Popular Post dasari4kntr Posted January 13, 2021 Popular Post Report Share Posted January 13, 2021 1 [December 12th 1998 అమెరికా లో ఒక నగరం…] [ఉదయం 7:00 గంటలు , అలారం మోగుతూ వుంది... ] బద్ధకంగా లేచాడు అవినాష్, లేచి ఆలా కూర్చుని శూన్యం లోకి చూస్తూ ఆలోచిస్తున్నాడు… ఎంత ప్రయత్నిస్తున్నా, తన ఆలోచనలు మరలటం లేదు, తనని విడిచి వెళ్లిపోయిన తన ప్రేమికురాలు గురించి. అంత సులభం గా మరిచిపోగలిగితే అది ప్రేమ ఎలా అవుతుంది? అలా అని గుర్తుకుతెచ్చుకుని సాధించేదేమీ లేదు...కానీ ఆ జ్ఞాపకాలే అతని జీవిత గుణపాఠాలు... అలా తన జ్ఞాపకాల లోతుల్లోకి జారుకున్నాడు... సుమారుగా సంవత్సరం క్రితం, అవినాష్ ఇండియా లో ఉండేవాడు. Info Systems లో software engineer. తన గర్ల్ ఫ్రెండ్ పేరు దివ్య, ఎంతో గాఢం గా ప్రేమించుకున్నారు, పైగా ఇద్దరు పనిచేసేది ఒకే చోట. పెళ్లి కాకపోయినా దంపతులు లా కలిసి తిరిగే వారు. వాళ్ళిద్దరూ కలిసి తిరగని ప్రదేశమంటూ లేదు, ఎంత దూరం ఐనా long drive కి వెళ్లి ఇద్దరూ ప్రకృతిలోని అందాలను ఆస్వాదించడమే కాకుండా ఒకొరికి ఒకరు ఆ ప్రకృతి వోడి లో దెగ్గరయ్యేవారు. అవినాష్ కి photgraphy హాబీ కూడా ఉండేది. ప్రకృతిని, అందులోని జీవరాశిని తన photography లో మరింత అందంగా చూపించడం అతనికి కి ఇష్టమైన అభిరుచి. బహుశా ప్రేమించడం అనేది ప్రకృతి నుంచి నేర్చుకుని దివ్య కి అందించాడేమో అనిపిస్తుంది. ఆ ప్రకృతి అందాల మధ్యలో తన ప్రియురాలు దివ్య ని లెక్కలెన్నని ఫొటోస్ తీశాడు. ఆలా వాళ్ళ ప్రేమాయణం ఒక కలర్ ఫుల్ సినిమా లా సాగిపోతుండగా, ఒక రోజు అవినాష్ కి తెలిసింది, దివ్య ఎవరినో పెళ్లి చేసుకోబోతుంది అని, అందుకే తాను కొంత కాలంగా office కి రావట్లేదు అని, తాను ఫోన్ చేసిన, ఫ్రెండ్స్ తో కబురు పెట్టినా కావాలనే కలవట్లేదు అని. గుండె బద్దలైంది అవినాష్ కి. వెళ్లి నిలదీసాడు, తనని పెళ్లి చేసుకోమని ప్రాధేయ పడ్డాడు, చివరికి దివ్య నిజస్వరూపం చూసి బాధపడ్డాడు. కొన్ని రోజుల్లో దివ్య పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. కానీ అవినాష్ తన గురించే ఆలోచిస్తూ డిప్రెషన్ లోకి వెళ్లేవాడు. ఒకటిరెండు సార్లు ఆత్మహత్యకి ప్రయత్నించినా చివరికి హాస్పిటల్ బెడ్ పైన తేలేవాడు. మనుషుల పైన, ప్రేమ పైన నమ్మకం పోయి జీవచ్చవం అయ్యాడు. ఆ టైం లోనే , తాను అప్లై చేసిన H1B visa approve అయింది. దివ్య ని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళాలి అని కలలు కనే వాడు. కానీ ఆఖరికి దివ్య పోయింది, అమెరికా పిల్చింది. మొదట అమెరికా వెళ్ళటానికి కొంత నిరాసక్తత చూపించినా , తన చిన్ననాటి స్నేహితులు , కుటుంబ సభ్యులు ప్రోద్భలం తో అమెరికా లో అడుగు పెట్టాడు . స్థలం మారితే దివ్య ఆలోచనలు కొంత తగ్గుతాయి అని ఒక చిన్న ఆశ అందరిది . అవినాష్ , అమెరికా కి వచ్చినా పెద్దగా స్నేహితులని ఏర్పర్చుకోలేదు, దివ్య తో జరిగిన అనుభవం తో ఎవ్వరిని నమ్మాలనిపించటం లేదు, ఆఫీస్ లో కొంతమంది తో హాయ్-హలో friendship ఉండేది కానీ అది ఆఫీస్ వరకే ఉంచాడు అవినాష్. ఉదయం 9 నుంచి 5 వరకు ఆఫీస్ పని మిగతా సమయం అంతా తన ఒంటరి ఆలోచనలు. ఈ ఆలోచనల నుండి బయటికి రావటానికి కొన్ని కొత్త అలవాట్లు వచ్చాయి…వాటిల్లో కొన్ని మంచి అలవాట్లు...కొన్ని చెడ్డ అలవాట్లు...మరికొన్ని వింత అలవాట్లు … ఆలాంటి విచిత్రమైన అలవాటే ఇది , అవినాష్ దానికి “గమ్యం లేని ప్రయాణం” అని పేరు పెట్టుకున్నాడు. వీకెండ్స్ లో అవినాష్ తన కెమెరా తీసుకుని ఒక గమ్యం అంటూ లేకుండా, ఎదో ఒక దిక్కున దూరంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి, ఆ ప్రయాణం లో కనిపించే nature ని ఫొటోస్ తీసేవాడు. కొన్ని సార్లు ఎంత దూరం పోయేవాడు అంటే , తాను ఒక్క రోజులోనే తిరిగి ఇంటికి రాలేనంత . అలాంటి సందర్భాలలో దగ్గర్లోని ఏదయినా MOTEL లో బస చేసి మరుసటి రోజు వచ్చేవాడు. ఇదంతా ఒంటరిగా ఆ వారాంతం ఇంట్లోనే ఏకాంతంగా ఉండడం ఇష్టం లేక… [ఉదయం 7:30 AM, అలారం మళ్ళి మోగుతుంది …] తన జ్ఞాపకాల నుంచి బయటపడ్డాడు అవినాష్… డిసెంబర్ నెల కావడం తో ఆఫీస్ స్టాఫ్ అంతా సంవత్సరాంతం సెలవులు తీసుకున్నారు. అవినాష్ కూడా రెండు వారాలు సెలవు తీసుకున్నాడు తన మేనేజర్ బలవంతం తో. తాను సంవత్సరం లో ఎప్పుడు సెలవు తీసుకునే వాడు కాదు ఒంటరిగా ఏమి చెయ్యాలో తెలియక . తన మేనేజర్ అదే విషయం చెప్పి vaction holidays తీసుకోమని గట్టిగా చెప్పాడు అవినాష్ కి. ఇంక తప్పని సరై రెండు వారాలు సెలవు తీసుకున్నాడు అవినాష్ . ఒకటి రెండు రోజుల ఏకాంతం నే తట్టుకోవడం కష్టం , మరీ రెండు వారాలు అంటే ఎలా అనే ఆలోచనే భయంకరంగా వుంది అతనికి. ఒంటరిగా ఇంట్లో గడిపే దానికన్నా , long drive కి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు, కానీ అది ఒకటీ , రెండు రోజుల long drive కాదు … రెండు వారల లాంగ్ డ్రైవ్ … మోగుతున్న అలారం ని ఆపి … తన ప్రయాణానికి సిద్ధం అయ్యాడు . కొన్ని బట్టలు , కొన్ని ప్రయాణానికి అవసరమైన వస్తవులతో బాగ్ సర్దుకుని , కెమెరా అందుకుని తన కార్ ఎక్కాడు ... (ఇంకా వుంది) 2 1 Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted January 13, 2021 Report Share Posted January 13, 2021 Good start to the viraha gaaha.. బస చేసి పక్క రోజు వచ్చేవాడు. Pakka roju ni marusti roju ani edit cheddhuvu chadhavataaniki baaguntadhi... 1 1 Quote Link to comment Share on other sites More sharing options...
dasari4kntr Posted January 13, 2021 Author Report Share Posted January 13, 2021 1 minute ago, Kool_SRG said: Good start to the viraha gaaha.. బస చేసి పక్క రోజు వచ్చేవాడు. Pakka roju marusti roju ani edit cheddhuvu chadhavataaniki baaguntadhi... thanks will change that Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post dasari4kntr Posted January 13, 2021 Author Popular Post Report Share Posted January 13, 2021 2 అవినాష్ ప్రయాణం మొదలయింది.. అమెరికాలో ప్రకృతి అందాలకి కొదవ లేదు. అప్పటికే తన ఇంటికి చుట్టూ పక్కల 300 miles పరిదిలో ఎన్నో ప్రదేశాలు చూసేసాడు అవినాష్ ప్రతి వారాంతంలో.ఇప్పుడు రెండు వారల సెలవు ఉండడంతో, ఈ సారి తన ప్రయాణం పరిది పెరగబోతుంది... దారి పొడవునా తన జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ అక్కడక్కడ ఆగి తన ఫోటోగ్రఫీకి పని చెప్తూ సాగుతుంది తన ప్రయాణం...ఎంత దూరం వెళ్తున్నాడో తెలియదు…చిన్న చిన్న టౌన్ లు , పొలాలు , అడవులు, కొండలు , లోయలు , నదులు , సరస్సులు , జలపాతాలు , రోడ్డుకు అడ్డం గా వచ్చే జింకల గుంపులు, సెలయేటి వొడ్డున సేదతీరే ఎలుగుబంటి సమూహాలు , ఎత్తైన కొండల పైన వంకరటింకర గా ఉండే సన్నని రహదారులు, పొడుగాటి చెట్లు , నిర్మానుష్యమైన రోడ్లు… ఇలా తనకంటూ ఒక నిర్దిష్టమైన గమ్యం లేదు…క్రిస్టోఫర్ కొలంబస్ అలా పశ్చిమ దిక్కుగా వెళ్ళి అమెరికా ని కనుగొన్నట్టు... అవినాష్ ఉత్తర దిక్కున వెళ్తున్నాడు, భూమి ఆకాశం కలిసే చోటు కనుగొందాం అన్నట్లు...అలా రెండు రోజులు గడిచాయి ఆ గమ్యం లేని ప్రయాణం తో…. మూడవ రోజు తన ప్రయాణం ముగించుకుని దారిలో ఏదో motel కనిపిస్తే అక్కడ ఆగాడు అవినాష్. పార్కింగ్ లాట్ లో పెద్దగా కార్లు లేవు…అక్కడక్కడ ఒకటీ అర మాత్రమే. ఎప్పుడూ రద్దీ గా వుండే రోడ్లు , కిక్కిరిసిన పార్కింగ్ లాట్ లు, అడుగు అడుగు కి ట్రాఫిక్ లైట్స్ తో వుండే సిటీ ని చూసిన అవినాష్ కి ఇలా ఖాళీ గా విసిరేసినట్లు ఉన్న రోడ్లు , motel చూసి అనుకున్నాడు తాను చాలా దూరం వచ్చేసాడని… అది ఒక పాత motel...చూడడానికి కూడా ఎవరూ పెద్దగా ఇష్టపడరు...కానీ అందులో ఒక రాత్రి బస అంటే కష్టమే...కానీ ఏ వృక్షం లేని చోట ఆముదం వృక్షమే మహావృక్షం...తనకి ఈ చుట్టు పక్కల ఇంకో motel కనిపించేలా లేదు... కార్ పార్క్ చేసి రిసెప్షన్ రూమ్ లోకి వెళ్ళాడు.. బజర్ నొక్కాడు రిసెప్షన్ లో ఎవరు లేకపోయే సరికి… రెండు నిమిషాలకి లోపల నుంచి వచ్చింది సుమారు 25 ఏళ్ళ ఒక అందమైన అమ్మాయి, తన స్కర్ట్ ని కిందకి లాగి సరిచేసుకుంటూ… లీనా : hello, నా పేరు లీనా… [అంది నవ్వుతూ…] అవినాష్: hi నా పేరు అవినాష్ , నాకు ఒక నైట్ స్టే కి రూమ్ కావాలి లీనా: ఎంతమంది? అవినాష్: నేనొక్కడినే... లీనా: [బుక్ రిజిస్టర్ ని చెక్ చేసుకుంటూ… అవినాష్ పేరు పలకడానికి కష్టపడుతూ] రూమ్ నెంబర్ 13 మీకు ఓకేనా? వేరే రూమ్స్ లో మైంటెనెన్సు ప్రోబ్లెంస్ ఉన్నాయి. అవినాష్: ఓకే… పర్వాలేదు... లీనా: [ఒక పెన్, పేపర్నిఅందిస్తూ] ఓక రాత్రి బస కి $70 అని అంటూ మీ వివరాలు ఇక్కడ రాయండి అవినాష్: [తన వివరాలు రాసాడు, కానీ “purpose of the visit” ని కాళీ గావదిలేసాడు, ఎందుకంటే తనకే తెలియదు ఎక్కడికి వెళ్తున్నాడో] లీనా : [అవినాష్ ని పేపర్ అందుకుని తన వివరాలు చూస్తూ అవినాష్ వయస్సు చూసి...కొంటెగా నవ్వుతు] మీకు రాత్రికి కంపెనీ కావాలంటే మనుషులు దొరుకుతారు , కొంచెం ఖర్చవుతుంది [అంది నర్మగర్భంగా] అవినాష్: [చిన్నగా నవ్వుతూ ] నాకు కావలిసిన కంపెనీ ఎప్పుడూ నా జ్ఞాపకాల్లోనే ఉంది లీనా : రూమ్ తాళాలు అందించింది తలుపు తీసుకుని రూమ్ లోకి వచ్చాడు అవినాష్ అలా 10 నిమిషాలు కూర్చున్న తరువాత లేచి తనతో పాటు తెచ్చుకున్న విస్కీ బాటిల్ లోంచి ఒక పెగ్ పోసుకుని తాగుతూ TV ఆన్ చేసాడు..... ఎదో లోకల్ న్యూస్ వస్తున్నాయి... తను టీవీ చూస్తున్నాడు గాని తన ద్యాస ఎక్కడో వుంది... ఒకటి.. రెండు.. మూడు...పెగ్గులు అయిపోయాయి...అతని ఆలచనలు తన జ్ఞాపకాల నుంచి తన జీవితం పైకి మరిలాయి… ప్రేమలో విఫలం...జీవితంలో విఫలం...ఆఖరికి ఆత్మహత్యలో కూడా విఫలం అని మనసులో రోదించాడు… తన జీవితం పైన తాను ఎప్పుడో గౌరవం కోల్పోయాడు …ప్రస్తుతం తన జీవితం ఓక ప్రవాహం లో కొట్టుకు పోయే చచ్చిన చేప (dead fish) లాంటిది.. ఇలా ఆలోచించుకుంటూ నాలుగో పెగ్గు కూడా అయిపోయింది ... [ఇంతలో TV లో ఒక పోలీస్ అధికారి మాట్లాడుతున్నాడు] పోలీస్ అధికారి: Hidden Hills County లో తరుచుగా మనుషులు మాయం అవుతున్నారు అని మాకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి, దాని గురించి త్వరలోనే విచారణ మొదలుపెడతాం. సిబ్బంది కొరత ఉండడం వల్ల వెంటనే చర్యలు తీసుకోలేకపోతున్నాం. ప్రజలు ఎవ్వరూ ఆ hidden hills county కి వెళ్లవద్దని , ఆ రోడ్స్ లో ప్రయాణం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పనిసరి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవలసింది గా మనవి. TV లో వచ్చే న్యూస్ ని వినే స్థితి లో లేడు అవినాష్ , ఎప్పుడో నిద్ర లోకి జారుకున్నాడు.... ******* అది ఒక ఎత్తయిన కొండల ప్రాంతం...మధ్యలో బ్రిడ్జి… అవినాష్1 కార్ లో బ్రిడ్జి పైకి చేరుకున్నాడు … అక్కడ బ్రిడ్జి రైలింగ్ పైన ఇంకో అవినాష్2 నిలుచుని కిందకి చూస్తున్నాడు… అవినాష్1 కి అర్థం కావట్లేదు… ఆశ్చర్యం తో కారు దిగి దెగ్గరికి వెళ్ళాడు… బ్రిడ్జి రైలింగ్ పైన ఉన్న అవినాష్2, కార్ దిగి వస్తున్న అవినాష్1 ని చూసి “పారిపో...ఇక్కడికి రాకు...పారిపో”...అని గట్టిగా అరుస్తూ బ్రిడ్జి పైనుంచి నీళల్లోకి దూకేసాడు… ******* ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు అవినాష్ తన బెడ్ పైనుంచి... (ఇంకా వుంది) 2 2 Quote Link to comment Share on other sites More sharing options...
JustChill_Mama Posted January 13, 2021 Report Share Posted January 13, 2021 దాసరి బ్రో .... “జీవత్సవం” కాదు “జీవచ్చవం” 1 1 Quote Link to comment Share on other sites More sharing options...
dasari4kntr Posted January 13, 2021 Author Report Share Posted January 13, 2021 9 minutes ago, JustChill_Mama said: దాసరి బ్రో .... “జీవత్సవం” కాదు “జీవచ్చవం” changed Quote Link to comment Share on other sites More sharing options...
NiranjanGaaru Posted January 13, 2021 Report Share Posted January 13, 2021 Just now, dasari4kntr said: changed Hi dasari bro Quote Link to comment Share on other sites More sharing options...
dasari4kntr Posted January 13, 2021 Author Report Share Posted January 13, 2021 Just now, NiranjanGaaru said: Hi dasari bro hi are you silver bro? Quote Link to comment Share on other sites More sharing options...
nokia123 Posted January 13, 2021 Report Share Posted January 13, 2021 Uuuuu..next part plz 1 Quote Link to comment Share on other sites More sharing options...
NiranjanGaaru Posted January 13, 2021 Report Share Posted January 13, 2021 1 hour ago, dasari4kntr said: hi are you silver bro? Fine 1 Quote Link to comment Share on other sites More sharing options...
summer27 Posted January 13, 2021 Report Share Posted January 13, 2021 good attempt..continue bro.. 1 Quote Link to comment Share on other sites More sharing options...
JustChill_Mama Posted January 13, 2021 Report Share Posted January 13, 2021 Story bagundhi ... One more bro ... కాళీ - కాళీ మాత “ఖాళీ “ 1 Quote Link to comment Share on other sites More sharing options...
dasari4kntr Posted January 13, 2021 Author Report Share Posted January 13, 2021 54 minutes ago, JustChill_Mama said: Story bagundhi ... One more bro ... కాళీ - కాళీ మాత “ఖాళీ “ thanks edited 1 Quote Link to comment Share on other sites More sharing options...
mustang302 Posted January 13, 2021 Report Share Posted January 13, 2021 Bro scenes emina unnaya bro?😝 1 Quote Link to comment Share on other sites More sharing options...
Biskot2 Posted January 13, 2021 Report Share Posted January 13, 2021 Good one bro, 1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.