Jump to content

Recommended Posts

Posted

ఆయన కార్ల విలువ రూ. 40 వేల కోట్లు!

600 రోల్స్‌రాయిస్‌లూ 570 మెర్సిడెజ్‌ బెంజ్‌లూ 450 ఫెరారీలూ 380 బెంట్లీలూ 200 బిఎండబ్ల్యూలూ 170 జాగ్వార్‌లూ... ఈ లెక్కలన్నీ ఏ కార్ల ఎక్స్‌పోలోవో కాదు, బ్రునై సుల్తాన్‌ గ్యారేజ్‌లోని కార్లివి. ఇవన్నీ కేవలం ఏదో నోటి లెక్క మాత్రమే. అసలు ఎన్ని ఉన్నాయో ఏమేం ఉన్నాయో ఆయనకే కచ్చితంగా తెలీదట. ఐదువేల నుంచి ఏడువేల కార్లు ఉండొచ్చని ఓ అంచనా. వాటి విలువ దాదాపు 40 వేల కోట్ల రూపాయల పైచిలుకేనట.

 

08112020sun-sf9b.jpg

‘మా డబ్బున్నవాళ్ల కష్టాలు మీకేం తెలుసు...’ అని ఆమధ్య వచ్చిన ఓ సినిమాలో డైలాగ్‌. నిజమే కావచ్చు, ఎందుకంటే వాళ్ల అలవాట్లూ పద్ధతులూ సామాన్యుల ఊహకు కూడా అందవు. బ్రునై సుల్తాన్‌ హాబీ కూడా అలాంటిదే. విలాసవంతమైన కార్లు అంటే ఆయనకి తగని మోజు. అందుకే ప్రపంచంలోనే మరెవ్వరూ సేకరించలేనన్ని కార్లతో తన గ్యారేజీల్ని నింపేశాడు. వాటిల్లో కొన్ని తనకోసమే ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకున్నవీ ఉన్నాయట. కొన్ని మోడల్స్‌ బయట చూద్దామన్నా కూడా కనిపించవట.
ఉదాహరణకి 1989లో ఫెరారి కంపెనీ డిజైన్‌ చేసిన రెండు మైథాస్‌ కార్లూ ఆయన దగ్గరే ఉన్నాయట. అంతేకాదు, ఆ కంపెనీ నలభయ్యో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 1987 -1992 మధ్యలో ఫెరారి ఎఫ్‌ 40 కార్లను తయారుచేసింది. సాధారణంగా అన్ని ఫెరారి కార్లకీ స్టీరింగ్‌ ఎడమవైపునే ఉంటుంది. కానీ కుడివైపు ఉండాలన్న సుల్తాన్‌గారి కోరిక మేరకు ఆ కంపెనీ 11 కార్లను అలాగే డిజైన్‌ చేసిందట. అలాగే మెక్‌లారెన్‌ కంపెనీ 1992 నుంచి 1998 మధ్యలో తయారుచేసిన ఎఫ్‌1 కార్లు అత్యంత అరుదైనవే కాదు, వాటి ఖరీదు 59 నుంచి రూ. 100 కోట్లు పైనే. అలాంటివి రాజుగారి ఖాతాలో పది ఉన్నాయట.


అలాంటి కారు అదొక్కటే!
బెంట్లీ కంపెనీ సాధారణంగా ఎస్‌యూవీలు డిజైన్‌ చేయదు. కానీ డబ్బుంటే కొండమీద కోతి అయినా దిగి వస్తుందన్నట్లు సుల్తాన్‌గారికోసం ఆ కంపెనీ డొమినేటర్‌ పేరుతో ఆరు ఎస్‌యూవీలనీ డిజైన్‌ చేసి ఇవ్వక తప్పలేదు. ఆయన కోరిక మేరకు బిఎండబ్ల్యూ సైతం నాజ్కా ఎం12 అనే కాన్సెప్ట్‌ కారును డిజైన్‌ చేసింది. అలాగే మెర్సిడెజ్‌-బెంజ్‌ సిఎల్‌కె జిటిఆర్‌ రేసింగ్‌ కారుని కూడా ఆయనకోసం కుడివైపు వీల్‌ ఉండేలా డిజైన్‌ చేసి ఇచ్చింది. ఆ మోడల్‌లో అలా ఉన్న కారు అదొక్కటే.

ఇక, సుల్తాన్‌ పెళ్లి ఊరేగింపుకోసం కొన్న రోల్స్‌ రాయిస్‌ కారు విలువ సుమారు రూ.104 కోట్లు. అంతేకాదు, తరవాత ఆ కారుకి అచ్చంగా 24 క్యారెట్ల బంగారంతో పూత పూసి రీ డిజైన్‌ చేశారట. ఆ బంగారం విలువెంతో ఎవరికీ తెలీదు మరి.

 

08112020sun-sf9c.jpg

ముఖ్యంగా ఆయన దగ్గర ఉన్నన్ని రోల్స్‌రాయిస్‌ కార్లు ప్రపంచంలో మరెవ్వరి దగ్గరా లేవట. 90వ దశకంలో అయితే రోల్స్‌రాయిస్‌ కంపెనీ తయారుచేసిన కార్లలో సగం సుల్తాన్‌గారి కుటుంబమే కొందట. ఇవన్నీ ఒకెత్తయితే, రాజ్‌కోట్‌ను పరిపాలించిన ధర్మేంద్రసింగ్‌ లఖాజిరాజ్‌ దగ్గర 1934లో డిజైన్‌ చేసిన రోల్స్‌రాయిస్‌ ఫాంటమ్‌ఖిఖి కారు ఉండేది. స్టార్‌ ఆఫ్‌ ఇండియాగా పిలిచే ఆ కారుమీదా పెట్రోల్‌ కింగ్‌ కన్ను పడింది. అంతే... వెనకాముందూ చూడకుండా వేలంలో దాదాపు 103 కోట్ల రూపాయలతో కొనేశాడట. అప్పట్లో అత్యధిక ధరకి వేలంలో అమ్ముడుపోయిన కారుగా అది రికార్డునీ సొంతం చేసుకుంది.

 

08112020sun-sf9dd.jpg

ఇవే కాదు, బుగాటి ఇబి110, ఆస్టన్‌ మార్టిన్‌, లాంబొర్గిని... ఇలా ఖరీదైన కార్ల జాబితా ఆయన దగ్గర చాలానే ఉంది. ఆయన గ్యారేజీలోని కార్లను వాడినది మళ్లీ వాడకుండా రోజుకో కారులో వెళ్లినా పది సంవత్సరాలు పైనే పడుతుంది. చమురు దేశమైన బ్రునైలో దాదాపు అందరికీ కార్లు ఉంటాయి. అందుకే పబ్లిక్‌ రవాణా అంతగా ఉండదు. అప్పుడప్పుడూ రాజ్య పర్యవేక్షణ కోసం సుల్తాన్‌ నేరుగా ఊళ్లలోకి వచ్చేస్తారట. అలా ఓసారి వచ్చినప్పుడు ఒకాయన దగ్గర కారు తీసుకుని చుట్టుపక్కలంతా తిరిగి, మళ్లీ కారు ఇచ్చి వెళ్లేటప్పుడు కొత్తకారు కొనుక్కోమని డబ్బులు ఇచ్చారట. ఎంతయినా కార్లంటే తగని పిచ్చి కదా మరి. కార్లన్నా వాటిని నడపడం అన్నా సుల్తాన్‌కి ఎంత ఇష్టం అంటే ఇప్పటికీ అర్ధరాత్రి తన సోదరుడితో కలిసి ఫెరారీ కారుల్లో రేసింగ్‌లకు వెళతాడట.

 

08112020sun-sf9d.jpg

ఆయన సేకరించిన వేల కార్లన్నీ ఐదు రహస్య ప్రదేశాల్లో కనీసం వంద గ్యారేజీల్లో ఉన్నాయని చెబుతుంటారు. అవి తుప్పు పట్టకుండా కండిషన్‌లో ఉండేలా చేసేందుకు ఆయా కంపెనీల నిపుణులే పని చేస్తుంటారనీ అంటారు. అయితే ఇటీవల కొన్ని కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయనీ, వాటి ధర సంగతి ఎలాగున్నా అరుదైన కార్లకు అలాంటి స్థితి రావడం దురదృష్టకరమనీ ఆటోమొబైల్‌ నిపుణులు గొణుక్కుంటుంటారు.

08112020sun-sf9d.jpg
బ్రునై కథాకమామిషు!
ఒక్క కార్లే కాదు... రాజుగారి భవనం, విమానం అన్నీ అద్భుతాలే. 722 కోట్ల రూపాయల ఖరీదు చేసే ఎయిర్‌బస్‌, 1300 కోట్ల బోయింగ్‌, 2 వేల కోట్ల రూపాయలతో చేసిన కస్టమైజ్‌డ్‌ బోయింగ్‌... ఇలా చాలానే ఉన్నాయి. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద నివాస రాజ భవనమూ సుల్తాన్‌దే. దీనిపేరు ఇస్తానా నురుల్‌ ఇమాన్‌. విస్తీర్ణం సుమారు ఇరవై ఒకటిన్నర లక్షల చదరపు అడుగులు. దాదాపు 11 వేల కోట్ల రూపాయలతో కట్టిన ఈ భవంతిలో 1788 గదులూ, 257 బాత్‌రూములూ, 5 వేల మంది పట్టే బాంకెట్‌ హాలూ, 110 కార్లు పట్టే గ్యారేజీ, ఎయిర్‌కండిషన్డ్‌ గుర్రపుశాలా, రెండు వందల గుర్రాలూ, ఐదు స్విమ్మింగ్‌పూల్సూ ఉన్నాయి.

 

 

08112020sun-sf9e.jpg

రాజుగారి సిరిసంపదలకీ విలాసాలకీ కారణం అక్కడి చమురు నిల్వలే. అవును మరి, అదృష్ట దేవత నడినెత్తినెక్కి నృత్యం చేస్తే నడిచే నేలా బంగారంగా మారి పోతుందనడానికి బ్రునై చక్కని ఉదాహరణ. 20వ శతాబ్దం ప్రారంభంలో అక్కడ బయటపడ్డ చమురు నిల్వలు దాన్ని సువర్ణదీవిగా మార్చేశాయి. దాంతో రాజుగారి సంపద సుమారు రూ.1.5 లక్షల కోట్లకు చేరింది. రాజులూ రాజ్యాలూ నశించినా అక్కడక్కడా మిగిలి ఉన్న రాజ్యాల్లో బ్రునై ఒకటి. గత 600 సంవత్సరాలుగా ఒకే కుటుంబం ఈ దేశాన్ని పాలిస్తోంది. ఎలిజబెత్‌ రాణి తరవాత సుదీర్ఘకాలంపాటు రాజుగా ఉన్న వ్యక్తి ఈయనే. 1967లో సింహాసనం అధిష్టించినప్పటినుంచీ ఏకచ్ఛత్రాధిపత్యంగా రాజ్యాన్ని పాలిస్తున్నాడు. కేవలం రాజు మాత్రమే కాదు, దేశ ప్రధాని కూడా. విదేశాంగ, ఆర్థిక, రక్షణ శాఖలన్నీ ఆయన అధీనంలోనే ఉంటాయి. సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌, ఆర్మీ కమాండర్‌, నేషనల్‌ యూనివర్సిటీ ఛాన్సలర్‌... అన్నీ ఆయనే. సర్వం సుల్తాన్‌మయం అన్నమాట. దొంగతనం చేస్తే కాళ్లూ చేతులూ విరిచేయడం, మోసం చేసినా స్వలింగ సంపర్కానికి పాల్పడినా రాళ్లతో కొట్టి చంపడం వంటి శిక్షలతో కూడిన షరియా చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చి క్రూర నియంతగానూ పేరొందాడు. ఆయనకు ముగ్గురు భార్యలు. మొత్తం పన్నెండుమంది సంతానం. కార్లూ భవనాలూ అనే కాదు, వేడుకలకీ ఆయన అంతేస్థాయిలో ఖర్చుపెడతాడు. తన యాభయ్యో పుట్టినరోజు వేడుకలకోసం రూ.193 కోట్లు వెదజల్లాడనీ, అప్పట్లో మైఖేల్‌ జాక్సన్‌ కన్సర్ట్‌ కోసం రూ. 134 కోట్లు ఖర్చుపెట్టాడనీ చెబుతారు. ఆయన బ్యాడ్మింటన్‌ కోచ్‌కి ఇచ్చే జీతం ఏడాదికి పది కోట్ల రూపాయల పైచిలుకేనట. మహారాజులా మజాకానా..!

 

Posted

Show off.. 

tesla GIF

So he owns a big car parking garage with plenty of cars...  drivers naduputaru aa cars.. not him.. and he hardly uses probably a handful of cars.. rest of them will be rusting in a garage..  

Posted
3 hours ago, kakatiya said:

 

 

ali.gif aa face ku. . . aa yogam 

 

Exact ga ante Hyd lo road side mutton kotte fesu, pissfull lorry driver fesu, shamshabad-bangalore highway roadside puncture shop fesu. . .aadiki yaadundho sudi venkatesh+gifs+comedy.gif 

  • Haha 1
Posted
7 hours ago, Assam_Bhayya said:

 

ali.gif aa face ku. . . aa yogam 

 

Exact ga ante Hyd lo road side mutton kotte fesu, pissfull lorry driver fesu, shamshabad-bangalore highway roadside puncture shop fesu. . .aadiki yaadundho sudi venkatesh+gifs+comedy.gif 

Telgi trains lo peanuts, samosalu ammevadu..cut chesthe his wealth from stamp scam was close to 16,000 crores 

 

He ultimately died of aids

 

abdul_karim_telgi_060822.jpg 

  • Haha 1
Posted

gp, atla vachinai vadiki anni paisal ?

Posted
7 minutes ago, Biskot2 said:

gp, atla vachinai vadiki anni paisal ?

Whole country is his own and he is still king..oil deposits and exports.

Posted
8 hours ago, AndhraneedSCS said:

Vadi cars value ne antha unte, why is he not RICHEST?

He was richest with 40 billion $ in 1987.

 

 

Posted

Brunei history lo chustay wiki ..cholas ruled anta ah country ... Cholas and pandavas great vayya ... Mana Indian rulers lo veelu Chala great ... All are bakwas 17 century nunchi unna kings all are waste ... No good history ... No exploring ... Portuguese Mana oka district antha undadhu adhi kuda vachi occupied India ni... Indians history gurinchi entha thakuva matkadukunaty antha manchidhi ... Andharu vachi back nunchi ongobettina valle

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...