Jump to content

Recommended Posts

Posted

[size=18pt]శ్రీరామదాసు, విజయేంద్రవర్మ వంటి భారీ చిత్రాలను నిర్మించిన ఆదిత్య ప్రొడక్షన్స్ అధినేత కొండా కృష్ణంరాజు తాజాగా ఏసుక్రీస్తు జీవిత చరిత్రను ఆధారం చేసుకుని ఓ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మలయాళం - నాలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు.

తెలుగు, మలయాళ భాషల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ ముఖ్యమైన భూమిక పోషిస్తున్న ఈ చిత్రం ఇటీవల ఇజ్రాయెల్‌లోని జెరూసలేంలో షూటింగ్ ప్రారంభించుకున్న విషయం విదితమే. జె.కె. భారవి రచన సమకూరుస్తున్న ఈ చిత్రానికి సంచల సంగీత కెరటం దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తుండటం విశేషం.

ఇప్పటివరకు దక్షిణభారత చిత్రాలకు సంగీతం అందించిన దేవీశ్రీప్రసాద్ తొలిసారి ఈ చిత్రం ద్వారా హాలీవుడ్‌లోనూ, బాలీవుడ్‌లోనూ ప్రవేశిస్తుండటం విశేషం. ప్రపంచంలో అత్యధికులు పూజించే దేవుడైన ఏసుక్రీస్తు చిత్రం ద్వారా హాలీవుడ్‌లో అడుగుపెట్టడం ఆయన కెరీర్‌లో ఓ మలుపుగా చెప్పుకోవచ్చు. ఇంగ్లీషు, హిందీ, తెలుగు, మలయాళం భాషల్లో దేవిశ్రీ మధురమైన బాణీలను అందిస్తున్నారని కొండా కృష్ణంరాజు గురువారం పత్రికల వారికి తెలిపారు.[/size]

×
×
  • Create New...