r2d2 Posted December 26, 2020 Report Posted December 26, 2020 దేశంలో ప్రజాస్వామ్యం లేదంటూ ఇటీవల వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై ప్రధాని మోదీ పరోక్షంగా నిప్పులు చెరిగారు. ‘‘కొందరు దిల్లీలో కూర్చుని నాపై నిందలు వేస్తున్నారు. ప్రజాస్వామ్యంపై నాకు పాఠాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వారికి అసలు నిజం ఏమిటో చెప్పదలచుకున్నా. నా బాధను ఈ దేశ ప్రజలతో పంచుకోదలచుకున్నా. ప్రజాస్వామ్యంపై పాఠాలు వల్లిస్తున్న వారే దాన్ని పాటించడం లేదు. పుదుచ్చేరిలో ఏం జరిగిందో మీరు కళ్లారా చూశారు’’ అంటూ పరోక్షంగా కాంగ్రెస్‌ను, రాహుల్‌గాంధీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పుదుచ్చేరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ.. ఆ అంశాన్ని పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటైన ఏడాదిలోపే జమ్మూ-కశ్మీర్లో స్థానిక ఎన్నికలు నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. కశ్మీర్ ప్రజల కోసం ‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం ప్రారంభించి మాట్లాడారు. దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న పార్టీలు.. కశ్మీర్ సహా సరిహద్దు ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేసి తప్పు చేశాయని విమర్శించారు. దానిని తమ ప్రభుత్వం సరిచేస్తుందన్నారు. జమ్మూ-కశ్మీర్లో జిల్లా అభివృద్ధి మండలి(డీడీసీ) ఎన్నికలు కొత్త అధ్యాయాన్ని లిఖించడమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశాయని మోదీ వ్యాఖ్యానించారు. పారదర్శకమైన ఎన్నికల ప్రక్రియ, ఓటర్లు ఉత్సాహంగా పాల్గొనటం భారత్‌కు గర్వకారణమని పేర్కొన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో అద్భుత పనితీరును కనబరిచారంటూ పాలనా యంత్రాంగం, భద్రతా సిబ్బందిని ప్రశంసించారు. డీడీసీ ఎన్నికల్లో అభ్యర్థులు ప్రజల్లోంచి వచ్చినవారేనని.. వారంతా వ్యక్తిగత పేరు ప్రతిష్ఠలతో కాకుండా తమ పనితీరుతో గెలిచారని పేర్కొన్నారు. కొత్త దశాబ్దంలో.. సరికొత్త శకంలో నూతన నాయకత్వానికి ఇది ప్రారంభమని మోదీ వ్యాఖ్యానించారు. జమ్మూ-కశ్మీర్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టిందన్నారు. పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలు మినహా అన్ని ప్రాంతాల్లో ప్రజలు ఆయుష్మాన్ భారత్ ద్వారా లబ్ధి పొందవచ్చని పేర్కొంటూ.. పథకంలో భాగం కాని తృణమూల్ సర్కారుకు చురకలు అంటించారు. చికిత్స కోసం కశ్మీర్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకే పరిమితం కాకుండా.. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఆసుపత్రులు ఈ పథకంలో భాగమైనట్లు వివరించారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా కశ్మీర్ ప్రజలకు రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. ఈ పథకం ద్వారా జమ్మూ-కశ్మీర్లో ఇప్పటికే 6 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతుండగా.. తాజా విస్తరణతో మరో 15 లక్షల కుటుంబాలకు ఆరోగ్య బీమా వర్తించనుంది. ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడి సంప్రదాయ దుస్తులపై ఆసక్తి చూపే మోదీ.. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా కశ్మీర్ సంప్రదాయ రీతిలో ఫెరాన్‌ను ధరించారు. గత ఏడాది ఓ వ్యవసాయ కూలీ ఆయనకు దానిని బహూకరించారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.