r2d2 Posted January 30, 2021 Report Posted January 30, 2021 మా ప్రభుత్వం ఫోన్‌కాల్ దూరంలోనే: మోదీ రైతులతో చర్చలకు సిద్ధంగానే ఉన్నట్లు వెల్లడి దిల్లీ: వ్యవసాయ చట్టాలను ఏడాదిన్నరపాటు నిలిపివేసే ప్రతిపాదనకు ఇప్పటికీ కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంట్లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందు సంప్రదాయబద్ధంగా నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని ప్రభుత్వ వైఖరిని వెల్లడించారు. రైతు సంఘాలతో చర్చలకు కేంద్రం ఇప్పటికీ సిద్ధంగానే ఉందని వెల్లడించారు. ‘కేంద్రం రైతుల సమస్యను పెద్ద మనసుతో పరిశీలిస్తోందని ప్రధాని అఖిల పక్ష సమావేశంలో హామీ ఇచ్చారు. జనవరి 22న వ్యవసాయ శాఖ మంత్రి చేసిన ప్రతిపాదనకు కేంద్రం ఇప్పటికీ కట్టుబడి ఉంది. తోమర్ జీ మీతో చర్చించడానికి ఫోన్ కాల్ దూరంలో ఉంటారనే విషయాన్ని ఈ సమావేశంలో ప్రధాని మరోసారి గుర్తు చేశారు’ అని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేశారు. రైతులు, కేంద్రం మధ్య తొమ్మిది దఫాలుగా జరిగిన చర్చలు విఫలం కావడంతో.. ఏడాదిన్నర పాటు చట్టాలను నిలిపివేసే ప్రతిపాదనను కేంద్రం అన్నదాతల ముందు ఉంచింది. రైతులు మాత్రం ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. ఆ మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని పట్టుబట్టారు. చివరి దఫా చర్చలు కూడా విఫలం కావడంతో..‘బంతి మీ కోర్టులోనే ఉంది. చట్టాలు రద్దు మినహా..మేము సూచించినదానికంటే మెరుగైన ఆలోచన ఉంటే చెప్పాలి’ అని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతు సంఘాలకు సూచించారు. చట్టాల రద్దుకే పట్టుబట్టిన రైతులు.. గణతంత్ర దినోత్సవం రోజున నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ అనుమతులకు విరుద్ధంగా ఎర్రకోట దగ్గర నిరసనలు వ్యక్తం చేయడంపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు, సాగు చట్టాలపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ.. పార్లమెంట్ ఉభయసభల ప్రారంభ సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగాన్ని విపక్షాలు బహిష్కరించాయి. ప్రస్తుతం దిల్లీ శివారుల్లో రైతుల నిరసన కొనసాగుతోంది. Quote
betapilli Posted January 30, 2021 Report Posted January 30, 2021 The irony with Canada protesting against the Indian Government is that, even in Canada farmers produce is bought by companies and not by middle men. https://www.theguardian.com/world/2019/nov/18/high-debts-and-low-yields-push-canadas-farmers-to-the-brink Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.