Jump to content

Recommended Posts

Posted

ముక్కుపుడక

సాయంకాలం ఐదు కావొస్తుంది.ఇంటి ముందు కోడిపిల్లలు కుయ్కుయ్కుయ్అంటూ వాటి తల్లి చుట్టూ తిరుగుతున్నాయి.వాటి అమ్మ ఎర్రకోడి మట్టిలో బియ్యపు గింజలు, చిన్న చిన్న పురుగులు లాంటివి వెతుక్కుంటూ ముక్కుతో మట్టిని పొడుస్తూ చుట్టూ పక్కల చూస్తూ,తన పిల్లలకి ముప్పు ఉందేమో అని కంట కనిపెడుతూ అడుగులో అడుగేస్తుంది.అది ఎటు పోతే అటు దాని పిల్లలు కూడా వెళున్నాయి.అను ఆపిల్లల చుట్టూ తిరుగుతూమీకోసం నోను నీళ్లు తెచ్చాను వెళ్లి తాగండి" అని చేతులు ఊపుతూ కోడిపిల్లల్ని అటు వైపుగా తీసుకెళడానికి తంటాలు పడుతుంది.అనుకి మొన్నటి జూన్లో ఆరు పోయి ఏడు వచ్చాయి.డిప్పకటింగ్‌.చేతికోగాజు.మోకాళ్ళ దాకా గౌను.చామనచాయ.చెవిపోగులు.

మధు పొలం పనులు చేస్కుని ఆలా ఇంటి ముందు మట్టం మీద కూర్చుని తన కూతురు అను కోడి పిల్లలతో ఆడుకుంటుంటే చూస్తున్నాడు.

అతని భార్య ఉమాచిట్టి ఆలా కోడిపిల్లల్ని పట్టుకోకు పిల్లలకోడి నిన్ను పొడుస్తదే” అని వారించింది

ఎర్రకోడి నా  ఫ్రెండ్  మమ్మీ... నన్నేం చేయదుఅని ఆటలో మునిగిపోయింది అను

మధు తన భార్య ఉమా వొంక చూసిఓపిక లేదు..ఒక కప్టీ పెట్టివొచ్చుగాఅని అడిగాడు కొంచం వేడుకోలుగా. వొంటింటోకి వెళ్లి టీ తెస్తూ తెస్తూ అను కోసం పిడికెడు బురుగులు తెచ్చింది ఉమ.మధు చేతికి టీ కప్పు ఇచ్చిఅను ఇటురా ఓసారిఅని పిలిచింది.అప్పుటికే కోడిపిల్లల వెనకాల తిరిగి తిరిగి మొహానికి మట్టి అంటించుకొచ్చిన అనుని చూసి 

ఏది నీ చేతులు చాపు" అడిగింది ఉమా అను చేతిలో బురుగులు పెట్టబోతూ.

చేతి నిండా మాట్టే..అందుకే కోళ్ల తోటి ఆడుకోవద్దంకే వినవు.. వెళ్లి మోహము,చేతులు కడుక్కోపో అని గ్గధించింది అనుని.

గెంతుతూ ఇంటి వెనకాల్కి పోయి చేతులు కడుక్కొని రాగానే అను చేతిలో కొన్ని బురుగులుపెట్టింది ఉమా.అవి కొంచం కొంచం తింటూ

అమ్మా వీటిని కోళ్లు తింటాయా అని అడిగింది తన చేతిలోని బురుగులు చూపిస్తూ

అను ఇవి నీకోసం తెచ్చినవి కోళ్ళకి మనం బియ్యం వేద్దాం" అని వాళ్ళమ్మ చెప్పినా కూడా వినకుండా కొన్ని బురుగులు ఎర్రకోడికి, వాటి పిల్లలకి వేయసాగింది.అవి ఎగబడి వాటిని ముక్కుతో పొడుస్తుంటే అను మెల్లగా వెనకాల నుండి ఎర్రకోడి కాళ్ళని పట్టేసుకొని సంకలో పెట్టుకునిఇదిగో నేను కోడిని పట్టుకున్నచూడు డాడీ” అని మధుకి, ఉమాకి చూపించింది.

కోడి కోకో కోకో అని అరుస్తూ అను చేతిలో ఉన్న బురుగులని ముక్కుతో కరుచుకుని తింటుంది.

అను ఏంటా పనులు.. కర్ర ఏది, కొట్టాలి నిన్నసలు,కోడిని వదులుతావా లేదాఅని మధు అనేసరికి ఆ కోడిని నేల మీద వొదిలి, దాని పిల్లల వెనకాల తిరగడం మొదలు పెట్టింది అను.

టీ తాగుతున్న మధుతోరేపు మా అక్క వాళ్ళ అబ్బాయి వస్తునాడు.ఏమి ఒండుదాం" అడిగింది ఉమ.

పోయిన సారి వచ్చినపుడు కూడా వాడు సరిగా తినలేదు. కూరంతా ఏరి పక్కన పడేసి చివరకి పెరుగేస్కోని తిన్నాడుగుర్తుచేసింది ఉమ

కోడి కూర తెంటాడా వాడుఅడిగాడు మధు

తింటాడు పర్లేదుచెప్పింది ఉమ

టీ తాగుతూ కొంచం సేపు అలోచించి, “ ఎర్రకోడిని  కోద్దామా” అడిగాడు మధు

అరే చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి ఆకోడికి, దానిని అపుడే కోయడం ఎందుకు” అన్నది ఉమ

ఏంకాదులే.ఇదిగో అదిగో అనేలోపే అవి పెద్దగౌతాయి.అయినా మనం ఎదో ఒకటి పెడుతూనే ఉంటాం తినడానికిఅని కాళిచేసిన టీ కప్కింద పెట్టాడు మధు

ఉమా మధుతో "ఇందాకనే రమేష్అన్న ఇంటికి సైదులు వొచ్చాడు హలాల్చేయడానికి, వెళ్లి ఒకసారి ముందే మాట్లాడి, రేపాద్దున్న పదింటికల్లా మనింటికి రమ్మని చెప్పండిఅన్నది

వాళ్ళ ఊళ్ళో పండగలకి, ముత్యాలమ్మ తల్లి బలి ఇవ్వడాలు లాంటి వాటికీ, మంత్రాలూ  చదివి హలాల్చేసి కోళ్ళని కోయడం,వాటి బొచ్చు పీకి శుభం చేసి ఇవ్వడం,పీర్ల పండగలకి పీర్లు

ఎత్తడం లాంటివి సైదులు చేస్తూ ఉంటాడు.ఎప్పుటి నుండో పరిచయం

సైదులుని కలుద్దామని చెప్పులు వేసుకుంటుండగా చూసిన అను, కోడి పిల్లలతో ఆడుకోవడం వదిలేసి ఒక కోడి పిల్లని చేతబట్టుకొని మధు దగ్గరకి పరుగెత్తుకొచ్చింది.“డాడీ ఎటెళ్తున్నావ్ నేను

కూడా నీతో పాటు వొస్తా తీసుకెళ్ళు” అని గొడవ చేసింది.కోడి పిల్ల అను చేతిలో ఒదగలేక కుయ్యో కుయ్యో అని మొత్తుకుంటుంది.

అది చూసిన మధు, “తీసుకెళ్తాలే కానీ ఆకోడి పిల్లని వొదిలెయ్ నువ్ఆలా కోడిపిల్లల్ని పట్టుకుని తిరిగితే వాళ్ళ అమ్మ ఈ కోడిపిల్ల కోసం ఏడుస్తది.. ఆలా చేయడం పాపం కదాఅడిగాడు అను కళ్ళల్లోకి చూస్తూ.పిల్లల కోడి కెళ్ళి ఒకసారి చూసి కోడిపిల్లని వొదిలేసింది.కుుయో కుయో అంటూ ఆ కోడి పిల్ల పరుగెత్తుకెళ్లింది తన తల్లి ఎర్రకోడి దగరికి.

అనుని ఎత్తుకుని ఆలా బజార్లో నడుస్తుండగా  ఏం బావ ఎటెళ్తున్నావ్" అడిగాడు రంగారావు.

హలాల్సైదులు... రమేష్అన్న వాళ్ళింట్లో ఉన్నాడంటే వెళ్లి కలుద్దామని బయల్దేరాచెప్పాడు మధు.

సైదుల్తో ఏం పని బావ" అడిగాడు రంగారావు సిగరెట్ముట్టించుకుంటూ

రేవు మా మేనల్లుడు వొస్తునాడుగా...కోడిని కొయిదామనిచెప్పాడు మధు

రంగారావు ఒకచేత్తో సిగరెట్పట్టుకొని ఇంకో చెత్తో అను బుగ్గలు గిల్లుతూపిల్లా..రేపు మా ఇంట్లో పెళ్ళికొస్తావా..స్వీట్లు పెడతాను” అని అడిగాడు

ఏంటి నువ్పెళి చేస్కుంటున్నావా” అడిగింది అను

నా పెళ్లి కాదే తింగిరబుచ్చి..మా తమ్ముడు పెళి..నువ్వొస్తే బోలడు స్వీట్లు పెడ్తా, ఐస్ క్రీములుపెడతా...”

అయితే నేను,మా డాడీ మా మమ్మీ వస్తాం... మమ్మల్ని కార్ఎక్కిస్తావా

నిన్ను ఏరోప్లేన్ఎక్కిస్తా దా" అని అనుకి టాటా చెబుతూ రంగారావు వెళ్లబోతుండగా

పెళి పనులు ఎందాక వొచ్చాయి బావ"  అడిగాడు మధు.

ఏముంది ఇంకొంచం సేపట్లో తరలిపోడమే ఇకఅంటూ నడవసాగాడు

రమేష్వాళ్ళింటికి వెళ్ళగానే వాళ్ళావిడరా అన్న" అని పిలిచింది.

సైదులు విచ్చాడంటగా” అడిగాడు మధు. అన్నపెరట్లో ఉన్నాడు వెళ్ళు” అనగానే అటుబడి పోయారు తండ్రీ  కూతుళ్ళు మధు అను.

పొడుగాటి గడ్డం,గళ్ళ లుంగి, కిర్రుకిర్రు మనే బఱ్ఱె తోలు చెప్పులతో,చెవిలో సగం కాల్పిన బీడి పెట్టుకుని,ఒక రాయి మీద కూర్చొని చిన్నకత్తి తోటి కోడి ఈకలు పీకుతునాడు.సైదులు మధు ని

చూసి సన్నగా నవ్విఏంటి బాబు గారు” అడిగాడు తన పని తాను చేసుకుంటూ.సంకలో ఉన్న అనుని కిందకి దింపుతూ,

"సైదులు, రేపు మా ఇంటికి రావాలి ఒకసారి” చెప్పాడు మధు

దెనికి బాబు గారు

కోడిని కోయాలి చుట్టాలు వొస్తున్నారు"

కోడి ఉందా? వొచ్చేటపుడు ఏన్కూర్నుండి తీస్కుని రావాలా

కోడి ఉందిలే రేపాద్దున పదింటికి ఆలా వొచ్చేయ్సరిపోతాది అని చెప్పి అక్కడ నుండి తిరిగి ఇంటికి బయల్దేరారు మధు అను.నడుస్తుండగా కొంచం సేపటికి అను వాళ్ళ నాన్నని అడిగింది.

డాడీ మన కోడిని కొస్తున్నారా”

ఔను రేపు మీ బావ వొస్తునాడుగా అందుకే కొస్తున్నాం”

మరి కోడిని వాటి పిలల్లు మిస్అవ్వవా"

ఆలా ఏం ఉండదులే మనం అందరం ఉన్నాంగా కోడి పిల్లలకి..అవి రోజు నీతో ఆడుకుంటాయి”

వొద్దు డాడీ కోడిని కొయ్యకు

రేపు మీ బావకి ఏం పెడ్తావు"

అను కొంచం సేపు అలోచించికోడి పిల్లలు అవి చిన్ని చిన్నివి వాటికీ అమ్మ లేకపోతే

ఏడుస్తాయిగా డాడీఅని చెప్పింది కళ్లలోనుండి వస్తున్న దుఃఖం తోటి

ఓసి చిట్టిదాన దాని పిల్లలకి ఎం కాదులే..అమ్మ రోజు బియ్యం వేస్తది..నువ్వాటికీ నీళ్లు పెట్టి వాటితో ఆడుకుందువు సరేనా” అని అను కళ్ళు తుడుస్తూ సముదాయించాడు.

ఇంటికి రాగానో మధుని అడిగింది ఉమా సైదులు తో మాట్లాడవా అని

రేపొద్దున పదింటికల్లా వస్తాడు.రేపు ఉదయం ఎర్రకోడిని గంపలో నుండి బయటకి తీయకు.దాని పిల్లల్ని మాత్రమే వొదిలయ్అని పురమాయించాడు మధు

రేయి అను మూతి ముడుచుకుంది.సరిగా అన్నం తినకుండా పెందలాడే పడుకుంది

రాత్రిపడుకోబోయేముందు అను మీద దుప్పటి కప్పుతూఇవాళ నైట్ మీ గారాల పట్టి సరిగా తినలేదు" అన్నది ఉమ మధుతో

రోజంతా ఎదో ఒక చిరుతిండి పెడ్తూనే ఉంటావుగా ..అందుకే తినలేదేోమోఅని చెప్పి నిద్రలోకి జారుకున్నాడు మధు

అను పొద్దునే లేచేసరికి ఏడయ్యింది.లేవడంతోనే మట్టం మీదకి వెళ్ళబొయింది.

ఎక్కడికెళ్తున్నావ్ ..పాలు తాగకుండా వెళ్తే దెబ్బలు పడతాయి వెనక్కి తెరుగుతావా లేదాఅని వాళ్ళమ్మ గ్గధించింది.

గబా గబా పళ్ళుతోముకుని వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళింది అను.గ్లాస్లో పాలు పోస్తూ అను మొహంకెల్లి చూసిచిట్టిదనా నువ్వు మొహం నరిగ్గా కడుక్కోలే, కళ్ళలో పుసులు అలానే ఉన్నాయిఅంటూ, అను మొహం మళ్ళి కడిగి అపుడు పాల గాస్చేతికి ఇచ్చింది.అను పాలు తాగుతూ గ్లాస్తోటి ఇంటి ముందు మట్టం మీదకెళ్లింది.గంప దగ్గరికెళ్లి చూసింది.ఎర్రకోడి గంపలోపలే ఉంది.దాని పిల్లలు మాత్రం బయట చెల్లాచెదురుగా తిరుగుతున్నాయి.ఎదో గుర్తుకొచ్చినదానిలా అను ఇంట్లోకి పరుగెత్తుకెళ్లి ఒక బ్రెడ్‌ ముక్క తీసుకోచ్చి గంపలో ఏసింది.కోడి తన ముక్కుతో బ్రెడ్‌ని ముక్కలు ముక్కలుగా పొడుస్తూ బయట తిరుగుతున్న తన పిల్లల్ని చూస్తూ తింటుంది.

నువ్ఏడవకు నీపిల్లలని నేను చూస్కుంటాలేఅని కోడితో మాట్లాడుతూ పాలు తాగుతుంది అను.ఉన్నటుండి పక్కవీధిలో నుండి కుక్కొచ్చి కోడిపిల్లనొకదాన్ని ఎత్తుకుపోబోయింది.

ఇది ఎపుడూ చూడని అను ఆకుక్కని చూసి బయపడి ఏడవసాగింది.కోడిపిలలు ఎటుబడితే అటు పరుగుతీసాయి.గంపలో ఉన్న ఎర్రకోడి రెక్కలూపుతూ ఖో ఖో ఖో ఖో అంటూ శబ్దం

చేయసాగింది.ఇంట్లో పని చేస్కుంటున్న ఉమా గోల విని ఏం జరుగుతుందో అర్దమై ఉరికొచ్చి కుక్కని గెదంబోయింది. అప్పుటికే కోడిపిల్లల్లన్నీచెల్లాచెదురుగా తిరుగుతుండటంతో కుక్క

ఒక కోడిపిల్లని సునాయాసంగా నోటికరుచుకుపోయింది. ప్రదేశమంతా ఎరకోడి, దాని పిల్లల గోలతో అట్టుడికిపోయింది.

"అమ్మా మన కోడిపిల్ల పోయింది” అని ఏడ్పుకుంటూ వాళ్ళమ్మ దగ్గరికెళ్లింది అను

ఏడవకు చిట్టి మనకి ఇంకా ఆరు కోడి పిల్లలు ఉన్నాయిగా” అంటూ అను కళ్ళు తుడిచింది వాళ్ళమ్మ.పిల్లలకోడి ఇంకా అరుస్తూనే ఉంది.

"అమ్మ ఎర్రకోడి ఇంకా ఏడుస్తుంది” అని గంపలో ఉన్న కోడిని చూస్తూ అక్కడే కూర్చుంది అను.అపుడే పొలానికెళ్లి నీళ్ళుపెట్టొచ్చిన మధుకి జరిగిన సంఘటన చెప్పింది ఉమ.అను లేచి వాళ్ళ డాడీ దగ్గరికెళ్లి  ఎర్రకోడి చాల ఏడ్చింది డాడీ ఇవ్వాళా" అన్నది.

మధు అనుని దగరికి తీసుకునినీకొకటి తెల్సా..మన ఎర్రకోడి ఇంకో గుడ్డు పెట్టింది.. వొడ్ల కొట్టంలో ఉంది..వెళి చూడుపో' అని కొట్టంలోకి పంపించాడు అనుని.

ఒకసారి లోపలకి చూసి "ఏది లేదుగా డాడీ" అన్నది అను.కొట్టంలో రాశిగా పోసిన వొడ్లు ఒకవైపు ఎత్తుగా ఉండటంతో పూర్తిగా లోపలికెళ్ళి చూస్తే కానీ కోడి పెట్టిన గుడ్డు కనపడలేదు.

"ఆలా కాదు అటువైపు లోపలికెళ్ళు” అన్నాడు మధు ఎటు వెళ్లాలో చేయి చూపిస్తూ.అను లోపలికెళ్ళి ఒక మూలాన ఉన్నగుడ్దుని చేత్తోపట్టుకునిఔను డాడీ ఒక గుడ్డు ఉందిఅంటూ కాసింత నవ్వు మొకంతో బయటకొచ్చింది.

ఎర్రకోడి తన పిల్లలని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది.. ఇవ్వాలది గంపలో ఉండేసరికి దాని పిల్లల్ని కుక్క ఎత్తుకపోయింది” అన్నది ఉమ మధుతోటి

ఇవన్నీ మామూలేగాని,చికెన చేయడానికి అన్ని ఉన్నాయో లేవో చూసి చెప్పు" అన్నాడు మధు.అను వాళ్ళ బాబాయ్ప్రసాద్యూరియా బస్తాల కోసం బస్టాండ్ దాకా వెళ్తూ వెళ్తూ ఇటొచ్చాడు అనుని చూసిపోదామని.జేబులో నుండి వొంద రూపాయిల కాగితం ఒకటి బయటకి తీసి అనుకి చూపిస్తూఅన్నులూ నేను రోడ్దాకా వెళ్తున్నా..నాతోపాటు వొస్తావా" అన్నాడు ప్రసాద్

ప్రసాద్చూపిస్తున్న వొంద కాగితం లటుక్కున లాక్కోబోయింది.ప్రసాద్నోటు వెనక్కి లాక్కుని మళ్ళీ అను ముందుంచాడు తీసుకోమని.అను మళ్ళీ లాక్కోబోయింది కానీ దొరక్కపోవడంతో

తన బాబాయ్కి పెడమొఖంగా తిరిగి, డాడీని హత్తుకొనిచూడు డాడీ,బాబాయ్నాకింకా ముక్కుపుడక కొనివ్వలేదు నేను బాబాయితో వెళ్ళును” అని పిర్యాదు చేసింది వాళ్ళ డాడీకి.

మాటలు విన్న ప్రసాద్మధు తోటి "చూడరా ఇది వేలెడంత లేదుకానీ ఎలా డిమాండ్చేస్తుందో" అని అనుకి ముద్దుపెట్టి,

తిరిగొచ్చేటపుడు నీకు చాక్తెట్తెస్తాలే" అంటూ వెళ్ళిపోయాడు 

బయట బ్యాండ్మేళం వినిపిస్తుంది. పెళ్ళికొడుకు తరలి వెళ్తున్నాడు పెళికూతురు ఇంటికి.రంగారావుతో పటు ఇంకొంత మంది కార్ముందు డాన్సులేస్తున్నారు.నడివమ్లో బట్టలు

మడతపెడ్తున్న ఉమా బ్యాండ్మేళం విని బయటకొచ్చింది.

పెళ్లి ఊరేగింపు చూస్తూ ఆగుంపులో రంగారావు అన్నయ పక్కన బ్లూ షర్ట్వేస్కొని డాన్స్వేసేది కిలాలోరి అబ్బాయే కదా” అడిగింది ఉమా

ఆ అబ్బాయే

" అయితే మొన్న అబ్బాయినే నెల్లిపాకలో ఒక అమ్మాయిని గొడవ చేస్తే ఊరోళ్లు కొట్టారంటఅని డిటెక్టీవ్లా చెప్పింది ఉమ

నీకు ఇవన్నీ ఎలా తెల్సు అన్నట్టు నవ్వుతూ "ఎవరు చెప్పారు” అడిగాడు మధు

"మన పక్కింటి శీను పెళ్ళాం" అన్నది ఉమ వాళ్ళ వీధిలోకి వొస్తున్న ఊరేగింపు చూస్తూ

పెళ్ళికొడుకు కార్వీళ్ళింటి ముందుకొచ్చి ఆగింది.రంగారావు పరిగెత్తుకుంటూ వోచిఏందీ బావ ఇంకా రెడీ అవ్వలేదా” అని అడిగాడు

నేను కొంచం ఆగి వొస్తాలే.. పెళ్ళి ముహూర్తానికి ఇంకా టైం ఉందిగా” చెప్పాడు మధు

సరేలే దా మనం డాన్స్వేద్దాం...నీకు నచ్చిన పాట పెట్టిస్తా దా బావ” అడిగాడు రంగారావు

బావా ఇపుడు డాన్స్లు గట్రా ఎందుకు ఇంకా స్నానం చేయలేదు నేను”

బావ మా ఇంట్లో ఆఖరి పెళ్లి...నీకు తెల్సు..మనమిద్దరం చిన్నప్పటినుండి కల్సి తిరిగాం.ఇక ఇదే లాప్ట్‌..డాన్స్మనమేసేది" అంటూ చేయి పట్టుకులాగాడు రంగారావు

ఉమా లోపలికెళ్ళి నల్ల కళ్లద్దాలు తెచ్చిచ్చింది మధుకి.

చెల్లెమ్మ నువ్సూపర్అని మెచ్చుకుంటూ, “బావ వస్తావా రావా అని బెదిరిస్తున్నాడు రంగారావు.

ఇక తప్పేలా లేదు అని మధు రంగారావు తో పాటు తన కూతుర్ని తీస్కొని కార్వద్దకి వెళ్ళాడు.అప్పటిదాకా డాన్స్వేస్తున్న అబ్బాయిలని రేయ్పిల్లలు..ఒక ఐదు నిముషాలు మాకు

వొదిలేయండ్రా అంటూ రంగారావుచెప్పు బావ నీకు ఏ సినిమాలో ట్యూన్కావాలో...ఇవ్వాళా మనమిద్దరం డాన్స్వెయ్యాలా అంతే" అని అరిచాడు హుషారుగా.

ఇంకే సినిమా బావ మన ముఠా మే(స్తిలో పాట పెట్టించుఅని గట్టిగ చెప్పాడు బ్యాండ్మేళాలహోరులో.

హోయి రబ్బ..హోయి రబ్బ..హోయి రబ్బ..హోయి ...అని మ్యూజిక్వినిపిస్తుండగా షర్ట్చేతులు మలుచుకుని ..కాలర్పైకి ఎగరేసి మెల్లగా స్టెప్వేయడం మొదలెట్టారు ఇద్దరు.వాళ్ళ డాన్స్చూస్తూ ఉమా అనుని ఎత్తుకుని నవ్వుతుంటే అను చేతులూపుతూ మధ్య మధ్యలో చప్పుట్లు కొడుతుంది.

సినిమా రిలీస్అయినపుడు ఏన్కూర్ టూరింగ్టాకీస్ ఈ పాటకి వీళ్ళిద్దరూ చేసిన రచ్చ గుర్తొచ్చింది మధుకి.

కబడ్ధార్ నేనే...ఆ నేనే ముఠామేస్త్రిఅంటూ ఉమా ఇచ్చిన కండువా తలకి చుట్టుకుని అనుని వాళ్ళ అమ్మ దగర నుండి తీస్కొని కిందకి దించి అను తోటి స్టెప్లు వేయిస్తున్నాడు మధు.

పాట మధ్యలోకొచ్చౌసరికి ఎవరి గోల వాళ్ళది అన్నట్టు ఎవరికి తోచిన స్టెప్స్వాళ్ళు వేస్తూ గోల గోలగా డాన్స్ఏసారు. పాట అయిపోయాక మధు, రంగారావుని కౌగిలించుకొనిపెళ్లిలో

కలుద్దాం బావ” అని చెప్పుకున్నారు.కార్మెల్లగా వీళ్ళ ఇంటి ముందు నుండి కదిలింది.

ఉమా,మధు ఇద్దరు వీధిలో నుండి ఇంట్లోకి వొచ్చేసరికి ఇంటి ముందు సైదులు బీడీ కాలుస్తు వాళ్ళకోసమే ఎదురుచూస్తున్నాడు.సైదులుని చూసిన మధు గంప చూపించిఅందులో కోడి

ఉంది తీస్కో”అని చెప్పాడు.సైదులు గంప తెరిచి చూడగా ఖాళిగ ఉంది.

కోడి లేదుగా బాబుగారు” అని గంప పైకి లేపి చూపించాడు సైదులు.కోడి లేకపోవడం ఏంటి అని అనుకుంటూ మధు అటు ఇటు చూస్తూ చూద్దాం ఇక్కడే ఎక్కడో ఉంటదిలే ఎక్కడికిపోయిద్ది

అన్నాడు ధీమా తోటి.కోడిపిల్లలు కనిపిస్తున్నాయి కానీ కోడి లేదు..ఇంతకీ అను ఎక్కడుంది అనుకుంటూ ఉమని కేకేశాడు మధు.

లోపల ఉన్న ఉమా బయటకి రాగానేఅను ఎక్కడ” అడిగాడు మధు

బయటే ఆడుకుంటుంది కోడిపిలల్ల తోటి” అని చెప్పింది ఉమ

ఇక్కడ లేదు ఇంట్లోనే ఎక్కడైనా ఉందేమో చూడు” అని అడిగాడు మధు.ఈలోపు ఇంటివెనకాలకి ఒక సారి వెళ్ళొద్దామని అటుగా వెళ్ళాడు మధు

పక్కింటి శీను గాడి పెళ్ళాం బట్టలు ఎండేస్తూ మధుని చూసిఏంటన్నా ఏంటో ఎతుకులాడుతున్నావ్‌" అంది.

వీడికి, వీడి పెళ్ళానికి ఎపుడు ఎవడెం చేస్తుండా అనేదే కావాలి" అని తిట్టుకుంటూ..”ఆఆ మా ఎర్రకోడి ఏమైనా కనిపించిందా" అని అటు ఇటు చూస్తూ అడిగాడు మధు.

లేదన్నా చూడాలే" అని చెప్పింది శీను గాడి పెళ్ళాం.

ఇంతలోకే ఉమా అరుపులు వినిపించాయి ఇంట్లోనుండి.

అటు వైపు వెళ్లి చూడగామన అమ్మాయి ఇంట్లో కూడా లేదు”అని కంగారుగా చెప్పింది.ఒకసారి తన పెళ్ళాన్ని కొట్టాలన్న కోపం దిగముంగుకునిసరిగ్గా వెతికావా లేదా” అని అడిగాడు.

మావ చూసా కానీ కనపడలే అన్నది.

ఇక ఇంటి ముందుకి పోయి "సైదులు అలా నాలుగు వీధులు పోయి చూడు కొంచం”అని చెప్పి మధు ఇంట్లోకి వెళ్ళాడు.ఇల్లంతా ఖాళిగానే ఉంది ఏ అలికిడి లేదు. అను వస్తువులన్నీ అలానే ఉన్నాయ్‌,కానీ ఉమా ఒకటి కనిపెట్టింది స్కూల్బాగ్‌ కనపడటం లేదు.ఉమాని కూర్చోపెట్టి అడిగాడు మధు "చివరి సారి ఎపుడు చూసావ్‌" అని.

ఇందాక మీరు డాన్స్వేసేటప్పుడు” అన్నది ఉమ

పెళ్లి బండి వెనుక వెళ్లిందా వాళ్ళతోపాటు అంటూ..”నేనెళ్ళి చూసొస్తా పెళ్ళిఊరేగింపులోఅని వెంటనే బండి తీసి కార్వెళ్లిన దిక్కున పోనిచ్చాడు మధు.

కానీ నిరాశే మిగిలింది.బండి వెనక్కి తిప్పి ఇంటికి వొచ్చేసరికి అతని చిన్నన్న ప్రసాద్ఉమలు మాట్లాడుకోవడం కనిపించింది.సైదులు ఎదురుగా వొచ్చిచూసాను సామీ చుట్టు ప్రక్కల కనపడలేదుఅన్నాడు.ప్రసాద్కండువా బుజం మీద వేసుకుంటూఅను వాళ్ళ స్నేహితుల ఇళ్లవైపు ఏమైనా వెళ్ళిందేమో,చూసొస్తాఅని బయల్దేరాడు.

ఇప్పుటికి అమ్మాయి కనపడక ఒక గంట అవుతుంది.కొంత మంది మళ్ళి ఇంట్లో చూడసాగారు.పిల్ల ఏమైనా అలిగిందా అని ఎవరో అడిగారు.మేము అనుని ఏమి అనలేదే అలగటానికి అని ఉమ, మధు ఒకళ్ళ మోకాలు ఒకళ్ళుచూసుకున్నారు.ఎండకి ఒళ్ళంతా చిటపటలాడుతూ చిరాకు పడుతుంది మధుకి. టైం పదకొండు కావొస్తుంది.ఈలోపు ఇంటికి వొచ్చిన చుట్టుపక్కల వాళ్ళు, స్నేహితులు అందరు అడిగి తెల్సుకుంటున్నారు.ఇంకొందరు ఇల్లు మొత్తం వెతుకుతున్నారు..ఎవరికీ తోచింది వాళ్ళు చేస్తున్నారు.వాళ్ళ అమ్మ నాన్న చనిపోయాక కలిగిన ఏకైక సంతానం కాబట్టి చాల గారాబంగా పెరిగింది పిల్ల.కొంచంసేపటికి చేసేదిలేక ఇంటికొచ్చిన జనాలు మెల్లగా ఎటొల్లటు వెళ్ళిపోసాగారు.

కొట్టంలో రాశులుగా పోసిన వొడ్ల మీద..ఒక మూలకి గుడ్డు మీద కూర్చుని పొదుగుతుంది ఎర్రకోడి.అను పాప తన స్కూల్బ్యాగ్జిప్తెరిచి అందులో నుండి ఒక బిస్కెట్ప్యాకెట్‌ బయటకు తీసింది.కోడి కళ్ళు మూస్తూ తెరుస్తూ తాను పెట్టిన గుడ్డు మీద ఆలా కదలకుండా కూర్చుంది.బిస్కెట్ప్యాకెట్చించి ఒక బిస్కెట్నోట్లో పెట్టుకుని నములుతుండగా కోడి మెల్లగా కన్ను తెరిచింది.కోడి ఆకలిగా ఉందేమో ఒక బిస్కెట్ఇద్దామని ప్యాకెట్లో నుండి ఒక బిస్కెట్తీసి 

" బిస్కెట్తిను" అంటూ ఎర్రకోడి మీదకి ఇసిరేసింది అను. తన మీద పడ్డ బిస్కెట్తో ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఎర్రకోడి రెక్కలు ఊపుతూ అరవడం మొదలుపెట్టిందిఖో ఖో ఖో ఖో” అంటూ.

కనపడకుండా పోయిదనుకున్న కోడి అరుపులు వినేసరికి ఉమకి ప్రాణం లేచొచ్చింది.శబ్దం వొచ్చే వైపు పరుగు తీసింది.ఆలా మట్టం ముందుకు రాగానే అర్థమైంది,కోడి తమ ఇంట్లోనే వొడ్లున్న గదిలో ఒక మూలాన ఉందని.తొంగి చూస్తే కనపడలేదు.చిన్నగా ఎవరో దగ్గినట్టు వినిపించగా మళ్ళి తొంగి చూసింది, వొడ్లున్న గదిలోకి.ఎవరు కనిపించలేదు.మధుని పిలిచి “లోపల గదిలో ఎవరో ఉన్నారు చూడండి” అని చెప్పింది.మధు లోపలికెళ్ళి చూడగా ఖోఖోఖో అని అరుస్తున్న ఎర్రకోడి ఒక వైపు, బిస్కెట్తింటున్న అను ఇంకో వైపు ఆమడ దూరంలో ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు.అను తన స్కూల్బాగ్ని ఒళ్ళోపెట్టుకుని శుబ్బరంగా బిస్కెట్‌ తింటుంది.అను కావాలనే కోడిని ఇక్కడ దాచిందని అర్థమైంది మధుకి.వాళ్ళ నాన్న లోపలకి రావడం చూసిన అను లేచి నిల్చొని భుజాలకి బ్యాగ్తగిలించుకుంటూ

ఎర్రకోడిని తీస్కొపోవొద్దు డాడీ" అన్నది ధిక్కార స్వరంతో

కోడి కోసం రాలేదు చిట్టి, నీకోసమే వొచ్చానుఅన్నాడు మధు

అయితే కోడిని తీస్కెళ్ళవుగా..?

అహో తీస్కెళ్లను”

బీడీ కాలుస్తాడే గడ్డపు అంకుల్వొచ్చాడు డాడీ...నేను చూసాను”

మధు వొడ్ల మీద నడుచుకుంటూ అను దగ్గరికెళ్లి మోకాళ్ళ మీద నిలబడి అను జుట్టు సవరిస్తూ  "సైదుల్ని వెళ్లి పొమ్మని చెబుతాలే..కోడిని ఏమి చేయడు" అన్నాడు

"నిజంగా..?”

" నిజంగా

మాటల్తో అనుకి నమ్మకం కుదిరి లటుక్కున మధు మీదకి ఎగిరి చెంప మీద గట్టిగ ఒక ముద్దుపెట్టి "థాంక్యూ డాడీ" అన్నది.కూతుర్ని దగ్గరకి తీస్కాని ముద్దు చేస్తూ గట్టిగ కావలించుకున్నాడు మధు.

వాళ్శిద్దరికేసి చూస్తూ "తండ్రీ  కూతుళ్ళ మొహాలు బల్బ్ ఎలిగినట్లు ఎలుగుతున్నాయి"అన్నది ఉమ కళ్ళు తుడుచుకుంటూ.

"ఎన్నిరోజులు అందులోనే ఉందామనుకున్నవే” అడిగింది ఉమ అను వేసుకున్న స్కూల్బ్యాగ్‌ బుజాల మీద నుండి తీస్తూ.వాళ్ళమ్మ ఎక్కడ కొడుతుందోనన్న భయంతో బేల చూపులు చూస్తున్న అనుని గమనించిన మధు ఇక ఈవిషయం ఇక్కడితో వొదిలెయ్ అన్నట్టు చేత్తో సైగ చేసాడు.నాలుగిళ్ళు వెతికి వొచ్చిన ప్రసాద్కి అను కనిపించేసరికి అనుని ఎత్తుకుని

ఎటు పోయావ్చిట్టీ..నీకోసం మీనాన్న, మీఆమ్మ, నేను అందరం కల్సి వెతికాం తెల్సా” అని అడిగాడు.

ఇదుగో ఇందులోనే దాక్కుంది చిట్టిధీ ఎర్రకోడితో కల్సి" అని పక్కన ఉన్న వొడ్ల కొట్టం చూయించింది ఉమ

ఎందుకు దాక్కున్నావ్‌" అంటూ చేతిలో చాకలేట్పెట్టి, అను చెవి దగ్గర మెల్లగా అడిగాడు

నువ్ముక్కుపుడక ఇస్తా అన్నావ్..ఇంకా ఇవ్వలేదని కోపమొచ్చి దాక్కున్నా" అని ప్రసాద్‌ చెవిలో గట్టిగా చెప్పడంతో గొల్లుమన్నారు అంతా

  • Upvote 2
Posted

Matter in 2 lines plz

  • Haha 2
Posted
5 minutes ago, No_body_friends said:

Matter in 2 lines plz

aa kodi + ee pilla = kodipilla

Posted
3 minutes ago, Sputnik said:

Nuvve raasava pipaasi

ha mawa

Posted
Just now, Sputnik said:

Repu chadivi feedback istha

aaaiiii chittham dhoraa!

  • Haha 1
Posted
10 hours ago, kalaa_pipaasi said:

nice....

Posted
11 hours ago, kalaa_pipaasi said:

ha mawa

thappakunda chaduvutha pipaasi

Posted
8 hours ago, Raazu said:

Avaraina chadhivi vunte vallu great.. e newspaper 

rasinodu inka greatuuu🤣

Posted
21 minutes ago, kalaa_pipaasi said:

rasinodu inka greatuuu🤣

I read the whole thing and learnt one neethi

eat only broiler kodi no naatu kodi

Posted
6 minutes ago, MagaMaharaju said:

I read the whole thing

enthina nuv LEGEND status ki nyayam chesav baa.. nee opika ki salaam bombay!

Posted
1 minute ago, kalaa_pipaasi said:

enthina nuv LEGEND status ki nyayam chesav baa.. nee opika ki salaam bombay!

It was like a bed time story

post more will read

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...