajyam asalu motham marchipoyaru prajalani Ippudu Monthly vastundi ga... Edo okati panchuthane vunnadu 😂 1 Quote Link to comment Share on other sites More sharing options...
Ryzen_renoir Posted October 26, 2020 Report Share Posted October 26, 2020 3 minutes ago, DaatarBabu said: Ippudu Monthly vastundi ga... Edo okati panchuthane vunnadu 😂 Mosam chesaru prajalani , maa manifesto lo inka ekkuva isthamani cheppamu . Monthly 3000 immediately isthamani promise chestey , ippudu only 2250 isthunaru 1 Quote Link to comment Share on other sites More sharing options...
ChinnaBhasha Posted October 26, 2020 Report Share Posted October 26, 2020 38 minutes ago, DaatarBabu said: అనంతరం లోకేష్‌ను ట్రాక్టర్ నుంచి దింపేశారు. 2 Quote Link to comment Share on other sites More sharing options...
Prince_Fan Posted October 26, 2020 Report Share Posted October 26, 2020 driving raanapudu tractor nadapatam enduku ra lokesa 1 1 Quote Link to comment Share on other sites More sharing options...
SinN0mbre Posted October 26, 2020 Report Share Posted October 26, 2020 2 hours ago, Prince_Fan said: driving raanapudu tractor nadapatam enduku ra lokesa Acting raakunda cinemalu thiyyatleda ***** gaadu idi anthe Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted October 26, 2020 Report Share Posted October 26, 2020 Bathiki poyina tractor 1 Quote Link to comment Share on other sites More sharing options...
JustChill_Mama Posted October 26, 2020 Report Share Posted October 26, 2020 “Tweet lu kottadam kadhu ... poradi randi “ ee mata mee naayina ki cheppara Obaaa.... amaravathi farmers kosam vocchi protest cheyyamanu... zoom lo sangheebhavam kadhu Quote Link to comment Share on other sites More sharing options...
kidney Posted October 26, 2020 Report Share Posted October 26, 2020 2 Quote Link to comment Share on other sites More sharing options...
raaajaaa Posted October 26, 2020 Report Share Posted October 26, 2020 5 kotla Andhra prajala asha Deepam ki ame kadu be strong soldiers we are with you Lokesh anna 1 1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.