r2d2 Posted January 22, 2021 Report Posted January 22, 2021 ‘బాహుబలి’, ‘సాహో’ చిత్రాలతో పసందైన యాక్షన్ హంగామాని చూపించారు కథానాయకుడు ప్రభాస్. అందుకే ఇప్పుడాయన కొత్తగా ‘రాధేశ్యామ్’తో ఓ విభిన్నమైన ప్రేమకథను రుచి చూపించేందుకు సిద్ధమయ్యారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే నాయిక. ఇందులో ప్రభాస్ పెదనాన్న.. సీనియర్ నటుడు కృష్ణంరాజు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ ఇద్దరూ గతంలో ‘బిల్లా’, ‘రెబల్’ చిత్రాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడిన్నాళ్ల తర్వాత మళ్లీ ఈ చిత్రం కోసం తెర పంచుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో పరమహంస అనే పాత్రలో కృష్ణంరాజు దర్శనమిస్తారని, ఇప్పటికే ఈ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందని తెలిసింది. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో తుది దశ చిత్రీకరణలో ఉంది. Quote
r2d2 Posted January 22, 2021 Author Report Posted January 22, 2021 1 minute ago, No_body_friends said: పరమహింస? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.