snoww Posted January 29, 2021 Report Share Posted January 29, 2021 మైనర్ బాలిక ముందు ప్యాంట్ జిప్ తీయడం లైంగిక వేధింపు కాదు ‘పోక్సో’ ప్రకారం నేరం అవదు బాంబే హైకోర్టు మరో తీర్పు మైనర్ బాలిక ముందు ప్యాంట్ జిప్ తీయడం లైంగిక వేధింపు కాదు నాగ్‌పుర్: మైనర్ బాలికల చేతులు పట్టుకోవడం, వారి ముందు పురుషుడు ప్యాంటు జిప్ విప్పుకోవడం లైంగిక వేధింపు కిందికి రాదని బాంబే హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఈ నెల 15వ తేదీన తీర్పు ఇచ్చింది. బాలిక ఛాతీ భాగంపై తడమడం లైంగిక వేధింపుల కిందికి రాదని పేర్కొంటూ ఈ నెల 19న తీర్పునిచ్చిన జస్టిస్ పుష్ప గనేడీవాలాయే ఈ తీర్పు కూడా ఇవ్వడం గమనార్హం. 12 ఏళ్ల బాలిక ఛాతీ భాగాన్ని ఓ వ్యక్తి తడమగా, చర్మం...చర్మం తగలనందున దీనిని లైంగిక వేధింపు కింద పరిగణించలేమని ఆ తీర్పులో పేర్కొన్నారు. ఇది లైంగిక వేధింపుల నుంచి బాలికలను రక్షించే పోక్సో చట్టం కింద నేరం కాదంటూ ఇచ్చిన ఆ తీర్పును సుప్రీంకోర్టు నిలిపివేసిన విషయం విదితమే. ఆ వ్యక్తికి విముక్తి... అయిదేళ్ల బాలికను లైంగికంగా వేధించాడన్న ముద్దాయికి పోక్సో చట్టం కింద పడిన శిక్ష నుంచి ఈ నెల 15న కోర్టు విముక్తి కల్పించింది. ఆ బాలికను 50 ఏళ్ల లిబ్నిస్ కుజుర్ అనే వ్యక్తి లైంగికంగా వేధించినట్టు నిర్ధరించిన సెషన్స్ కోర్టు పోక్సో చట్టం కింద అయిదేళ్ల జైలు శిక్ష వేసింది. దీన్ని జస్టిస్ పుష్ప కొట్టివేశారు. పోక్సో చట్టం కింద ‘బాధితురాలి చేతుల్ని పట్టుకోవడం’, ‘ఆమె ముందు ప్యాంటు జిప్ తీయడం’ లైంగిక వేధింపుల కిందికి రావని పేర్కొన్నారు. లైంగిక వాంఛతో శారీరకంగా దగ్గరకావడాన్నే ఈ చట్టం కింద లైంగిక వేధింపులుగా పరిగణిస్తారని, అలా జరిగినట్టు ప్రాసిక్యూషన్ నిరూపించలేదని న్యాయమూర్తి తెలిపారు. బాలికను లైంగికంగా వేధించాలన్న ఉద్దేశంతోనే ముద్దాయి ఆ ఇంట్లో ప్రవేశించినట్టు నిరూపించినా, లైంగిక దాడి జరిగినట్టు రుజువు చేయలేకపోయారని అభిప్రాయడ్డారు. ఇది చాలా చిన్న నేరమని పేర్కొంటూ ఇతర సెక్షన్ల కింద అయిదు నెలల జైలు శిక్ష సరిపోతుందని తెలిపారు. ఇప్పటికే ఆ మేరకు జైలులో ఉన్నందున మళ్లీ శిక్షించాల్సిన అవసరం లేదని తీర్పులో చెప్పారు. తల్లి పనులు చేసుకుంటున్నప్పుడు ఇంట్లో ప్రవేశించిన ఆ వ్యక్తి బాలిక చేతులు పట్టుకొని, తన ప్యాంటు జిప్ తీశాడు. పక్కన పడుకోవాలని బాలికపై ఒత్తిడి తెచ్చాడు. ఆ సమయంలోనే ఇంట్లోకి వచ్చిన ఆ తల్లి దీన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. Quote Link to comment Share on other sites More sharing options...
NiranjanGaaru Posted January 29, 2021 Report Share Posted January 29, 2021 POCSO e ila undi ante no one can save kids Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.