Jump to content

People who are planning to buy or sell real estate in Hyderabad


Recommended Posts

Posted

నేటి నుంచే ఆస్తుల రిజిస్ట్రేషన్లు.. రెండ్రోజుల్లో బుక్కయింది 620 స్లాట్ల

ఉమ్మడి ఆస్తులు, పవరాఫ్‌ అటార్నీ ఆప్షన్లు నో

సేల్‌  డీడ్‌ రద్దు, మార్పులకు అవకాశం లేదు

చెక్కు, డీడీ రూపంలో చెల్లింపునకూ ఇబ్బందే

కొత్తగా ఫ్లాట్‌ కొన్నవారికి పీటిన్‌ వచ్చేదెలా?

ధరణి మాదిరిగానే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ!

కార్డ్‌ పద్ధతికి పూర్తి భిన్నంగా కొత్త విధానం

పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్లు 6 లక్షలు?

ప్రభుత్వ తీరుపై రియల్‌ సంఘాల ఆగ్రహం

నేడు సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల ఎదుట ధర్నా

 

అంబర్‌పేట డీడీకాలనీలో ఉండే లింగారెడ్డికి విద్యానగర్‌లో ఓ ఇల్లు ఉంది. వారసత్వంగా వచ్చిన ఆ ఇల్లు లింగారెడ్డి, ఆయన సోదరుడి పేరుతో ఉమ్మడి ఆస్తిగా ఉంది. ఇటీవల ఆ ఇంటిని విక్రయించాలని అన్నదమ్ములు భావించారు. రూ.80 లక్షలకు ఓ పార్టీతో బేరం కుదుర్చుకున్నారు. తాజాగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో స్లాట్‌ బుక్‌ చేసుకోవడానికి వెళ్లారు. కానీ, వెబ్‌సైట్‌లో ఎక్కడా ఉమ్మడి ఆస్తి విక్రయానికి ఆప్షన్‌ లేదు. చేసేదేం లేక.. ఉసూరుమంటూ వెనుదిరిగారు.

 

హైదరాబాద్‌/సిటీ, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. శనివారం సాయంత్రానికి 10,509 మంది రిజిస్ట్రేషన్ల స్లాట్ల కోసం తమ పేర్లు నమోదు చేసుకున్నారు. స్లాట్‌ బుకింగ్‌ ఈ నెల 11 నుంచి ప్రారంభం కాగా ఇప్పటివరకు 620కి పైగా స్లాట్లు మాత్రమే బుక్‌ అయ్యా యి. ప్రస్తుతం స్లాట్‌ బుకింగ్‌కు 7 రకాల సేవలు (అమ్మకం, మార్ట్‌గేజ్‌ విత్‌ పొజిషన్‌, మార్ట్‌గేజ్‌ వితౌట్‌ పొజిషన్‌, డిపాజిట్‌ ఆఫ్‌ టైటిల్‌ డీడ్‌, గిఫ్ట్‌, డెవల్‌పమెంట్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌, సివిల్‌ అగ్రిమెంట్‌ వితౌట్‌ పొజిషన్‌) అందుబాటులో ఉన్నాయి. స్లాట్‌ బుకింగ్‌కు ఆస్తి పన్ను నంబరు (పీటీఐఎన్‌)ను తప్పనిసరి చేశారు. రిజిస్ట్రేషన్‌ చేసుకునే రోజు నిర్దేశిత సమయానికి కొనుగోలు, అమ్మకందారులు సాక్షులతో కలిసి (తమ వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలు తీసుకొని) సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు హాజరు కావాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ చేసిన అనంతరం ఈ- పాస్‌బుక్‌ జారీ అవుతుంది. సాధారణ పాస్‌ బుక్‌ వారం, పది రోజుల్లో ఇస్తారు. అయితే స్లాట్‌ బుకింగ్‌లకు తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.

 

స్లాట్‌ బుకింగ్‌కు సమస్యలెన్నో..

మణికొండకు చెందిన వెంకటేశ్వర్లు విశ్రాంత ఉద్యోగి. పిల్లలంతా లండన్‌లో స్థిరపడడంతో ఆయనా అక్కడే ఉంటున్నారు. మణికొండలో ఉన్న తన ఫ్లాట్‌ను విక్రయించడానికి ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఫ్లాట్‌ను కొనేందుకు ఓ పార్టీ వచ్చారు. తన బంధువును పవర్‌ ఆఫ్‌ అటార్నీగా చేసి ఫ్లాట్‌ను విక్రయించాలని నిర్ణయించారు. శని, ఆదివారాల్లో పవర్‌ ఆఫ్‌ అటార్నీ అప్షన్‌ కోసం తెలంగాణ రిజిస్ట్రేషన్‌ వెబ్‌సైట్‌లో వెతకగా ఎక్కడా లేదు. తన ఫ్లాట్‌ను విక్రయించాలంటే వెంకటేశ్వర్లు తప్పనిసరిగా రిజిస్ట్రార్‌ కార్యాలయానికి రావాల్సిన పరిస్థితి.

 

అంబర్‌పేట డీడీకాలనీలో ఉండే లింగారెడ్డికి విద్యానగర్‌లో ఓ ఇల్లు ఉంది. వారసత్వంగా వచ్చిన ఆ ఇల్లు లింగారెడ్డి, ఆయన సోదరుడి పేరుతో ఉమ్మడి ఆస్తిగా ఉంది. ఇటీవల ఆ ఇంటిని విక్రయించాలని అన్నదమ్ములు భావించారు. రూ.80 లక్షలకు ఓ పార్టీతో బేరం కుదుర్చుకున్నారు. తాజాగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో స్లాట్‌ బుక్‌ చేసుకోవడానికి వెళ్లారు. కానీ, వెబ్‌సైట్‌లో ఎక్కడా ఉమ్మడి ఆస్తి విక్రయానికి ఆప్షన్‌ లేదు. దీంతో ఉసూరుమంటూ వెనుదిరిగారు.

 

వెంకటేశ్వర్లు, లింగారెడ్డే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు హామీ ఇచ్చింది. కానీ, ప్రస్తుత రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి భిన్నంగా ఉంది. వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు తీసుకొచ్చిన ధరణి విధానంలో మాదిరిగానే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కూడా ఉంది. ఇది కార్డ్‌ పద్ధతిలో స్లాట్‌ బుకింగ్‌కు పూర్తి భిన్నంగా ఉంది. స్లాట్‌ బుకింగ్‌ క్రమంలో మొరాయిస్తున్న సర్వర్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 

కొత్త విధానం.. కొంగొత్త సమస్యలు..!

కొత్త రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు ఎలాంటి స్టాంపులు అవసరం లేదు. పూర్తిగా ఆన్‌లైన్‌లోనే ఆస్తుల వివరాలను నమోదు చేసి, సంబంధిత డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఆస్తుల వివరాలను నమోదు చేయడానికి తొలుత వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి. ఫోన్‌ నంబర్‌తో పాస్‌వర్డ్‌ రాగా, దాంతో లాగిన్‌ కావాల్సి ఉంటుంది. ఆధార్‌ కార్డుతో దరఖాస్తు, ఆధార్‌ లేకుండా దరఖాస్తు చేసుకునే విధానాలుంటాయి. ఆధార్‌ నంబర్‌ తప్పనిసరి కాదు. ఆస్తికి సంబంధించి సరిహద్దుల ఆప్షన్‌ పొందుపరిచారు.

 

కానీ, పొడవు, వెడల్పునకు సంబంధించిన వివరాలు లేవు. ఇంటికి గానీ, ఓపెన్‌ ప్లాట్‌కు గానీ, అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌కు గానీ పర్మిషన్‌ లేకున్నా, బీఆర్‌ఎస్‌ కాకున్నా స్లాట్‌ బుక్‌ అయ్యే పరిస్థితి లేదు. ఆయా వివరాలు లేని వారి పరిస్థితేంటి? అపార్ట్‌మెంట్లలో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ ఉంటేనే పీటీఐఎన్‌ నంబరు వస్తుంది. అలాంటప్పుడు కొత్త ఫ్లాట్ల రిజిస్ట్రేషన్‌ ఎలా? ఇలాంటి విషయాలపై స్పష్టత లేదు. స్లాట్‌ బుకింగ్‌లో ఉమ్మడి ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు ఆప్షన్‌ ఇవ్వలేదు. కేవలం వ్యక్తిగత ఆస్తులకే ఉన్నాయి. విదేశాల్లో ఉండేవారు, ఉన్నత కుటుంబాల వారికి రిజిస్ట్రేషన్ల సమయంలో ఉండే పవర్‌ ఆఫ్‌ అటార్నీ, స్పెషల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ ఆప్షన్లు కూడా లేవు. ఇక స్లాట్‌ బుకింగ్‌ సమయంలోనే సాక్షుల పేర్లు కూడా పొందుపర్చాలి. ఆ సాక్షులు రిజిస్ట్రేషన్‌ రోజున లేకపోతే ప్రక్రియ మొత్తం నిలిచిపోనుంది. అలాగే సేల్‌ డీడ్‌ను రద్దు చేసుకోవడానికి గానీ, మార్పులుచేర్పులకు గానీ అవకాశం లేదు. సంబంధిత ఆస్తి యజమాని మరణిస్తే వారసుల పేర్లు రాసుకోవడానికి అవకాశం లేదు. ఎస్‌పీఏ, జీపీఏ, మార్ట్‌గేజ్‌, గిఫ్ట్‌డీడ్‌లకు స్లాట్‌ బుకింగ్‌లు లేవు. 2 లక్షలకు పైగా విలువగల ఆస్తులకు చెక్‌ రూపంలో ఇస్తేనే ఐటీలో చూపించుకుంటారు. కానీ, చెక్‌, డీడీ రూపంలో చెల్లించడానికి ఆప్షన్‌ ఇవ్వలేదు.

 

రోజుకు 24 రిజిస్ట్రేషన్లే..

రాష్ట్రవ్యాప్తంగా 142 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉండగా ఒక్కో ఆఫీసులో కొత్త విధానంలో రోజుకు 24 రిజిస్ట్రేషన్లే జరుగుతాయి. పాత విధానంలో ఒక్కో ఆఫీసులో రోజుకు 100-150 వరకు రిజిస్ట్రేషన్లు జరిగేవి. ప్రస్తుతం ప్రతి 15 నిమిషాలకు ఒక్క రిజిస్ట్రేషనే జరిగేలా నిర్ణయించారు. 3 నెలలుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 లక్షలకు పైగా ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఆగినట్లు సమాచారం. రోజుకు 24 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో 3408 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరుగుతాయి. అంటే నెలకు 81,792 జరుగుతాయి. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న 6 లక్షల ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సుమారు 8 నెలలు పడితే.. ఇక రోజువారీ వచ్చే వాటి సంగతి ఏంటన్నది ప్రశ్నార్థకమే. మొత్తంమీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానం ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. స్లాట్‌ బుక్‌ చేసుకోవడానికే ఈ స్థాయిలో గందరగోళం నెలకొంటే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఇంకెంత అయోమయంగా సాగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. ఇక కొత్త విధానంపై సబ్‌ రిజిస్ట్రార్లు కూడా పెదవి విరుస్తున్నారు. డాక్యుమెంటేషన్‌ లేకుండా ఆన్‌లైన్‌లోనే జరిగే ఈ విధానం ఎంత మేరకు భధ్రంగా ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

నేడు సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల ఎదుట ధర్నా

పాత విధానంలోనే రిజిస్ట్రేషన్లు చేస్తామని హైకోర్టుకు హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది. కొత్త పద్ధతిలో రిజిస్ట్రేషన్‌ వల్ల ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ఈ విధానంలో అనేక సమస్యలున్నాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల ఎదుట ధర్నాలు చేయాలని నిర్ణయించాం. 

 నారగోని ప్రవీణ్‌కుమార్‌, అధ్యక్షుడు, రియల్‌ ఎస్టేట్‌ అసోసియేషన్‌

 

తెల్ల కాగితాలపై రిజిస్ట్రేషన్లా?

కొత్త రిజిస్ట్రేషన్‌ విధానం గందరగోళంగా ఉంది. అమ్మకందారులు, కొనుగోలుదారుల నిర్ణయం ప్రకారం రిజిస్ట్రేషన్‌ జరిగే అవకాశం లేదు. ఇప్పటి వరకు కొనుగోలుదారుడికి, అమ్మకందారుడికి న్యాయం జరిగేలా డాక్యుమెంటేషన్‌ ఉండేది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో తెల్ల కాగితాలపై ఎలా చేస్తారు? డాక్యుమెంట్‌ రైటర్ల పొట్ట కొట్టే విధంగా ప్రభుత్వ విధానాలున్నాయి.

శ్రీనివాస్‌, డాక్యుమెంట్‌ రైటర్‌, నారపల్లి

Posted

If this continues entire system messed up avsaraniki plot konni ammali ante intha ibbandhi pedthe etla

Posted
4 minutes ago, csrcsr said:

@Pappu_Packitmaar i think this is messed up totally you cannot do GPA anta 

arey neeku weekend pellam pillalu dostallu lera uncle @lovedllaa threads

Posted
Just now, Rebel_Uncle_Fans said:

arey neeku weekend pellam pillalu dostallu lera uncle @lovedllaa threads

Nenu emi esanu Uncle ,cousin sister pelli ki dabbulu kavali we bought a plot pottula ammudam ante saava godthunaru , ovariki aina knowledge unte help chestaru ani adugutuna , niku emina kastam unte raaku raade

Posted
Just now, csrcsr said:

Nenu emi esanu Uncle ,cousin sister pelli ki dabbulu kavali we bought a plot pottula ammudam ante saava godthunaru , ovariki aina knowledge unte help chestaru ani adugutuna , niku emina kastam unte raaku raade

cousin sister pelli jargalli malli malli

Posted
1 minute ago, Rebel_Uncle_Fans said:

cousin sister pelli jargalli malli malli

Munda mopi ** pakaku 10engeyi

Posted
Just now, csrcsr said:

Munda mopi ** pakaku 10engeyi

Nee pellam, sisters  ni munda mopi antunava bagundhi vayya nee samasakaram

Posted
31 minutes ago, csrcsr said:

Dora or ktr involve ayyi set cheyakapothe its a big mess , 

Basic ga any NRI cannot buy or sell now too much @snoww @Pappu_Packitmaar please throw some light

Why can't NRIs sell or buy too much ?

Posted
Just now, snoww said:

Why can't NRIs sell or buy too much ?

Got it. No power of attorney aa. 

Lite. India ellinappudu register sesukuntaaru even if this is permanent. Konatam matram aape muchate ledu. Where else antha returns vasthayee. 

  • Thanks 1
Posted
36 minutes ago, csrcsr said:

@Pappu_Packitmaar i think this is messed up totally you cannot do GPA anta 

Sankranthi tarvate edaina set ayetattu vundi...

ipudi registrations open chesina, limited options now. Old method lo registrations chestham annaru, kani ‘CARD’ kakunda Dharani model la paper work anta...GPA’s ki cheyatledu ante Ade reason ayi vundali... 

Avasaram vunna, emergency vunna, better to have a back up plan now...inkoka 1-2 months uncertainity and backlog.

  • Thanks 1
Posted
22 minutes ago, snoww said:

Got it. No power of attorney aa. 

Lite. India ellinappudu register sesukuntaaru even if this is permanent. Konatam matram aape muchate ledu. Where else antha returns vasthayee. 

Y ? Dhani valla probs  enti ani aapestunaru ?

Posted
22 minutes ago, snoww said:

Got it. No power of attorney aa. 

Lite. India ellinappudu register sesukuntaaru even if this is permanent. Konatam matram aape muchate ledu. Where else antha returns vasthayee. 

Kastam bro etla registrations avutayi?? For example apartment loan tho konam.anuko bank will not give the proceeds to seller until you close it down suddam 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...