johnydanylee Posted January 25, 2021 Report Posted January 25, 2021 రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహించతలుచుకున్న పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సంఘాలు వేసిన పిటిషన్‌ను సంజరుకౌల్ నేతృత్వంలోని సుప్రీంకోర్ట్ ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది. ఉద్యోగ సంఘాల తీరును తప్పుపట్టింది. రాజ్యాంగ ప్రక్రియను వద్దని చెప్పాడానికి ఉద్యోగులు ఎవరని ప్రశ్నించింది. విధుల్లో పాల్గనడమే కానీ, ఎన్నికల విధుల్లో పాల్గనబోమని చెప్పడానికి ఉద్యోగ సంఘాలకున్న హక్కు ఏంటని వారి తరుపు న్యాయవాదిని ప్రశ్నించింది. ఉద్యోగ సంఘాల నేతలందరూ మూకుమ్మడిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై దాడి చేయడమేంటని, ఆ హక్కు మీకు ఎవరిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఉద్యోగ సంఘాల తరుపు న్యాయవాది మాట్లాడుతూ ఎన్నికలకు తాము వ్యతిరేకం కాదని, ఎన్నికలు వాయిదా వేయమని మాత్రమే కోరామని చెప్పారు. సుప్రీంకోర్ట్ తీర్పుపై ఉద్యోగసంఘాల నేత వెంకట్రామిరెడ్డిని ప్రశ్నించగా తాము ఎన్నికలు వద్దని చెప్పలేదని, ఎన్నికల విధుల్లో పాల్గనవద్దని తమ ఉద్యోగులకు చెప్పలేదని, ఎవరైనా విధుల్లో పాల్గంటామంటే తమకేమీ అభ్యంతరం లేదన్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.