r2d2 Posted December 30, 2020 Report Posted December 30, 2020 రాష్ట్రంలో ఆస్తి, స్థిరాస్తిని అందించే మహాయజ్ఞం చేపట్టామని.. దీంతో రాష్ట్రంలో సంక్రాంతి పండుగ ముందే వచ్చిందని ఏపీ సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలోని అర్హులందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా సీఎం ఇవాళ విజయనగరం జిల్లా గుంకలాంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ సభలో ఆయన పాల్గొన్నారు. అంతకు ముందు 397.36 ఎకరాల్లోని లేఅవుట్ పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 400 ఎకరాల్లో 12,301 ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 28.30లక్షల ఇళ్లను నిర్మిస్తున్నామన్నారు. 43 లక్షల మంది మహిళలకు అమ్మఒడి ద్వారా ప్రయోజనం చేకూర్చినట్లు చెప్పారు. అరకోటి మందికి పైగా రైతులకు రైతు భరోసా అందించామన్నారు. 87 లక్షల మందికి పైగా మహిళలకు ఆసరా పథకం ద్వారా మేలు చేసినట్లు సీఎం వివరించారు. విద్యాకానుక, వసతి దీవెన కింద విద్యార్థులకు తోడుగా నిలిచామన్నారు. రైతన్నలకు తోడుగా ఉండేందుకు పెట్టుబడి రాయితీ అందిస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. కోటి 35 లక్షల కుటుంబాలకు వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మేలు చేస్తున్నామన్నారు. వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా లక్షా 30 వేల మందికి ఉద్యోగాలిచ్చామని వెల్లడించారు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్‌లు కనిపిస్తున్నాయన్నారు. రైతన్నలకు తోడుగా ఉండేందుకు పెట్టుబడి రాయితీ అందిస్తున్నామని సీఎం తెలిపారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలు దాదాపు 95 శాతం పూర్తి చేశామన్నారు. మేనిఫెస్టోలో 25 లక్షల ఇళ్లు ఇస్తామని చెప్పి.. వాటిని ఇవాళ 30 లక్షలకు పైగా పెంచినట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. Quote
tom bhayya Posted December 30, 2020 Report Posted December 30, 2020 next time kotha rathnaala aithey Quote
chandrabhai7 Posted December 30, 2020 Report Posted December 30, 2020 1 hour ago, Somedude said: Evrti Ee pilla batti kotti chestunde lol Quote
Somedude Posted December 30, 2020 Report Posted December 30, 2020 31 minutes ago, chandrabhai7 said: Evrti Ee pilla batti kotti chestunde lol Jagan mama song pillala ki poti Quote
chandrabhai7 Posted December 30, 2020 Report Posted December 30, 2020 42 minutes ago, Somedude said: Jagan mama song pillala ki poti @greed Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.