r2d2 Posted January 12, 2021 Report Posted January 12, 2021 ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని అటు క్లాస్ ఆడియన్స్‌ను అలరిస్తూనే ఇటు మాస్ అభిమానులనూ మెప్పిస్తున్నాడు. లవర్‌బాయ్‌గా పరిచయమైన రామ్.. సినిమా సినిమాకు కొత్తదనం చూపిస్తూ.. ‘ఇస్మార్ట్‌శంకర్’తో మాస్‌హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మరోసారి మాస్ అభిమానులను అలరించేందుకు కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్’తో సిద్ధమయ్యాడు. రామ్ ద్విపాత్రాభినయంతో డబుల్ దమాకా ఇవ్వనున్నాడు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నివేదాపేతురాజ్, మాళవికాశర్మ, అమృతాఅయ్యర్ అలరించనున్నారు. మణిశర్మ సంగీతం అందించారు. స్రవంతి రవికిషోర్ నిర్మాత. ఈ సినిమా సంక్రాంతి కానుకగా 14న విడుదల కానుంది. కాగా.. మంగళవారం చిత్రబృందం ప్రిరిలీజ్ వేడుక నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో రామ్ మాట్లాడారు.. ‘‘ఈ సినిమాలో అసలు హీరో నేను కాదు.. మా పెదనాన్న(నిర్మాత స్రవంతి రవికిషోర్). ఆయనతో చాలా సినిమాలు చేశాను. ‘బజరంగీ భాయిజాన్’ సినిమాలో సల్మాన్‌ఖాన్ ఆ చిన్నారిని ఎలా రక్షిస్తాడో.. కరోనా సమయంలో పెదనాన్న కూడా ఈ సినిమాను అలాగే కాపాడారు. ఆయనలో ఒక సల్మాన్‌ఖాన్ కనిపించారు. ఓటీటీ ఆఫర్లు వచ్చినా.. ‘రెడ్ అనే నా బిడ్డను.. థియేటర్లలోనే విడుదల చేస్తా’ అని పట్టుబట్టి ఇక్కడిదాకా తీసుకొచ్చారు. కిషోర్ తిరుమల.. ఒక క్రైమ్ థ్రిల్లర్ చేస్తున్నారంటే చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారు. ఆయన మాస్ సినిమా తీయడం ఏంటి..? అన్నారు. కానీ ఆయన ఏ సినిమా అయినా చేయగలరు. ఏదైనా రాయగలరు. ఇది ఆయన కెరీర్‌కు ఒక టీజర్ మాత్రమే. అసలైన సినిమా ముందుంది. ‘రెడ్’ అంటే నాకు గుర్తొచ్చేది మణిశర్మ.. అంతమంచి సంగీతం అందించారు. అమృత అయ్యర్‌ది చాలా తక్కువ నిడివి ఉన్న పాత్ర. అయినా ఆమె చాలా బాగా నటించింది. మాళవికాశర్మ.. అనుకున్నది చేసేదాకా వదలదు. సినిమాలో బాగా చేసింది. నివేదాపేతురాజ్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నేను ఇండస్ట్రీకి వచ్చి 15 సంవత్సరాలు అవుతోంది.. నా ప్రతీ అడుగులోనూ అభిమానులదే కీలక పాత్ర. అందరికీ ధన్యవాదాలు. ఇక ’రెడ్’తో సంక్రాంతికి మీరు ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాం. చివరగా ఓ మాట ‘ఈసారి మంట మామూలుగా ఉండదు’’ అని రామ్ ముగించారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.