r2d2 Posted January 30, 2021 Report Share Posted January 30, 2021 చలానా గాళ్‌ఫ్రెండ్‌ది.. కార్డేమో భార్యది భార్య కార్డుతో గాళ్‌ఫ్రెండ్ చలానా కట్టేశాడు కుర్రాడికి పెళ్లైంది.. అందాల రాశిలాంటి భార్య ఉంది. అయినా అదేం రోగమో ‘మైనే తుమ్ కో ప్యార్ కియా’ అంటూ ఇంకో అమ్మాయిని వలచాడు. బహుమతులిచ్చాడు. చాటుమాటుగా సరసాలాడాడు. అంతదాకా బాగానే ఉందిగానీ ఆమెపై వ్యామోహం ఎక్కువై భార్య క్రెడిట్ కార్డుతో గాళ్‌ఫ్రెండ్ వాహనం చలాన్లు కట్టి అడ్డంగా దొరికిపోయాడు. దుబాయ్‌లో జరిగిందీ చిత్రమైన సంఘటన. రెండ్రోజుల కిందట ఆ భార్య సెల్‌ఫోన్‌కి ఎస్ఎంఎస్ వచ్చింది. ‘మీ క్రెడిట్ కార్డుతో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లు కట్టినందుకు థ్యాంక్స్’ అని. వెంటనే హ్యాండ్‌బ్యాగ్ వెతికిచూసిందామె. కార్డు కనిపించలేదు. ఎవరో దొంగిలించారని ఆమె గుండె జల్లుమంది. వెంటనే బ్యాంకుకు ఫోన్ చేసి కార్డును బ్లాక్ చేయించింది. ఆ వెనకే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగారు వాళ్లు. వాహనం ఎవరి పేరు మీద ఉందో తనని పట్టుకోవడం పెద్దగా కష్టమేం కాలేదు పోలీసులకు. ‘నీకు ఆ కార్డు ఎక్కడిది? ఫైన్ ఎలా కట్టావ్?’ అని నిలదీశారు. ‘ఇందులో తప్పేముంది? నా బోయ్‌ఫ్రెండ్ కట్టేశాడు. అయినా మీరెందుకు నన్ను ప్రశ్నిస్తున్నారు?’ అని ఎదురు దబాయించింది ఆ అమ్మడు. ఇలా కాదనుకొని ఇద్దరినీ స్టేషన్‌కి తీసుకెళ్లి విచారణ మొదలుపెట్టారు. అప్పుడే సీన్ అందరికీ క్లియర్‌గా అర్థమైంది. తన బోయ్‌ఫ్రెండ్‌కి అప్పటిదాకా పెళ్లి కాలేదని ఆ గాళ్‌ఫ్రెండ్ అనుకుంది పాపం! ‘మీ భర్తే మీ కార్డును గాళ్‌ఫ్రెండ్ కోసం వాడాడు’ అని పోలీసులు చెప్పగానే అవాక్కైంది అర్థాంగి. ఇంట్లో ఇల్లాలు.. వంటింట్లో ప్రియురాలిలా ఒకరికి తెలియకుండా ఒకరిని మెయింటెయిన్ చేస్తున్న గురుడి బండారం మొత్తం బయటపడింది. క్రెడిట్ కార్డు హ్యాక్ అయిందని ఇల్లాలు భయపడితే ఇల్లే గుల్ల అయ్యిందని తెలుసుకుంది. ‘క్రెడిట్ కార్డు మోసం జరిగిందంటూ గతంలో ఎన్నో ఫిర్యాదులు అందుకున్నాం.. కానీ ఇలా భర్తే భార్యకు తెలియకుండా మోసం చేసిన సంఘటన మొదటిసారి చూశాం’ అంటున్నారు ఈ కేసును ఛేదించిన దుబాయ్ సైబర్ క్రైం డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ కెప్టెన్ అబ్దుల్లా ఆల్ షాహీ. Quote Link to comment Share on other sites More sharing options...
Spartan Posted January 30, 2021 Report Share Posted January 30, 2021 Dubai lo na Quote Link to comment Share on other sites More sharing options...
Picheshwar Posted January 30, 2021 Report Share Posted January 30, 2021 🤣 Quote Link to comment Share on other sites More sharing options...
Vaampire Posted January 30, 2021 Report Share Posted January 30, 2021 Rebel uncle ki manchi point dorikindi. Okka 10 threads pakka 2 Quote Link to comment Share on other sites More sharing options...
chandrabhai7 Posted January 30, 2021 Report Share Posted January 30, 2021 Aa Gf ala traffic tickets kooda kattinstundi antey Inka entha nakesindoo papam Quote Link to comment Share on other sites More sharing options...
megadheera Posted January 30, 2021 Report Share Posted January 30, 2021 2 hours ago, Spartan said: Dubai lo na Dubai lo anthe Dubai lo anthe Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.