johnydanylee Posted December 31, 2020 Report Posted December 31, 2020 సీజేఐకి రాసిన లేఖతో జగన్‌కు అనుచిత లబ్ధి న్యాయమూర్తుల బదిలీలతో ఆయనపై కేసుల విచారణలో జాప్యం జరగొచ్చు హైకోర్టు తీర్పులో జస్టిస్ రాకేష్ కుమార్ వ్యాఖ్యలు ప్రభుత్వ ఆస్తుల వేలం కేసు విచారణ నుంచి తాను తప్పుకోవాలన్న పిటిషన్ కొట్టివేత ధనబలం, కండబలం ఉన్న వారు ఏం చేసినా చెల్లుతుందనే విపరీత ధోరణి వ్యవస్థలో ప్రబలింది. రాష్ట్రంలో ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటం చాలా కష్టంగా మారిందని చెప్పడానికి నేనేమీ సంశయించడం లేదు. రాజ్యాంగంలోని 21, 22 అధికరణలు పౌరులకు కల్పించిన హక్కులను రాష్ట్రంలో దారుణంగా ఉల్లంఘిస్తున్నారు. - జస్టిస్ రాకేష్ కుమార్ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మరికొందరు హైకోర్టు న్యాయమూర్తులపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం ద్వారా అనుచిత లబ్ధి పొందడంలో ముఖ్యమంత్రి జగన్ విజయవంతమయ్యారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేష్‌కుమార్ పేర్కొన్నారు. ‘ఆ లేఖ వల్ల ఏపీ సీఎం అంతిమంగా ఊరట పొందుతారో లేదో తెలీదు గానీ.. దాని వల్లే ఏపీ, తెలంగాణ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల బదిలీ జరిగిందని ప్రజలు భావించే అవకాశముంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. మిషన్ బిల్డ్ ఏపీ కింద ప్రభుత్వ ఆస్తుల విక్రయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన కేసు విచారణ నుంచి జస్టిస్ రాకేష్ కుమార్ వైదొలగాలంటూ.. ఆ సంస్థ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పులో ఆయన ఈ మేరకు పేర్కొన్నారు. హైకోర్టుపైనా, న్యాయమూర్తులపైనా సామాజిక మాధ్యమాల్లో అశ్లీల, అనుచిత వ్యాఖ్యలు ప్రచారం చేయడంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన నేపథ్యంలో.. సీఎం రాసిన లేఖను అక్టోబరు 10న సీఎం ముఖ్య సలహాదారు అజేయకల్లం మీడియాకి వెల్లడించారని, కొద్దిసేపట్లోనే ఆ సమాచారం దావానలంలా వ్యాపించిందని జస్టిస్ రాకేష్‌కుమార్ పేర్కొన్నారు. 3 రాజధానులపై విచారణ మొదటికొస్తుందేమో! తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని బదిలీ చేయడం వల్ల సీబీఐ ప్రత్యేక కోర్టులో జగన్‌పై కేసుల విచారణలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉందని, వాటిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణకూ అవరోధం ఏర్పడవచ్చని జస్టిస్ రాకేష్‌కుమార్ అభిప్రాయపడ్డారు. ‘ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీ వల్లా ముఖ్యమంత్రికి అనుచిత లబ్ధి చేకూరుతుంది. మూడు రాజధానులు ఆయన మానస పుత్రిక అని అందరికీ తెలిసిందే. రాజధాని నిర్మాణానికి పేద రైతులు భూములిస్తే... 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక దాన్ని నిలిపివేశారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై జస్టిస్ జె.కె.మహేశ్వరి నేతృత్వంలోని ఫుల్‌బెంచ్ నెల రోజులకు పైగా తుది విచారణ జరిపింది. సీఎం లేఖ తర్వాత జస్టిస్ మహేశ్వరిని బదిలీ చేయడంతో విచారణ నిలిచిపోయింది. కొత్త బెంచ్ వేయడానికి కొంత సమయం పడుతుంది. విచారణ మొదటి నుంచీ ప్రారంభించాల్సి రావచ్చు’ అని ఆయన పేర్కొన్నారు. కొలీజియం నిర్ణయంలో పారదర్శకత ఉండాలి ‘ఏపీ, తెలంగాణ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల బదిలీల్ని నేను ప్రశ్నించడం లేదు. కానీ అలాంటి నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కూడా సుప్రీంకోర్టు కొలీజియంలోని సభ్యుల మాదిరిగా రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారే’ అని రాకేష్‌కుమార్ పేర్కొన్నారు. మూడు రాజధానులకు అనుగుణంగా శాసనసభలో తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించనందుకు ఏకంగా శాసనమండలి రద్దుకే సిఫారసు చేసిన ఏకైక ప్రభుత్వం ఇదే కావచ్చని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయనందుకు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌నూ వాళ్లు విడిచి పెట్టలేదన్నారు. ఆ రెండు వ్యవస్థల్నీ దెబ్బతీయడంలో కొంత విజయం సాధించాక ఇప్పుడు హైకోర్టుపై పడ్డారని రాకేష్‌కుమార్ పేర్కొన్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.