r2d2 Posted November 16, 2020 Report Posted November 16, 2020 వర్క్ ఫ్రమ్ హోం ఎఫెక్ట్: ఉద్యోగుల్లో కొత్త రుగ్మత! కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఎక్కడ.. ఎప్పుడు.. ఎలా సోకుతుందోనని ప్రజలంతా క్షణక్షణం భయపడుతున్నారు. చలికాలంలో కరోనా వ్యాప్తి అధికమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో కరోనా భయం మరింత పెరిగింది. దీనితోనే సతమతవుతున్నారనుకుంటే.. తాజాగా ఓ రుగ్మత వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగుల్ని పట్టిపీడిస్తోంది. దీని నుంచి బయటపడటం కోసం శస్త్రచికిత్స చేయించుకుంటున్నారట. కరోనా మహమ్మారి వల్ల విధి నిర్వహణలో చాలా మార్పులు వచ్చాయి. అనేక సంస్థలు తమ ఉద్యోగుల్ని వర్క్ ఫ్రమ్ హోం చేయమంటున్నాయి. దీంతో ఉద్యోగులు ఇంటికే పరిమితమై విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో భాగంగా సహ ఉద్యోగులు, ఉన్నతాధికారులు, క్లయింట్లతో జూమ్ తదితర యాప్‌ల ద్వారా వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నారు. అయితే, ఈ వీడియో సమావేశాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల్లో ‘జూమ్ డిస్మోర్ఫియా’ పెరుగుతోందట. తమ శరీరం లేదా ముఖంలో లోపాలు ఉంటే వాటి వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోయి.. మానసికంగా ఇబ్బంది పడుతారు. ఈ రుగ్మతనే ‘డిస్మోర్ఫియా’ అంటారు. ఇటీవల ఉద్యోగులు వీడియో సమావేశాల్లో పాల్గొంటున్నప్పుడు తమ ముఖంలో లోపాలు చూసుకొని మానసికంగా బాధపడుతున్నారట. ఆ లోపాలను సరిదిద్దుకునేందుకు శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నట్లు అమెరికాకు చెందిన కొందరు పరిశోధకులు వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఉద్యోగులపై నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. ఇది వరకు ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లి ఉద్యోగాలు చేసేవారు కాబట్టి.. తమ రూపు గురించి మరీ పెద్దగా ఆలోచించేవారు కాదు.. కానీ, ఇప్పుడు వీడియో సమావేశాల్లో ఉద్యోగులు తమ ముఖాన్ని కూడా చూసుకోవాల్సి వస్తుండటంతో ముఖంలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయట. దీంతో వారిలో ‘డిస్మోర్ఫియా’ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే అందంగా కనిపించడం కోసం చాలా మంది ఉద్యోగులు శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నారు. ముక్కు సరి చేయించుకోవడం, ముడతలు తొలగించుకోవడం వంటివి చేస్తున్నారట. ఈ మధ్య కాలంలో గూగుల్‌సెర్చ్‌లో ఎక్కువగా ‘అక్నే’, ‘హెయిర్‌లాస్’ వంటి అందానికి సంబంధించిన పదాలను ఎక్కువగా సెర్చ్ చేయడమే ‘జూమ్ డిస్మోర్ఫియా’ పెరుగుతోందనడానికి ఉదాహరణగా నిలుస్తోంది. Quote
HugoStrange Posted November 16, 2020 Report Posted November 16, 2020 ante valla illalo addalu leva or inthakumundu office ki velthe online meetings undevi kava. Quote
Iriswest Posted November 16, 2020 Report Posted November 16, 2020 janalu khaliga unte ee aalochanale vastai Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.