Somedude Posted January 27, 2021 Report Posted January 27, 2021 చట్టం కంటే గొప్పోళ్లా? రాష్ట్రంలో ఎక్కువ మంది అధికారులది అదే తీరు కోర్టు ఉత్తర్వుల అమల్లో నిర్లక్ష్యంపై హైకోర్టు అసహనం మీ కార్యాలయంలో ఏం జరుగుతుందో మీకే తెలియడం లేదు కోర్టు ధిక్కరణ కేసులో డీజీపీని ఉద్దేశించి వ్యాఖ్యలు న్యాయస్థానం ముందు హాజరైన హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, మరో ఇద్దరు అధికారులు ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని ఎక్కువ మంది అధికారులు తాము చట్టం కంటే ఎక్కువనే భావనలో ఉన్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి పరిస్థితి ఏపీలోనే చూస్తున్నామని పేర్కొంది. ఐఏఎస్, ఐపీఎస్ సహా ఏ అధికారులయినా.. చట్టం కంటే తాము ఎక్కువని భావించొద్దని హితవు పలికింది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేయకుండా పలు సందర్భాల్లో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. కక్షిదారులకు న్యాయం చేయడం, వారి ప్రాథమిక హక్కులు కాపాడటం కోసమే కోర్టులున్నాయని గుర్తుచేసింది. రాజ్యాంగమే అన్నింటికంటే మహోన్నతమైనదని, ఎవరైనా దానికి లోబడి వ్యవహరించాల్సిందేనని తేల్చిచెప్పింది. ఓ కోర్టుధిక్కరణ వ్యాజ్యంలో హైకోర్టుకు హాజరైన డీజీపీ గౌతమ్ సవాంగ్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్‌ను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. గతంలో ఓ వ్యాజ్యంపై విచారణలో డీజీపీ కోర్టుకు హాజరైతే.. సిన్సియర్ ఆఫీసర్ అనే భావనను వ్యక్తపరిచామని గుర్తుచేసింది. ఈ కేసులో పరిణామాలను గమనించాక గత అభిప్రాయాన్ని బలవంతంగా మార్చుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. మీ కార్యాలయంలో కింది స్థాయి అధికారులు ఏం చేస్తున్నారో మీకు తెలియడం లేదని.. పరిస్థితిని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉందని డీజీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వుల అమలులో కిందిస్థాయి ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా డీజీపీని మళ్లీ మళ్లీ కోర్టుకు పిలవాల్సి వస్తోందని పేర్కొంది. ఎస్సైగా పనిచేస్తున్న ఓ అధికారికి కోర్టు ఆదేశాల మేరకు సీఐగా పదోన్నతి కల్పించినప్పటికీ.. తామిచ్చిన ఆదేశాల్ని అమలు చేయడంలో ఉద్దేశపూర్వక ఉల్లంఘన, నిర్లక్ష్యం, జాప్యం కనిపిస్తోందని ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఉత్తర్వుల అమల్లో జాప్యానికి కారణాలపై వివరణ ఇస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని కోర్టుకు హాజరైన రాష్ట్ర హోం శాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఐజీ మహేశ్‌చంద్ర లడ్హా, ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్‌రావులను ఆదేశించింది. విచారణను ఫిబ్రవరి 25కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ బుధవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు. నేపథ్యమిదే.. ఎస్సైగా పనిచేస్తున్న యు.రామారావుకు సీఐగా పదోన్నతి ఇచ్చే ప్యానల్లో స్థానం కల్పించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. వాటిని అమలు చేయకపోవడంతో రామారావు కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి.. హోం శాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ ఇతర అధికారుల హాజరుకు ఆదేశించారు. వారు బుధవారం కోర్టుకు వచ్చారు. కోర్టు ఇచ్చిన నోటీసును ఎప్పుడు అందుకున్నారని న్యాయమూర్తి డీజీపీని ప్రశ్నించారు. అన్ని వివరాలతో కోర్టు ముందుకు రావాలన్నారు. జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సలహా తీసుకోవడమేంటి? కోర్టు ఉత్తర్వుల అమలులో జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ నుంచి న్యాయసలహా తీసుకోవడంలో జాప్యం చోటు చేసుకుందని డీజీపీ, ఇతర అధికారులు కోర్టుకు తెలిపారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన న్యాయమూర్తి.. అధికారులు అలా వ్యవహరించడం దారుణం అన్నారు. కోర్టు ఉత్తర్వుల అమల్లో అడ్వకేట్ జనరల్ లేదా ప్రభుత్వ న్యాయవాదుల నుంచి సలహా తీసుకోవాలన్నారు. అంతే తప్ప జాయింట్ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ సలహా తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో పిటిషనర్ ఎంత బాధకు గురయి ఉంటారో ఊహించారా అని ప్రశ్నించారు. అర్హత ఉండి పదోన్నతి రాకపోయింటే ఆ బాధ మీకు తెలిసేదన్నారు. కోర్టు ఆదేశాల్ని సరైన స్ఫూర్తితో అమలు చేయాలన్నారు. Quote
Somedude Posted January 27, 2021 Author Report Posted January 27, 2021 Judges marina mottikayalu mathram continuing. Quote
Hitman Posted January 27, 2021 Report Posted January 27, 2021 History create chestunna AP politics. Quote
tom bhayya Posted January 27, 2021 Report Posted January 27, 2021 4 minutes ago, Hitman said: History create chestunna AP politics. Jagan anna trend setter, ippativaraku oka lekka ippudunundi vere lekka. Vachaadu Rajanna koduku vachaadu ani cheppu desaaniki Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.