r2d2 Posted January 7, 2021 Report Posted January 7, 2021 సాధరణంగా హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక పురుషుడు ఒక మహిళని మాత్రమే వివాహం చేసుకోవాలి. ఇద్దరిని పెళ్లి చేసుకోవడం చట్ట విరుద్ధం. అయితే ఏవో కారణాలతో విడాకులు తీసుకున్నవారు మాత్రం రెండో పెళ్లి చేసుకోవచ్చు. ఇక ఒకరు ఇద్దరిని ప్రేమించి ఎవరిని పెళ్లి చేసుకోవాలో తెలియక మూడో అమ్మాయిని కొందరు చేసుకుంటే మరికొందరు ఇద్దరిని పెళ్లి చేసుకొని ఇద్దరికి న్యాయం చేస్తుంటారు. అయితే ఇద్దరిని ఒకేసారి పెళ్లి చేసుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అలంటి సంఘటనే తాజాగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయ్ పూర్ లో చోటుచేసుకుంది. ఒకే సమయంలో ఒకే ముహూర్తానికి ఒక వరుడు ఇద్దరు వధువు మేడలో మూడు ముళ్లు వేశాడు. అసలు ఇద్దరిని పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి ఆ పెళ్లికి వారి పెద్దలు ఒప్పుకున్నారా ? లేక పెద్దలని ఎదిరించి పెళ్లి చేసుకున్నారా అనే విషయాలని తెలుసుకుందాం.. పూర్తి వివరాల్లోకి వెళ్తే .. ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయ్ పూర్ దగ్గర్లో బస్తర్ జిల్లాలోని జగదల్పూర్ సమీపంలో తిక్రాలొహంగా అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఈ మద్యే ఓ వివాహం జరిగింది. ఎక్కడైనా వివాహం సాధారణ విషయమే కదా అందులో వింతేముంది అనుకుంటున్నారా.. అయితే ఆ పెళ్లి అందరూ చేసుకునేలా జరిగిన పెళ్లి కాదు కొంచెం వింత పెళ్లి. ఒకే మండపంలో ఒక వరుడు ఇద్దరు వధువులని పెళ్లి చేసుకున్నాడు. ఒకే కళ్యాణ మండపంలో ఇద్దరు యువతులకు ఒకేసారి తాళి కట్టి వారితో ఏడడుగులు వేశారు. వరుడి పేరు చందు మౌర్య వధువులు హసీనా సుందరి . వీరిద్దరూ ఇంటర్ వరకు చదవివారు. వరుడికి గతంలో ఈ ఇద్దరు యువతులతో ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే పెళ్లి విషయం వచ్చే సరిగి వరుడికి ఎవరిని వదులుకోవాలో తేల్చుకోలేకపోయాడు. దీనిపై ఆ అమ్మాయిలతో వరుడు మాట్లాడగా వారిలో ఏ ఒక్కరూ కూడా అతన్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు సరికదా ఇద్దరిని పెళ్లి చేసుకున్నా కూడా తమకి ఏ అభ్యంతరం లేదు అంటూ చెప్పేశారు. దీనికి ఆ గ్రామ పెద్దలు కూడా ఒప్పుకున్నారు. దీంతో ఇరు కుటుంబాల పెద్దలతో మాట్లాడుకుని ఇద్దరి యువతుల్ని వివాహం చేసుకున్నారు. ఒకే వేదికపై ఒక యువకుడు ఇద్దరు యువతులతో వివాదం చేసుకోవటం ఛత్తీస్ ఘడ్ లో మొదటి ఘటనగా స్థానికులు చెబుతున్నారు. అయితే వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పెళ్లికి సంబంధించిన ఎలాంటి ఫిర్యాదు తమకు రాలేదని పోలీసులు తెలిపారు. అలాగే ఆ ఊరి పెద్దలు మాత్రం తమ గిరిజన సంప్రదాయంలో ఇద్దరిని పెళ్లాడటం తప్పేం కాదని.. అది కూడా తమ ఆచారంలో ఓ భాగంగా చెప్పటంతో ఎవరు ఏమనలేని పరిస్థితి. Quote
johnydanylee Posted January 7, 2021 Report Posted January 7, 2021 aithe memu aa ooru potham antunna DBians Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.