r2d2 Posted November 28, 2020 Report Posted November 28, 2020 రాతమార్చిన లడ్డూ! మీకో లడ్డూ కనిపించింది.. ఏం చేస్తారు? కమ్మగా ఆరగించేస్తారు... అంతేకదా... కానీ ఆమె మాత్రం ఆలోచనలో పడిపోయింది. అది వందలాది మంది తలరాత మార్చింది. కొండప్రాంతాల్లోని మహిళల సాధికారతకు కారణమైంది. స్త్రీలలోని సంఘటిత శక్తిని బయటకు తీసిన ఓ శాస్త్రవేత్త కథే ఇది... ఉత్తరాఖండ్‌లోని తెహ్రీగఢ్వాల్ జిల్లాలో కృషి విజ్ఞాన్కేంద్రంలో శాస్త్రవేత్తగా చేరింది కృతి కుమారి. బాధ్యతల్లో భాగంగా స్థానిక మహిళారైతులను గమనించేది. ఆ పర్వత ప్రాంతంలో అన్నీ నిరుపేద కుటుంబాలే. ఉన్న కొద్దిపాటి పొలంలోనే రాత్రీపగలూ మహిళలు కష్టపడటం చూసేది. ఎంత కష్టపడ్డా ఆ ఆదాయం వాళ్లకు సరిపోయేదికాదు. వాళ్ల కోసం ఏదో ఒకటి చేయాలనుకున్న కృతి ముందు స్థానిక భాషని నేర్చుకుని వాళ్లలో ఒక్కరిగా మారిపోయింది. ఆ వాతావరణం చిరుధాన్యాలకు అనువుగా ఉండటంతో... ఆ పంటలపై వాళ్లలో అవగాహన తీసుకొచ్చింది. వాళ్లని బృందాలుగా మార్చి స్వశక్తితో రాణించడం ఎలానో నేర్పించింది. ఐరన్ లడ్డూ చేసి... తాను చదివిన ఫుడ్‌టెక్నాలజీ నైపుణ్యాలని వాడి... వాటితో పోషకాహారాన్ని ఎలా తయారుచేయాలో వాళ్లకు నేర్పించింది. అలా చేసిన మొదటి ప్రయోగమే ఐరన్ లడ్డు. దీని తయారీని మహిళాబృందాలకు స్వయంగా నేర్పింది. చిరుధాన్యాలకు బెల్లం కలిపి చేసే ఈ లడ్డూలో పోషక విలువలు పుష్కలంగా ఉండటంతో వాటిని అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందేలా ప్రభుత్వ అనుమతి తీసుకుంది. ఆ పని విజయవంతం అవడంతో జిల్లావ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలన్నింటికీ వీటిని అందించడం మొదలుపెట్టాయి కృతి ఆధ్వర్యంలోని మహిళాబృందాలు. క్రమంగా మహిళలు సహకార సంఘాలుగా మారి... ఈ ఐరన్ లడ్డూల తయారీని పెద్ద ఎత్తున చేయడం ప్రారంభించి లాభాలు చవిచూశారు. ఐరన్ లడ్డూ తయారీతో తన ప్రయోగాలు ఆపేయకుండా తక్షణశక్తిని అందించే ‘ఊర్జా’ అనే ఆహారపదార్థానికీ ఒక ఫార్ములా అందించింది కృతి. ఆ పదార్థాన్ని ప్రాథమిక వైద్యకేంద్రాలకు పంపిణీ చేయడానికి అనుమతిని కూడా తీసుకుంది. 30 గ్రామాల్లో ఆరువేలమంది.. చిరుధాన్యాలతోపాటు ఆప్రికాట్, ప్లమ్, నారింజ, నిమ్మ వంటి పండ్లు పండించడానికి కూడా తెహ్రీగఢ్వాల్ అనువుగా ఉండటంతో వాటి పెంపకాన్నీ ప్రోత్సహించింది కృతి. అలా పండించిన పండ్లతో సిరప్లు, జెల్లీలు, పచ్చళ్లు, మురబ్బాలు, న్యూట్రిషన్ బార్ల తయారీని ప్రారంభించింది. వీటిని జిల్లావ్యాప్తంగా సూపర్మార్కెట్లలో విక్రయించడానికి ఏర్పాట్లు చేసింది. ఇంటింటా పెరిగే గులాబీలు వృథాగా రాలిపోవడం చూసిన ఆమె వాటితో రోజ్‌వాటర్ తయారీని నేర్పించింది. సహజసిద్ధంగా తయారుచేసే ఈ రోజ్‌వాటర్‌కు దిల్లీలో మంచి గిరాకీ ఉంది. ఈ లాభాలన్నీ మహిళారైతులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాయి. ఆ రకంగా 30 గ్రామాల్లో ఆరువేల మంది మహిళలు కృతి కారణంగా లాభపడ్డారు. సగటున ప్రతి మహిళా పదివేల రూపాయలకు పైగా ఆదాయం పొందుతోంది. ‘మా సొంతూరు రాజస్థాన్. మానాన్న కాంతాప్రసాద్కు నేను ఫుడ్ టెక్నాలజీ చదవాలనే కోరిక ఉండేది. అలా ఈ రంగంలోకి అడుగుపెట్టా. ఎంటెక్ పూర్తిచేసి కృషి విజ్ఞాన్ కేంద్రంలో ఏడేళ్లక్రితం శాస్త్రవేత్తగా చేరా. నేను చదివిన ఫుడ్ టెక్నాలజీతోనే మహిళల జీవితాల్లో వెలుగులు పూయించాలనుకున్నా. అనుకున్నట్టుగానే రాష్ట్రంలోని ఇతర జిల్లాల అంగన్వాడీ కేంద్రాలకు ఇక్కడ తయారవుతున్న ఐరన్ లడ్డూని అందించడానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మసాలాలు, ఔషధ గుణాలున్న లెమన్‌గ్రాస్, లావెండర్, రోజ్మేరీ వంటి మొక్కల పెంపకంలో మహిళలకు శిక్షణని ఇప్పించబోతున్నా’ అని అంటోన్న 28 ఏళ్ల ఈ యువ శాస్త్రవేత్తను ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమానికి అంబాసిడార్‌గా ఎంపిక చేసింది. Quote
Picheshwar Posted November 28, 2020 Report Posted November 28, 2020 16 minutes ago, DummyVariable said: @PilliBeta @google @Husband Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.