r2d2 Posted January 24, 2021 Report Posted January 24, 2021 ఈ దఫా ముద్రణ లేదు ప్రతులన్నీ మొబైల్ యాప్‌లోనే బడ్జెట్ కసరత్తు తుదిదశకు చేరిందనడానికి సంకేతంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ శనివారం సంప్రదాయ హల్వా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. బడ్జెట్ ముద్రణ కార్యక్రమం ప్రారంభానికి ముందు ప్రతిఏటా ఇక్కడి నార్త్‌బ్లాక్‌లోని ఆర్థికశాఖ ప్రధాన కార్యాలయంలో హల్వా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆచారంగా వస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 2021-22 సంవత్సరం బడ్జెట్‌ను పూర్తిగా కాగిత రహిత విధానంలోనే తీసుకురాబోతున్నారు. ఇందుకోసం నిర్మలాసీతారామన్ యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు. దీని ద్వారా పార్లమెంటు సభ్యులు, సాధారణ ప్రజలు బడ్జెట్ డాక్యుమెంట్లను పొందొచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారుల కోసం హిందీ, ఇంగ్లిష్ ప్రతులను ఇందులో ఉంచుతున్నారు. దీన్ని కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ సూచనల మేరకు నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ అభివృద్ధి చేసింది. ఫిబ్రవరి 1వ తేదీన లోక్‌సభలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత ఈ యాప్‌లో బడ్జెట్ డాక్యుమెంట్లు అందుబాటులోకి వస్తాయి. హల్వా కార్యక్రమంలో ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్‌తోపాటు, రెవిన్యూ కార్యదర్శి ఏబీ పాండే, వ్యయవిభాగ కార్యదర్శి టీవీసోమనాథన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్ బజాజ్, దీపం కార్యదర్శి తుహిన్‌కాంత్ పాండే, ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్యదర్శి దేబాశీష్ పాండా, ముఖ్య ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రహ్మణియన్, బడ్జెట్ విభాగం అదనపు కార్యదర్శి రజత్‌కుమార్ మిశ్రా, ఇతర అధికారులు పాల్గొన్నారు. Quote
Hydrockers Posted January 24, 2021 Report Posted January 24, 2021 Act of god laga tax to god ani kottadi vasool chestaru emo Quote
Kool_SRG Posted January 24, 2021 Report Posted January 24, 2021 32 minutes ago, Hydrockers said: Act of god laga tax to god ani kottadi vasool chestaru emo Never before never after budget ani hint given bayam vesthondhi.. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.