Kool_SRG Posted December 24, 2020 Report Posted December 24, 2020 మధురామృతానికి మారు పేరు మహ్మద్ రఫీ గానం... యావద్భారతాన్నీ రఫీ పాట పరవశింప చేసింది... ఇంకా ఆనందసాగరంలో మునకలు వేయిస్తూనే ఉంది... డిసెంబర్ 24న మహ్మద్ రఫీ జయంతి... ఈ సందర్భంగా రఫీ పాటతో కాసేపు పయనిద్దాం... రఫీ గానం నిజంగానే వేణు గానమై పిలుస్తుంది... రఫీ గళంతో ఒక్కసారి పరిచయమయితే చాలు మళ్ళీ ఆ మధురామృతమే కావాలనిపిస్తుంది... ఈ నాటికీ ఎంతోమంది సంగీతాభిమానులకు రఫీ పాటనే మేలుకొలుపు అవుతోందంటే అతిశయోక్తి కాదు.. మహ్మద్ రఫీ గాత్రంలో అంతటి మధురామృతం దాగి ఉందని లోకానికి తెలిపిన ఘనత నిస్సందేహంగా సంగీత దర్శకులు నౌషాద్ కే దక్కుతుంది.. నౌషాద్ సంగీతసరళిని నౌషదీయంగా భావించేవారు భారతదేశంలోని ఎంతోమంది సంగీత దర్శకులు. ఆ నౌషాదానికి రఫీ గళంతోడయి, పరమౌషధాన్ని మించిన అమృతాన్ని అందించింది. నౌషాద్ సంగీతం, రఫీ గానం కలసి అనేక చిత్రాలలో జనానికి ఆనందం పంచాయి. వాటిలో 'బైజూ బావ్రా' ఈ నాటికీ అగ్రస్థానంలోనే నిలచి ఉండడం విశేషం... అనేక ప్రేమకథా చిత్రాలలో మహ్మద్ రఫీ గళం ప్రేమగీతాలలో పలు విన్యాసాలు చేసింది. అందుకే ప్రేమికులెందరికో రఫీ పాటంటే ప్రాణంగా మారింది. ఇక విషాదాంత ప్రేమకథా చిత్రాలలోనూ మేటిగా నిలచిన చారిత్రక మధురస్వప్నం 'ముఘల్-ఏ-ఆజమ్'లో రఫీ గళం 'ప్రేమకు జిందాబాద్' అని ఎలుగెత్తి చాటింది. ఆ అమృతగుళికను మరచిపోగలవారెవరు? తెలుగులో సంస్కృత సమాసాలు చోటు చేసుకొని ఏ రీతిన శ్రోతలకు ఆనందం కలిగిస్తాయో, అదే తీరున హిందీ, ఉర్దూ భాషలు మిళితమై మధురామృతాన్ని మనకు సొంతం చేస్తాయి. కైఫీ ఆజ్మీ రచనల్లోని ఆ ద్విభాషా మేళవింపుతో రూపొందిన గీతాల్లోనూ రఫీ గాత్రం మంత్రం వేసి జనాలను ముగ్ధులను చేసింది. ఆ మంత్రంలోని మహత్తు ఏ పాటిదో మదన్ మోహన్ స్వరకల్పనలో సాగిన 'జఖ్మ్'లోని ఈ పాటనే చెబుతుంది. పున్నమినాటి వెన్నెల విహారం విరాగులను సైతం సరాగులుగా మారుస్తుందని ప్రతీతి. ఆయుర్వేద ఔషధాలకు పౌర్ణమి రోజున మరింత సత్తువ చేకూరుతుందనీ శాస్త్రం చెబుతోంది. పున్నమి వెన్నెల విహారానందాన్ని తన పాటతో మన సొంతం చేశారు మహ్మద్ రఫీ. ఇక ఆ పాట వింటే ఏ ఔషధాలతోనూ పనిలేకుండానే పడచుదనం పరుగులు తీయవలసిందే. రఫీ పాటతోనే ఆ నాటి మేటి నటులందరూ రాజులుగా మారి సినీసామ్రాజ్యాన్ని ఏలారు... కేవలం మహ్మద్ రఫీ మధురగానంతోనే పలు చిత్రాలు విజయయాత్ర చేయడం విశేషం... అప్పట్లో దిలీప్ కుమార్ ట్రాజెడీ కింగ్ ఇమేజ్ తో జైత్రయాత్ర చేశారు... రాజ్ కపూర్ రొమాంటిక్ హీరోగా రాజ్యమేలారు... ఇక దేవానంద్ స్టైల్స్ తో వినోదం పంచారు... ఈ ముగ్గురినీ ఆ నాటి హిందీ సినిమాకు త్రిమూర్తులుగా భావించేవారు... వీరి విజయయాత్రలోనూ మహ్మద్ రఫీ మధురామృతానికి వాటా ఉందంటే అతిశయోక్తి కాదు. రాజ్ కపూర్ అనగానే ఆయనకు ఎన్నో సినిమాల్లో అద్భుతమైన గీతాలు ఆలపించిన ముకేశ్ గుర్తుకు వస్తారు. అలాంటి రాజ్ కపూర్ సైతం తన చిత్రాల్లో కీలకమైన పాటలను రఫీతోనే పాడించారు. ఆయన హీరోగా నటించిన ఇతర దర్శకుల చిత్రాల్లోనూ ముఖ్యమైన గీతాలను మహ్మద్ రఫీనే ఆలపించడం విశేషం. రాజ్ కపూర్ ఇద్దరు తమ్ముళ్లు షమ్మీ కపూర్, శశి కపూర్ కూడా స్టార్స్ గా రాజ్యమేలారు... వారిద్దరికీ రఫీ గాత్రమే ప్రాణం పోసింది. షమ్మీ కపూర్ అనేక సూపర్ హిట్ మూవీస్ కు రఫీ పాటనే ప్రాణం పోయగా, ఆయన తమ్ముడు శశి కపూర్ ను స్టార్ గా చేసింది కూడా రఫీ గాత్రమే ... అలా కపూర్ ముగ్గురు సోదరులకూ రఫీ పాట పరమానందం పంచింది. ట్రాజెడీ కింగ్ దిలీప్ కుమార్ కు అనేక చిత్రాల్లో నవరసాలు ఒలికించే పాటలు పాడారు రఫీ... దిలీప్ అభినయానికి తగ్గ రీతిలో రఫీ గానం సాగింది... ఆ రీతిన అభిమానులను ఎన్నో చిత్రాలు అలరించాయి. రఫీ పాటకు తెలుగు సినిమాకు కూడా అనుబంధం ఉంది... తెలుగులోనూ మహ్మద్ రఫీ పంచిన మధురామృతం ఈ నాటికీ ఆనందం పంచుతూనే ఉండడం విశేషం... తెలుగువారికి మహ్మద్ రఫీ పేరు వినిపించగానే చప్పున నటరత్న యన్టీఆర్ కు ఆయన పాడిన సినిమాలు గుర్తుకు వస్తాయి. అయితే తెలుగులో మహ్మద్ రఫీతో తొలిసారి పాటలు పాడించినది నటనిర్మాత జగ్గయ్య. ఆయన సమర్పణలో తెరకెక్కిన 'పదండి ముందుకు' చిత్రంలో రఫీతో "మంచికి కాలం తీరిందా..." అనే పాటను పాడించారు. ఆ తరువాత చిత్తూరు నాగయ్య తన 'భక్త రామదాసు'లో కబీర్ పాత్ర ధారి అయిన గుమ్మడికి రఫీతోనే హిందీ పాట పాడించడం విశేషం. ఈ సినిమాల తరువాత యన్టీఆర్ 'భలే తమ్ముడు'లో రఫీ తెలుగు పాటలు పాడి జనాన్ని పరవశింప చేశారు. హిందీ 'చీనా టౌన్' ఆధారంగానే 'భలే తమ్ముడు' రూపొందింది. అక్కడ కూడా రఫీ పాటలే చిత్రానికి ప్రాణం పోశాయి. దాంతో తెలుగులోనూ రఫీతోనే పాడించారు నిర్మాత పుండరీకాక్షయ్య. 'భలే తమ్ముడు'తోనే తెలుగునాట రఫీ పాట పరవళ్ళు తొక్కిందని చెప్పాలి. యన్టీఆర్ తన సొంత చిత్రం 'తల్లా పెళ్ళామా'లో ఓ స్పెషల్ సాంగ్ ను మహ్మద్ రఫీతోనే పాడించారు. ఆ పాట ఆ రోజుల్లో భలేగా సందడి చేసింది... యన్టీఆర్ హీరోగా పుండరీకాక్షయ్య నే ' హిందీ సినిమా 'గీత్ ఆధారంగా తెలుగులో 'ఆరాధన' నిర్మించారు. రఫీ పాటలతోనే 'గీత్' జైత్రయాత్ర చేసింది. దాంతో తెలుగులోనూ ఆయన గాత్రాన్నే ఉపయోగించుకున్నారు నిర్మాత. 'ఆరాధన' చిత్రం తెలుగులోనూ బ్లాక్ బస్టర్ గా నిలచింది. ఆ సినిమా పాటలు ఆ రోజుల్లో తెలుగునేలను పరవశింప చేశాయి. యన్టీఆర్ తనయులు హరికృష్ణ, బాలకృష్ణ హీరోలుగా రూపొందిన 'రామ్-రహీమ్'లో హరికృష్ణకు నేపథ్యగానం చేశారు రఫీ. ఆ పై యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'అక్బర్ సలీమ్ అనార్కలి'లో బాలకృష్ణ నటనకు రఫీ పాట దన్నుగా నిలచింది. నవతరం నాయకులకు సైతం పాటలు పాడి అలరించిన మహ్మద్ రఫీ తెలుగులో యన్టీఆర్ తో అనుబంధం ఉన్న చిత్రాలకే పాటలు పాడడం విశేషం. ఆయన చివరగా తెలుగులో పాడిన చిత్రం 'శ్రీతిరుపతి వేంకటేశ్వర కళ్యాణం'. అందులో సత్యనారాయణ పాత్రకు గానం చేశారు. తెలుగువారినీ మహ్మద్ రఫీ గానం ఇప్పటికీ అలరిస్తూనే ఉండడం విశేషం. మహ్మద్ రఫీ పాటను మరచిపోగలవారెవరు? రఫీ గళం వినిపిస్తున్నన్ని రోజులు ఆయన పాటకు పట్టాభిషేకం జరుగుతూనే ఉంటుంది... అదీ - రఫీ గాత్రంలోని మహత్తు... ఆ మాధుర్యం తెలిసిన వారికి నిత్యానందం పంచుతూనే ఉంటుంది రఫీ పాట... (ఎండ్) మధురామృతానికి మారు పేరు మహ్మద్ రఫీ గానం... యావద్భారతాన్నీ రఫీ పాట పరవశింప చేసింది... ఇంకా ఆనందసాగరంలో మునకలు వేయిస్తూనే ఉంది... డిసెంబర్ 24న మహ్మద్ రఫీ జయంతి... ఈ సందర్భంగా రఫీ పాటతో కాసేపు పయనిద్దాం... రఫీ గానం నిజంగానే వేణు గానమై పిలుస్తుంది... రఫీ గళంతో ఒక్కసారి పరిచయమయితే చాలు మళ్ళీ ఆ మధురామృతమే కావాలనిపిస్తుంది... ఈ నాటికీ ఎంతోమంది సంగీతాభిమానులకు రఫీ పాటనే మేలుకొలుపు అవుతోందంటే అతిశయోక్తి కాదు... మహ్మద్ రఫీ గాత్రంలో అంతటి మధురామృతం దాగి ఉందని లోకానికి తెలిపిన ఘనత నిస్సందేహంగా సంగీత దర్శకులు నౌషాద్ కే దక్కుతుంది.. నౌషాద్ సంగీతసరళిని నౌషదీయంగా భావించేవారు భారతదేశంలోని ఎంతోమంది సంగీత దర్శకులు. ఆ నౌషాదానికి రఫీ గళంతోడయి, పరమౌషధాన్ని మించిన అమృతాన్ని అందించింది. నౌషాద్ సంగీతం, రఫీ గానం కలసి అనేక చిత్రాలలో జనానికి ఆనందం పంచాయి. వాటిలో 'బైజూ బావ్రా' ఈ నాటికీ అగ్రస్థానంలోనే నిలచి ఉండడం విశేషం... అనేక ప్రేమకథా చిత్రాలలో మహ్మద్ రఫీ గళం ప్రేమగీతాలలో పలు విన్యాసాలు చేసింది. అందుకే ప్రేమికులెందరికో రఫీ పాటంటే ప్రాణంగా మారింది. ఇక విషాదాంత ప్రేమకథా చిత్రాలలోనూ మేటిగా నిలచిన చారిత్రక మధురస్వప్నం 'ముఘల్-ఏ-ఆజమ్'లో రఫీ గళం 'ప్రేమకు జిందాబాద్' అని ఎలుగెత్తి చాటింది. ఆ అమృతగుళికను మరచిపోగలవారెవరు? తెలుగులో సంస్కృత సమాసాలు చోటు చేసుకొని ఏ రీతిన శ్రోతలకు ఆనందం కలిగిస్తాయో, అదే తీరున హిందీ, ఉర్దూ భాషలు మిళితమై మధురామృతాన్ని మనకు సొంతం చేస్తాయి. కైఫీ ఆజ్మీ రచనల్లోని ఆ ద్విభాషా మేళవింపుతో రూపొందిన గీతాల్లోనూ రఫీ గాత్రం మంత్రం వేసి జనాలను ముగ్ధులను చేసింది. ఆ మంత్రంలోని మహత్తు ఏ పాటిదో మదన్ మోహన్ స్వరకల్పనలో సాగిన 'జఖ్మ్'లోని ఈ పాటనే చెబుతుంది. పున్నమినాటి వెన్నెల విహారం విరాగులను సైతం సరాగులుగా మారుస్తుందని ప్రతీతి. ఆయుర్వేద ఔషధాలకు పౌర్ణమి రోజున మరింత సత్తువ చేకూరుతుందనీ శాస్త్రం చెబుతోంది. పున్నమి వెన్నెల విహారానందాన్ని తన పాటతో మన సొంతం చేశారు మహ్మద్ రఫీ. ఇక ఆ పాట వింటే ఏ ఔషధాలతోనూ పనిలేకుండానే పడచుదనం పరుగులు తీయవలసిందే. రఫీ పాటతోనే ఆ నాటి మేటి నటులందరూ రాజులుగా మారి సినీసామ్రాజ్యాన్ని ఏలారు... కేవలం మహ్మద్ రఫీ మధురగానంతోనే పలు చిత్రాలు విజయయాత్ర చేయడం విశేషం... అప్పట్లో దిలీప్ కుమార్ ట్రాజెడీ కింగ్ ఇమేజ్ తో జైత్రయాత్ర చేశారు... రాజ్ కపూర్ రొమాంటిక్ హీరోగా రాజ్యమేలారు... ఇక దేవానంద్ స్టైల్స్ తో వినోదం పంచారు... ఈ ముగ్గురినీ ఆ నాటి హిందీ సినిమాకు త్రిమూర్తులుగా భావించేవారు... వీరి విజయయాత్రలోనూ మహ్మద్ రఫీ మధురామృతానికి వాటా ఉందంటే అతిశయోక్తి కాదు. రాజ్ కపూర్ అనగానే ఆయనకు ఎన్నో సినిమాల్లో అద్భుతమైన గీతాలు ఆలపించిన ముకేశ్ గుర్తుకు వస్తారు. అలాంటి రాజ్ కపూర్ సైతం తన చిత్రాల్లో కీలకమైన పాటలను రఫీతోనే పాడించారు. ఆయన హీరోగా నటించిన ఇతర దర్శకుల చిత్రాల్లోనూ ముఖ్యమైన గీతాలను మహ్మద్ రఫీనే ఆలపించడం విశేషం. రాజ్ కపూర్ ఇద్దరు తమ్ముళ్లు షమ్మీ కపూర్, శశి కపూర్ కూడా స్టార్స్ గా రాజ్యమేలారు... వారిద్దరికీ రఫీ గాత్రమే ప్రాణం పోసింది. షమ్మీ కపూర్ అనేక సూపర్ హిట్ మూవీస్ కు రఫీ పాటనే ప్రాణం పోయగా, ఆయన తమ్ముడు శశి కపూర్ ను స్టార్ గా చేసింది కూడా రఫీ గాత్రమే ... అలా కపూర్ ముగ్గురు సోదరులకూ రఫీ పాట పరమానందం పంచింది. ట్రాజెడీ కింగ్ దిలీప్ కుమార్ కు అనేక చిత్రాల్లో నవరసాలు ఒలికించే పాటలు పాడారు రఫీ... దిలీప్ అభినయానికి తగ్గ రీతిలో రఫీ గానం సాగింది... ఆ రీతిన అభిమానులను ఎన్నో చిత్రాలు అలరించాయి. ... రఫీ పాటకు తెలుగు సినిమాకు కూడా అనుబంధం ఉంది... తెలుగులోనూ మహ్మద్ రఫీ పంచిన మధురామృతం ఈ నాటికీ ఆనందం పంచుతూనే ఉండడం విశేషం... తెలుగువారికి మహ్మద్ రఫీ పేరు వినిపించగానే చప్పున నటరత్న యన్టీఆర్ కు ఆయన పాడిన సినిమాలు గుర్తుకు వస్తాయి. అయితే తెలుగులో మహ్మద్ రఫీతో తొలిసారి పాటలు పాడించినది నటనిర్మాత జగ్గయ్య. ఆయన సమర్పణలో తెరకెక్కిన 'పదండి ముందుకు' చిత్రంలో రఫీతో "మంచికి కాలం తీరిందా..." అనే పాటను పాడించారు. ఆ తరువాత చిత్తూరు నాగయ్య తన 'భక్త రామదాసు'లో కబీర్ పాత్ర ధారి అయిన గుమ్మడికి రఫీతోనే హిందీ పాట పాడించడం విశేషం. ఈ సినిమాల తరువాత యన్టీఆర్ 'భలే తమ్ముడు'లో రఫీ తెలుగు పాటలు పాడి జనాన్ని పరవశింప చేశారు. హిందీ 'చీనా టౌన్' ఆధారంగానే 'భలే తమ్ముడు' రూపొందింది. అక్కడ కూడా రఫీ పాటలే చిత్రానికి ప్రాణం పోశాయి. దాంతో తెలుగులోనూ రఫీతోనే పాడించారు నిర్మాత పుండరీకాక్షయ్య. 'భలే తమ్ముడు'తోనే తెలుగునాట రఫీ పాట పరవళ్ళు తొక్కిందని చెప్పాలి. యన్టీఆర్ తన సొంత చిత్రం 'తల్లా పెళ్ళామా'లో ఓ స్పెషల్ సాంగ్ ను మహ్మద్ రఫీతోనే పాడించారు. ఆ పాట ఆ రోజుల్లో భలేగా సందడి చేసింది... యన్టీఆర్ హీరోగా పుండరీకాక్షయ్య నే ' హిందీ సినిమా 'గీత్ ఆధారంగా తెలుగులో 'ఆరాధన' నిర్మించారు. రఫీ పాటలతోనే 'గీత్' జైత్రయాత్ర చేసింది. దాంతో తెలుగులోనూ ఆయన గాత్రాన్నే ఉపయోగించుకున్నారు నిర్మాత. 'ఆరాధన' చిత్రం తెలుగులోనూ బ్లాక్ బస్టర్ గా నిలచింది. ఆ సినిమా పాటలు ఆ రోజుల్లో తెలుగునేలను పరవశింప చేశాయి. యన్టీఆర్ తనయులు హరికృష్ణ, బాలకృష్ణ హీరోలుగా రూపొందిన 'రామ్-రహీమ్'లో హరికృష్ణకు నేపథ్యగానం చేశారు రఫీ. ఆ పై యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'అక్బర్ సలీమ్ అనార్కలి'లో బాలకృష్ణ నటనకు రఫీ పాట దన్నుగా నిలచింది. నవతరం నాయకులకు సైతం పాటలు పాడి అలరించిన మహ్మద్ రఫీ తెలుగులో యన్టీఆర్ తో అనుబంధం ఉన్న చిత్రాలకే పాటలు పాడడం విశేషం. ఆయన చివరగా తెలుగులో పాడిన చిత్రం 'శ్రీతిరుపతి వేంకటేశ్వర కళ్యాణం'. అందులో సత్యనారాయణ పాత్రకు గానం చేశారు. తెలుగువారినీ మహ్మద్ రఫీ గానం ఇప్పటికీ అలరిస్తూనే ఉండడం విశేషం. మహ్మద్ రఫీ పాటను మరచిపోగలవారెవరు? రఫీ గళం వినిపిస్తున్నన్ని రోజులు ఆయన పాటకు పట్టాభిషేకం జరుగుతూనే ఉంటుంది... అదీ - రఫీ గాత్రంలోని మహత్తు... ఆ మాధుర్యం తెలిసిన వారికి నిత్యానందం పంచుతూనే ఉంటుంది రఫీ పాట... Quote
Kool_SRG Posted December 24, 2020 Author Report Posted December 24, 2020 Mohammed Rafi Birth Anniversary: Lesser known facts about the legendary singer By Rajeshwari Venkitasubramanian December 24, is the 96th Birth Anniversary of the great singer Mohammed Rafi, who was one of the best singers Bollywood will ever have. One resonant voice that changed the direction of romantic melodies in Indian movies must be Mohammed Rafi—who, with his soulful music, gave Indian movies an exemplar. December 24 marks the 96th anniversary of the birth of iconic singer Mohammed Rafi, one of Bollywood's greatest singers ever to be. Rafi, who had captured millions of hearts with a soulful voice, dominated all genres of music, including Qawwali, romantic, and devotional. Singers come and go, but geniuses like the Bollywood playback singer Mohammed Rafi live forever. Here as some facts that the audience doesn't know about him. Mohammed Rafi was the second oldest of his six siblings. Rafi’s nickname was Pheeko. In 1941 All India Radio, Lahore service, invited Rafi to sing for them. In 1941, he made his debut in Lahore as a playback singer in the duet 'Soniye Nee, Heeriye Nee' with Zeenat Begum in the Punjabi film 'Gul Baloch' (released in 1944) . He made his Hindi debut with the song 'Aji dil ho kaabu mein to dildar ki Aisi taisi' for the film Gaon Ki Gori in 1945. In 1944, Rafi moved to Mumbai and lived with Hameed Sahab in a rented ten-by-ten-feet room in the crowded Bhendi Bazar district. In 1945, the song "Tera Jalwa Jis Ne Dekha" appeared on the screen in Laila Majnu. He stared at K. L. Saigal was his idol and was also inspired by G. M. Durrani, sir. In the early stages of his career, he mostly adopted their style of singing. In 1948, after the assassination of Mahatma Gandhi, the team of Husanlal Bhagatram-Rajendra Krishan and Rafi produced the song "Suno Suno Ae Duniyawalon, Bapuji Ki Amar Kahani" overnight. Jawaharlal Nehru was then invited to sing at his home. He collaborated with a number of eminent music composers such as Naushad, S.D. Burman, Shankar-Jaikishan, O.P. Nayyar, Ravi, Laxmikant-Pyarelal and many others. Rafi's last track for composer Laxmikant-Pyarelal was "Shaam Phir Kyun Udaas Hai Dost, Tu Kahin Aas Paas Hai Dost" captured just hours before his death. The most famous playback singer was elected by the Outlook Music Poll with Lata Mangeshkar in June 2010, led parallel to the magazine Outlook. The same poll voted for "man re, tu kahe na dhare" and for "Tere mere sapne ab ek rang Hain" (Guide, 1964) and "Din Dhal jaye, hai raat na jaye" as Rafi's Number one and second songs. The second song was sung by Rafi (Guide, 1965). The official biography of Shahid Rafi and Sujata Dev, which was released on its 91st birthday was tilted 'Mohammed Rafi: Gold Voice of the Silver screen.' The 'Padma Shri Mohammed Rafi Chowk' was named after him in the Bandra suburbs of Mumbai. Quote
shaw183 Posted December 25, 2020 Report Posted December 25, 2020 @Kool_SRG Rafi Saab...Mahanubhavudu🙏 my all time fav: ma dad tho sitting esthu vinedi e songs.. Missing my dad.. Quote
Tyler_durden Posted December 26, 2020 Report Posted December 26, 2020 7 hours ago, Spartan said: Good Singer. Bro, start a thread with mohd rafi songs no. Quote
Kool_SRG Posted December 27, 2020 Author Report Posted December 27, 2020 23 hours ago, Tyler_durden said: Bro, start a thread with mohd rafi songs no. Continue in this... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.