r2d2 Posted December 10, 2020 Report Posted December 10, 2020 మా పార్టీ రూపుదిద్దుకుంటుంది అందరితో చర్చించే పీసీసీ అధ్యక్షుడి ఎంపిక కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్ అందరితో చర్చించి ప్రజాస్వామ్య పద్ధతిలోనే కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్ తెలిపారు. కొత్త అధ్యక్షుడిని నియమించే వరకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డే పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతారన్నారు. పార్టీని ఉత్తమ్ ఎంతో సమర్థంగా నడిపించారని.. దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంతో కష్టపడ్డారన్నారు. అధిష్ఠానం ఆయన పనితీరును అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపిందన్నారు. ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలతో కలిసి ఆయన బుధవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో పార్టీని ఉత్తమ్ సైనికుడిలా ముందుండి చక్కగా నడిపించారు. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం శాయశక్తులా ప్రయత్నించారు. అయినా ఓటమి తప్పలేదు. అస్ట్రేలియాతో జరిగిన వన్ డే క్రికెట్లో ఓడిపోగానే అంతా టీమిండియా పనైపోయిందన్నారు. కానీ.. అదే జట్టుతో జరిగిన టి20లో టీమిండియా గెలిచింది. అలాగే.. సమస్యలన్నింటినీ అధిగమించి సమర్థ పార్టీగా కొద్ది రోజుల్లోనే రూపుదిద్దుకుంటుంది’ అని ఠాగూర్ ధీమా వ్యక్తం చేశారు. కేవలం ఐదారుగురు సభ్యులతో మాట్లాడి కొత్త అధ్యక్షుడిని నియమించబోమని పీసీసీ కోర్ కమిటీ సభ్యులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ మంత్రులు ఇలా దాదాపు 150 మంది నాయకులతో ముఖాముఖి మాట్లాడతానన్నారు. 2023లో తెలంగాణలో కాంగ్రెస్‌ని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా కొత్త అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకొని ఏఐసీసీకి నివేదిక అందజేస్తానని..తర్వాత ప్రక్రియ ఏఐసీసీ చూసుకుంటుందన్నారు. ప్రజాస్వామ్య పద్ధతి, విస్తృత అభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నందున ప్రక్రియ పూర్తి కావడానికి సమయం పడుతుందని మాణికం తెలిపారు. Quote
BeerBob123 Posted December 10, 2020 Report Posted December 10, 2020 TG lo kooda ma teddies de hava antunna @veerigadu Quote
Vaampire Posted December 10, 2020 Report Posted December 10, 2020 Andaritho charchinchi prajaswamya padhathi lo ennukuntam.... lol. What a joke... final ga decide chesedhi sonia gandhi.... bongulo opinions pattinchukodhu Quote
Vaampire Posted December 10, 2020 Report Posted December 10, 2020 Concussion substitute valla gelichindi india. Alagey congi supreme ki substitute vasthey thappa baagu padadhu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.