kakatiya Posted November 28, 2020 Author Report Posted November 28, 2020 ఆరోగ్యం కోసమనో ఆధునిక మార్గమనో మామూలుగా మనం తాగే పాలకి బదులుగా అప్పుడప్పుడూ వేరే రకాలని ప్రయత్నిస్తూ ఉంటాం. మేకపాలు, బాదం పాలు, గాడిదపాలు, సోయాపాలు ఈ కోవలోనివే. కానీ వీటన్నింటినీ తలదన్నేందుకు సిద్ధమవుతోంది ఒంటెపాల మార్కెట్! ఆరోగ్యం విషయంలో దీనికి సమానం మరేదీ లేదంటున్న నిపుణులు... దీని వాడకం పెరిగితే పర్యావరణానికి ఎంతో మేలని చెబుతున్నారు. ఆ రెండింటికీ సంబంధం ఏమిటంటారా..! మీరే చదవండి... మనదేశంలో పెద్దగా లేదుకానీ ప్రపంచవ్యాప్తంగా ఒంటెపాల మార్కెట్ చాలా పెద్దది. గత ఏడాదే నాలుగున్నర లక్షల కోట్ల వ్యాపారం జరిగిందంటే చూసుకోండి! ఒంటెపాలకి సోమాలియా, కెన్యా వంటి ఆఫ్రికా దేశాలూ, అరబ్బు దేశాలే ప్రధాన ఉత్పత్తి కేంద్రాలు. అక్కడి నుంచి పాలూ, గడ్డకట్టించిన పాలు, పొడిగా చేసిన పాల పౌడర్లు వంటివి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతవుతుంటాయి. మరీ ఆఫ్రికా, అరబ్బు దేశాల స్థాయిలో కాకున్నా ఒంటెలు మనదేశంలోనూ చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నాయి. కాకపోతే మనం ఎప్పుడూ దేశవ్యాప్తంగా వాటి పాల సేకరణ, సరఫరాలపైన దృష్టిపెట్టలేదు. ప్రస్తుతం ఆ అవసరం రావడానికి విదేశాల తరహాలో ఇక్కడా భారీగా లాభాలు చూడాలన్నది ఒక్కటే కారణం కాదు. ఈ పాల ఉత్పత్తి ద్వారానైనా మనదేశంలో ఒంటెల సంఖ్య అంతరించిపోకుండా కాచుకోవాలన్నదే ఉద్దేశం. ఒంటెల ద్వారా వేలాది సంవత్సరాల పర్యావరణ చక్రాన్ని తెగిపోకుండా చూడటం దీని వెనకున్న అసలు లక్ష్యం! ఒంటెలు అంతరిస్తున్నాయి... ఎడారి అనగానే మనకి ముందు గుర్తొచ్చే జంతువు ఒంటె. వందలాది సంవత్సరాల నుంచి రాజస్థాన్, గుజరాత్ల మధ్య సరకు రవాణాకి ప్రధాన ఆధారం ఒంటెలే. ఆ రెండు రాష్ట్రాల్లోనే కాకుండా హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ వీటిని ఎక్కువగా వాడుతుండేవారు. కానీ, ఈ నాలుగు రాష్ట్రాల్లోనూ రోడ్ల నిర్మాణం పెరిగి రవాణా అభివృద్ధయ్యేకొద్దీ ఒంటెల అవసరం తగ్గిపోయింది. వాటి ద్వారా వచ్చే ఉపాధి కోల్పోయిన ‘రైకా’ అనే సంప్రదాయ ఒంటెల కాపరి కులాలవాళ్లు పేదరికంలో కూరుకు పోయారు. వీటిని కబేళాలకి తెగనమ్మడం మొదలుపెట్టారు. గత దశాబ్దకాలంలోనే ఉత్తరాదిలో ఒంటెల సంఖ్య భారీగా పడి పోయింది. వాటి సంఖ్య తగ్గడం పర్యావరణానికి మంచిది కాదనే ఆందోళనా మొదలైంది. అలా ఆందోళనకి గురైనవాళ్లలో జర్మనీకి చెందిన మహిళా శాస్త్రవేత్త ఇల్సే కోలర్ రాలఫ్సన్ ఒకరు. 1990ల్లో ఇండియా వచ్చిన ఆమె ఇక్కడ ‘కామెల్ ఛరిష్మా’ అనే సంస్థని ఏర్పాటుచేశారు. దాని ద్వారా తొలిసారి, ఒంటెపాలని సేకరించి విక్రయించొచ్చని రైకా ప్రజలకి కొత్త ఉపాధి మార్గాన్ని చూపారు. ఈ పాలని ఆటిజం వంటి మానసిక సమస్యలున్న పిల్లలకీ, క్యాన్సర్ రోగులకీ, మధుమేహులకీ వాడుతుండేవారు. మనదేశంలో స్టార్టప్‌ల బూమ్ మొదలుకాగానే ఆద్విక్ ఫుడ్స్, డీఎన్ఎస్ గ్లోబల్ ఫుడ్స్, న్యూట్రా విటా వంటి సంస్థలు ఈ పాలని సేకరించి విక్రయించడం ప్రారంభించాయి. అమూల్ సంస్థ కూడా ఈ ఒంటెపాల రంగంలోకి దూసుకొచ్చింది! Quote
afacc123 Posted November 28, 2020 Report Posted November 28, 2020 Just now, kakatiya said: ఒంటె పాలతో చాక్లెట్..! Oh my god then whoever eats that chocolate his internal intestines will be dried out because they also start to reject liquid ??? Quote
jamesbond Posted November 28, 2020 Report Posted November 28, 2020 12 minutes ago, superhit3 said: Good for health or bad? UAE lo chala popular... Chocs kooda ammaru probably no harm for health 1 Quote
Joker_007 Posted November 28, 2020 Report Posted November 28, 2020 maa area lo unna arabs ki idante chaala istam... oka sari try chesa too thick.Desi's who has cow fantassy might not like it... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.