r2d2 Posted February 11, 2021 Report Posted February 11, 2021 అపరిచితుడు సినిమా చూసే ఉంటారుగా..! అందులో నటుడు విక్రమ్ పోషించిన రామానుజం పాత్రలోకి తరచూ రెమో.. అపరిచితుడు వచ్చిపోతుంటారు. దీన్నే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అని అంటారు. నిజ జీవితంలోనూ ఇలాంటి డిజార్డర్ ఉన్న వ్యక్తులు ఉన్నారు. అయితే, ఇటీవల ఇలాంటి వ్యాధితో ఓ యువతి వార్తల్లోకెక్కింది. తనలో 25 మంది విభిన్న వయసులు, వ్యక్తిత్వాలున్న మనుషులు ఉన్నట్లు చెబుతోంది. యూకేలోని డెవన్‌లో నివసిస్తున్న 23ఏళ్ల బూ హూపర్ 25 మందిలా ప్రవర్తిస్తుంటుంది. ఒకసారి ట్రాసీ పేరుతో టీనేజి అమ్మాయిలా.. మరోసారి లేలా పేరుతో ఐదేళ్ల చిన్నారిలా.. ఇంకోసారి టెక్సాస్ పేరుతో మధ్య వయస్కురాలిగా ఇలా 25 రకాలుగా ప్రవర్తిస్తోందట. వారిలో 13 ఏళ్ల అబ్బాయి కూడా ఉన్నాడట. ఎప్పుడు, ఎవరిలా ప్రవర్తిస్తానో తనకే తెలియదని హూపర్ అంటోంది. ఆ 25 మందికి వేషధారణ, ఆహార అలవాట్లు, మాట్లాడే తీరు వేర్వేరుగా ఉన్నాయని వెల్లడించింది. తను టీనేజిలో ఉన్నప్పుడే తనలో వేర్వేరు వ్యక్తులు ఉన్నట్లు గుర్తించిందట. వారి గురించి తెలుసుకోవడానికి చాలా సమయం పట్టిందని చెప్పుకొచ్చింది. వైద్యులు ఆమెకు డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ ఉన్నట్లు తేల్చారు. ట్రామాకు గురవ్వడం వల్ల ఇలా జరుగుతోందని చెప్పారు. హూపర్‌కు ఇలాంటి వ్యాధి ఉండటంతో తను ఎక్కడికికీ వెళ్లలేకపోతోంది. ఉద్యోగానికి కూడా వెళ్లడానికి వీల్లేకుండా పోతోందని వాపోతోంది. హూపర్ తనలోని వ్యక్తుల అభిరుచులకు తగ్గట్టుగా ముస్తాబవుతూ ఉంటుందని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ వ్యాధి నయమవడం కోసం వైద్యులు, కుటుంబసభ్యులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. Quote
Samara Posted February 11, 2021 Report Posted February 11, 2021 idi ee kalam indian wives ki common quality ee ga 1 Quote
Shameless Posted February 11, 2021 Report Posted February 11, 2021 @r2d2...aa title endhi bhayya...nenu inkedho anukunna... Quote
r2d2 Posted February 11, 2021 Author Report Posted February 11, 2021 15 minutes ago, Shameless said: aa title endhi bhayya blame it on Eenaadu.. Quote
MiryalgudaMaruthiRao Posted February 11, 2021 Report Posted February 11, 2021 22 minutes ago, Shameless said: @r2d2...aa title endhi bhayya...nenu inkedho anukunna... @Shameless Quote
quickgun_murugun Posted February 11, 2021 Report Posted February 11, 2021 WTF is wrong with Telugu media ? maa title endi ? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.