sri_india Posted February 5, 2021 Report Posted February 5, 2021 పెనుబల్లి, న్యూస్ఖటుడే: సాఫ్ట్వేర్ ఇంజినీరుగా ఉద్యోగం. ఏడెనిమిది నెలలుగా ఇంటి దగ్గర్నుంచే పనిచేస్తున్నాడు. ఇంటికి సమీపంలోని బంధువుల అమ్మాయిపై ప్రేమవల విసిరాడు. మరోవైపు మేనమామ కుమార్తెను పెళ్లాడాడు. ఏం జరిగిందో ఏమో! చివరికి కట్టుకున్నదాన్ని కడతేర్చాడు. హత్యోందంతం బయటపడిన కాసేపటికే అతను ప్రేమ వ్యవహారం నడుపుతున్న అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టించింది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ప్రగళ్లపాడుకు చెందిన యరమల బుజ్జినాగశేషురెడ్డి సాఫ్ట్వేర్ ఇంజినీరు. ముంబయిలో ఉద్యోగం చేస్తున్నాడు. లాక్డౌన్ తర్వాత ఇంటి దగ్గర్నుంచే పనిచేస్తున్నాడు. అయ్యవారిగూడేనికి చెందిన మరదలు(మేనమామ కుమార్తె) లక్కిరెడ్డి నవ్యరెడ్డిని ఇష్టపడ్డాడు. గతేడాది డిసెంబరు 9న ఆమెను వివాహం చేసుకున్నాడు. నవ్యరెడ్డి సత్తుపల్లి మండలం గంగారంలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. ఈ నెల 2న కళాశాలకు వెళ్లేందుకు సిద్ధమైంది. ఆమెను ద్విచక్రవాహనంలో ఎక్కించుకుని కళాశాలకు బయల్దేరిన భర్త మార్గమధ్యలో పండ్లరసంలో నిద్రమాత్రలు కలిపాడు. అపస్మారక స్థితిలోకి చేరాక ఆమె చున్నీతో చెట్టుకు ఉరేశాడు. పనిచేయని ‘చావు’ తెలివితేటలు ‘ఇంజినీరింగ్‌లో బ్యాక్‌లాగ్‌లు ఉండటంతో మనస్తాపంతో తాను ఆత్మహత్య చేసుకున్నట్లు’ యువతి తండ్రికి ఆమె చరవాణి నుంచే సంక్షిప్త సందేశం పంపి ఇంటికి వెళ్లిపోయాడు. ఈ నెల 3న తన భార్య కనిపించడంలేదంటూ ఎర్రుపాలెం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. మూడు రోజులుగా వారితోనే ఉంటూ వెదుకుతున్నట్టు నటిస్తున్నాడు. దర్యాప్తు ఆరంభించిన పోలీసులు అతను చెప్పిన ఆనవాళ్ల ఆధారంగా సీసీ కెమెరాలను పరిశీలిస్తూ వెళ్లారు. ఈ నెల 2వతేదీ సాయంత్రం 3:58 గంటల సమయంలో భార్యాభర్తలు ద్విచక్రవాహనంపై పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల సమీపంలో తిరిగినట్టు అక్కడి సీసీ కెమెరాలో కన్పించడంతో బుజ్జినాగశేషురెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తానే భార్యను హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించడంతో పోలీసులు శుక్రవారం అతన్ని ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. ‘మృతదేహం కుళ్లిపోయింది. ఆమెను ఎందుకు చంపాడో నిందితుడు చెప్పలేదు’ అని వైరా ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. అమ్మాయి ఆత్మహత్యతో కలకలం ఈ హత్యోదంతం వెలుగులోకి వచ్చిన కాసేపటికే అతను ప్రేమ వ్యవహారం నడుపుతున్న యువతి(20) ప్రగళ్లపాడు సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. మృతురాలు కృష్ణా జిల్లా మైలవరంలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. పోలీసులు నిందితుని సెల్‌ఫోన్‌తోపాటు, ఈ యువతి ఫోన్‌ను కూడా తీసుకున్నట్లు తెలిసింది. దాని ద్వారా బుజ్జినాగశేషురెడ్డికి, తనకు మధ్య ప్రేమ వ్యవహారం బయటపడుతుందనే భయమే ఆమె ఆత్మహత్యకు కారణమై ఉంటుందనే అనుమానాలున్నాయి. Quote
sri_india Posted February 5, 2021 Author Report Posted February 5, 2021 inko ammayi related to same case పెనుబల్లి: ఖమ్మం జిల్లాలో భార్యను హత్య చేసిన భర్త కేసులో మరో కోణం బయటపడింది. నవ్యారెడ్డి హత్యకేసు దర్యాప్తులో ఉండగానే మరో యువతి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. హత్యోదంతం వెలుగులోకి వచ్చిక కొద్దిసేపటికి ఓ యువతి ప్రగళ్లపాడు సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఆ యువతి, నాగశేషురెడ్డి ఇద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు. నవ్యా హత్య కేసు దర్యాప్తు జరుగుతుండగానే యువతి ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసుల విచారణలో భాగంగా నిందితుడి ఫోన్‌తో పాటు యువతి చరవాణిని స్వాధీనం చేసుకున్నారు. వారిరువురి మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం బయటపడుతుందనే భయమే యువతి బలవన్మరణానికి కారణమై ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో జరిగిన దారుణం అందరినీ కలచివేసింది. పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి గ్రామంలో భార్యను భర్త హత్య చేశాడు. పెళ్లిలో రక్షణగా ఉంటానని ప్రమాణం చేసిన కట్టుకున్నవాడే భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. కొత్తలంకపల్లి గ్రామశివారులోని కుక్కలగుట్ట వద్ద ఈ విషాదం చోటు చేసుకుంది. ఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడెంకు చెందిన లక్కిరెడ్డి నవ్యారెడ్డి సత్తుపల్లి మండలం గంగారంలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. గత ఏడాది డిసెంబర్ 9న నవ్యారెడ్డికి ప్రగళ్లపాడుకు చెందిన మేనబావ యరమల నాగశేషురెడ్డితో వివాహమైంది. ఈ నెల 2న కళాశాలకు వెళ్లిన తన భార్య కనిపించడంలేదని 3న ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్లో నాగశేషురెడ్డి ఫిర్యాదు చేశాడు. ఇంతలోనే నవ్యా రెడ్డి చరవాణి నుంచి తండ్రి ఫోన్‌కి సంక్షిప్త సందేశం వచ్చింది. అందులో తనకు పరీక్షల్లో బ్యాక్‌లాగ్స్ ఉన్నాయని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఉంది. ఈ సమాచారంతో కుటుంబ సభ్యులు దుఃఖంలో మునిగిపోయారు. అనుమానంతో పోలీసులు చేపట్టిన దర్యాప్తులో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగుచూశాయి. నవ్యా రెడ్డిని భర్తే ఈ నెల 2వ తేదీన స్వయంగా ద్విచక్రవాహనంపై తీసుకువెళ్లినట్లు సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తించారు. నాగశేషురెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా తానే భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు. Quote
sri_india Posted February 5, 2021 Author Report Posted February 5, 2021 1 minute ago, Picheshwar said: this is the 3rd thread how to delete this thread bro ???? I don't see any option , please help Quote
Picheshwar Posted February 5, 2021 Report Posted February 5, 2021 1 minute ago, sri_india said: how to delete this thread bro ???? I don't see any option , please help @betapilli help Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.