Jump to content

Recommended Posts

Posted

చేరువైన నేటి తరం టెక్నాలజీ హబ్ అవకాశం ఆంధ్రా కోల్పోయిందా? దాని విలువ ఎంతో తెలుసా?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా తెచ్చిన ఆర్థిక కల్లోలంలో కూడా, కనీ వినీ ఎరుగని లాభాలు కళ్ల చూస్తున్నవి క్లౌడ్ & ఫైబర్ డాటా కంపెనీలే, ఫార్మా రంగంతో పాటు.

ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలు అమెరికాలో ఉద్యోగాల నుండి పెద్ద ఎత్తున తొలగించి, ఇండియాలో నియామకాలు చేసుకొంటున్నాయి. అసలు లాక్డౌన్ లో కూడా నింపాదిగా జీతాలు తీసుకొని, దేశానికి ఆదాయ పన్ను కడుతున్న రంగం, ఐటీ రంగం.

ఐటీ లో ఓనమాలు తెలిసిన వారు కూడా క్లౌడ్ గురించి మాట్లాడుతున్నారు. మొబైల్ వాడే వారికి కూడా దాని గురించి తెలుసు. వారిలోని ఫోనులోని కాంటాక్ట్స్ నుండి ఫోటోలు గట్రా డాటా మొత్తం గూగుల్ మరియు ఇతర క్లౌడ్ అకౌంట్లో స్టోర్ అవుతుంది అని.

అచ్చం అలా కంప్యూటర్ మీద ఆధారపడిన ప్రతి రంగం లో పరిశ్రమలు సొంతంగా కంప్యూటర్ సర్వర్ ల్యాబ్ లు గట్రా మైంటెయిన్ చేసేవి ఇన్నాళ్లు. ఐటీ కంపెనీలు కూడా భారీ ఎత్తున సొంత డాటా సెంటర్లు మయింటైన్ చేసేవి. ఇవన్నీ కోట్లాది రూపాయల ఖర్చుతో కూడిన యవ్వారం. మరియు దాని అడ్మినిస్ట్రేషన్ & నిర్వహన తలనొప్పులు వున్నాయి.

తాజాగా సర్వర్లు & సిబ్బంది అవసరం లేకుండా, క్లౌడ్ లో కావాల్సిన ఇంఫ్రాస్ట్రక్చర్, సాఫ్ట్వేర్, స్టోరేజ్ వాడుకొంటున్నాయి. ఒక్క ల్యాప్టాప్ తో కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. మనం మొబైల్ మార్చితే, కేవలం ఒక గూగుల్ అకౌంట్ సెటప్ చేస్తే మొత్తం కొత్త మొబైల్ కి వచ్చినట్లు.. అంతా ప్లగ్ అండ్ ప్లే.

రోజు రోజుకూ రెట్టింపుతో, ఈ క్లౌడ్ రంగం వేగంగా విస్తరిస్తోంది. ఇందులో ప్రధాన ఆధిపత్యం అమేజాన్, మైక్రోసాఫ్ట్ అజూర్ & గూగుల్ వే.

ఏ దేశపు డాటా ఆ దేశంలో వుండాలనే ఆయా దేశాల విధానాలతో, మరియు అక్కడే వుంటే మరింత వేగంగా సేవలు అందించే సౌలభ్యం వున్నందున, ఎక్కువ జనాభాతో అతి పెద్ద ప్రపంచ మార్కెట్ అయిన మన దేశంలో డాటా సెంటర్లు పెట్టాలని దిగ్గజ కంపెనీలు ముందుకు వస్తున్నాయి.

ఒక దశలో గూగుల్, అమేజాన్, అదానీ, రిలయన్స్ & చైనా ఆలీబాబా వరకు అన్నింటినీ సంప్రదించారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. ఆంధ్రాలో మీ డాటా సెంటర్లు పెట్టండి అని.

అంతలో ఆశనిపాతంలా ప్రభుతం మారడం శరాఘాతంలా మారింది ఆంధ్రాకు.

వైజాగ్, తిరుపతి & విజయవాడకు వస్తాయనకున్న డాటా సెంటర్ల ఆశలు ఆవిర్లు అయ్యాయి. అమేజాన్ హైదరాబాద్ ను ఎంచుకొంది. ఇరవై వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెడుతోంది అక్కడ. అంటే ఒక్క 13 వేల కోట్ల పెట్టుబడుల కియా అంటేనే మనం ఎంత కేరింతలు కొట్టామో కదా.

మిగిలిన కంపెనీలు ఏమి ఆలోచిస్తున్నాయో తెలియదు. రెండు దశాబ్దాల తరువాత వ్యవసాయంలో కలిసి పనిచేద్దామని వైజాగ్ కు పిలిపించి తమ స్నేహాలను గుర్తుచేసుకొన్నారు బిల్గేట్స్ & బాబులు. రెండో అతి పెద్ద క్లౌడ్ సంస్థ అయిన మైక్రోసాఫ్ట్ అజూర్ డాటా సెంటర్ ను ఇక్కడ పెట్టండి అంటే కాదనేవారు కారు గేట్స్. అదే వచ్చి వుంటే, మిగిలినవి కూడా పోటా పోటీగా వచ్చేవి. గూగుల్ ఎక్స్ రహస్య ప్రాజక్ట్ ఆఫీసుకు కూడా బాబు వెళ్లి, డ్రైవర్ లేని వెహికల్ చూసి వచ్చారు. గూగుల్ ఎక్స్ తో ఒప్పందం కూడా చేసుకొన్నారు. గూగుల్ క్లౌడ్ కూడా వచ్చేది.

మొత్తం మీద ముసుగు మేధావుల మాటలు విన్న యువత తమను తామే మోసం చేసుకొంది. నేటి తరం కౌడ్ టెక్నాలజీ హబ్ అవకాశం ఆంధ్రా కోల్పోయేలా చేసుకొంది. సుమారు 50 వేల కోట్ల పెట్టుబడులతో లక్షలాది ఉద్యోగాలు కోల్పోయాము.

అమెరికా లాంటి దేశాలకు వలస వెళ్లలేని యువతను కూడా, పొరుగు రాష్ట్రాలకు ఉద్యోగల కోసం వెళ్లగొట్టే దురదృష్టకర వాస్తవ పరిస్థితులు. చదువు, సంస్కారం & తెలివి వున్న యువత కక్ష సాధింపు రాజకీయలతో, ఇక్కడ వద్దను కొని, వలసబాట పడుతోంది. #చాకిరేవు.

 
 
 
Posted

vastahavame kada rasindi.. CBN may be a crook but when it comes to pulling IT jobs he was good at it... It may take another decade for Andhra to build IT infrastructure just like Hyderabad and Bangalore

Posted
2 minutes ago, Joker_007 said:

vastahavame kada rasindi.. CBN may be a crook but when it comes to pulling IT jobs he was good at it... It may take another decade for Andhra to build IT infrastructure just like Hyderabad and Bangalore

Never gonna happen. 

Posted
18 hours ago, csrcsr said:

Antha baga rasadu melliga CBN ni tisukochadu

Adi rasinde CBN ni teesukaranike

Normally, starting lo ne CBN ani cheppi start pettetollu...brand value baaga padipoindi kada, CBN ante evad saduvutaledu ani ila last lo pedutunaru anamata

Posted
3 hours ago, AndhraneedSCS said:

Never gonna happen. 

It was never meant to happen in the first place, it’s just that people were shown dreams.

Posted
1 minute ago, Pappu_Packitmaar said:

Adi rasinde CBN ni teesukaranike

Normally, starting lo ne CBN ani cheppi start pettetollu...brand value baaga padipoindi kada, CBN ante evad saduvutaledu ani ila last lo pedutunaru anamata

Ardam ayinid 🤣

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...