kakatiya Posted November 22, 2020 Report Share Posted November 22, 2020 ఆదర్శభావాలు కలిగిన అమ్మాయిలు దేశానికి సేవలందించే వాడు తన భర్త కావాలని కోరుకుంటారు. వారు సైన్యంలో పనిచేసే వారిని మరింతగా ఇష్టపడతారు. అలాంటి వారి కోసం ‘వరుడు కావలెను’ అని మ్యాట్రిమోనిలో ప్రకటనలు ఇస్తారు. ఈ బలహీనతనే ఓ మోసగాడు తన బలంగా మార్చుకున్నాడు. దానికి సామాజిక మాధ్యమాలను ఆయుధంగా వాడుకున్నాడు. సైనికుడి దుస్తులతో ముస్తాబై డీపీలు పెట్టి మురిపించి.. కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానని యువతులను నమ్మించి రూ.8 కోట్లు దోచేసి చివరికి పోలీసులకు చిక్కాడు. శనివారం హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఆ వివరాలను విలేకరులకు వివరించారు. ప్రకాశం జిల్లా, కీలంపల్లి గ్రామం, పాలుకురల్ల తండాకు చెందిన ముదావత్ శ్రీను నాయక్, అలియాస్ శ్రీనివాస్ చౌహాన్ (42) నిరుద్యోగి. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్, సైనిక్‌పురిలో ఉంటున్నాడు. ఆయన చదివింది 9వ తరగతి మాత్రమే. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినట్లు, మేఘాలయ సీఎంజే వర్శిటీ నుంచి ఎంటెక్ (ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్) చేసినట్లుగా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేయించాడు. 2002లో గుంటూరులోని డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయంలో సూపరింటెండెంట్ హోదాలో ఉన్న ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. శ్రీనునాయక్ కుటురబం గుంటూరు జిల్లా వినుకొండలో నివాసముంటోంది. ఇతను 2014లో హైదరాబాద్‌కు వచ్చేశాడు. శ్రీనివాస్ చౌహాన్ పేరిట తీసుకున్న ఆధార్‌కార్డులో తాను ఆర్మీ అధికారిగా నమోదు చేయించాడు. సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు తెరిచి ఆర్మీ అధికారి దుస్తుల్లో డీపీలు పెట్టాడు. పుణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందినట్లుగా పేర్కొన్నాడు. వరుడు కోసం ఎదురు చూస్తున్న అమ్మాయిలకు బయోడేటా పంపించేవాడు. తన వలలో చిక్కిన అమ్మాయి కుటుంబ సభ్యులతో ఆర్మీ దుస్తుల్లో ఉండి ఆన్లైన్లో మాట్లాడేవాడు. తనకు కట్నం వద్దని ఆకట్టుకునేవాడు. అమ్మాయి కుటుంబ సభ్యులతో చనువు పెరిగిన తరువాత ఏదో అవసరం ఏర్పడిందని రూ. లక్షల్లో దండుకునేవాడు. ఉప్పల్‌లో గదిని అద్దెకు తీసుకుని దానిని ఆర్మీ అధికారి కార్యాలయంలా ముస్తాబు చేశాడు. ఇక్కడి నుంచి అమ్మాయిలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడేవాడు. * హైదరాబాద్‌లోని సచివాలయం అధికారికి వైద్య విద్య చదివిన కూతురుంది. ఆమెతో పెళ్లి పత్రికల వరకు వచ్చాక అత్యవసరంగా డబ్బు కావాలని రూ.56 లక్షలు తన ఖాతాలో వేయించుకున్నాడు. వరంగల్‌కు చెందిన ఓ కుటుంబం నుంచి రూ.2 కోట్లు కొట్టేశాడు. * మరో అమ్మాయికి తాను ఖరగ్‌పూర్‌లో ఐఐటీ చేశానని చెప్పాడు. ఆ అమ్మాయి ఆ విద్యా సంస్థలో విచారిస్తే అది అవాస్తవమని తేలింది. దాంతో ఆమె నిలదీసిప్పటికీ మాయమాటలు చెప్పి నమ్మించాడు. చివరకు ఆమె నుంచి రూ.76 లక్షలు లాగేశాడు. భార్యను వదల్లేదు: తాను ఆర్మీ మేజర్ అని భార్యను కూడా నమ్మించాడు. ఇటీవల ఆమె నుంచి అత్యవసరమంటూ రూ.65 లక్షలు తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఇలా 17 మంది అమ్మాయిలను మోసం చేశాడు. జవహర్‌నగర్ ఠాణాలో ఇతని 419, 420 సెక్షన్ల కింద కేసు నమోదైంది. వరంగల్ జిల్లా సుబేదారి ఠాణాలోను కేసు ఉంది. శనివారం శ్రీను నాయక్ కారులో మరో అమ్మాయిని మోసం చేయడానికి వెళుతుండగా సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. Quote Link to comment Share on other sites More sharing options...
Ryzen_renoir Posted November 22, 2020 Report Share Posted November 22, 2020 He should be hanged for treason , army ni ilaga vadadam goram Quote Link to comment Share on other sites More sharing options...
sattipandu Posted November 22, 2020 Report Share Posted November 22, 2020 24 minutes ago, Ryzen_renoir said: He should be hanged for treason , army ni ilaga vadadam goram I concur Quote Link to comment Share on other sites More sharing options...
kakatiya Posted November 22, 2020 Author Report Share Posted November 22, 2020 25 minutes ago, Ryzen_renoir said: He should be hanged for treason , army ni ilaga vadadam goram politicians too Quote Link to comment Share on other sites More sharing options...
soldier Posted November 22, 2020 Report Share Posted November 22, 2020 Secretary lo pani chese father...medicine chadive ammayi...endi desparate. I felt people more dangerous than these scammer. What a joke. Quote Link to comment Share on other sites More sharing options...
kakatiya Posted November 22, 2020 Author Report Share Posted November 22, 2020 2 minutes ago, soldier said: Secretary lo pani chese father...medicine chadive ammayi...endi desparate. I felt people more dangerous than these scammer. What a joke. even that astrologer married to a doctor who was his second wife.. for her first marriage.. she did PG in 3 specalities Quote Link to comment Share on other sites More sharing options...
sattipandu Posted November 22, 2020 Report Share Posted November 22, 2020 6 minutes ago, kakatiya said: even that astrologer married to a doctor who was his second wife.. for her first marriage.. she did PG in 3 specalities Yeah that lady seemed way too over qualified and yet was so gullible Maree intha vp and soft untey kastam ladies Quote Link to comment Share on other sites More sharing options...
LadiesTailor Posted November 22, 2020 Report Share Posted November 22, 2020 Entha pelli chesukunta ante matram 50l 2c istara evvadanna... asalu antha amayakulu ela dorikaru veediki Quote Link to comment Share on other sites More sharing options...
kakatiya Posted November 22, 2020 Author Report Share Posted November 22, 2020 10 hours ago, LadiesTailor said: Entha pelli chesukunta ante matram 50l 2c istara evvadanna... asalu antha amayakulu ela dorikaru veediki Vaadu search chesuntadu...smell chestaru Quote Link to comment Share on other sites More sharing options...
dewarist Posted November 22, 2020 Report Share Posted November 22, 2020 11 hours ago, LadiesTailor said: Entha pelli chesukunta ante matram 50l 2c istara evvadanna... asalu antha amayakulu ela dorikaru veediki Ade anukunna, chillara penkulla paisal icchesaru. Ofcourse this guy would have played so much on their emotions to gain so much trust that they were ready to go to any lengths Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.