r2d2 Posted February 19, 2021 Report Posted February 19, 2021 యద్ధనపూడి, యండమూరి.... ఒక తమిళ కథ! Starwar on 'Novel' Plagiarism - Part 1 --------------------------------------- ఈ సినిమా పేరు: యద్ధనపూడి, యండమూరి, ఒక తమిళ అనువాదం. 20 సంవత్సరాల క్రితం జరిగిన వివాదమిది. ‘జనహర్ష’ రమణమూర్తి గారి సంపాదకత్వంలో వచ్చిన ‘విజయ విహారం’ మాస పత్రికలో 20 నెలలు పని చేశాను. 2000 సంవత్సరం విజయ విహారం ఏప్రిల్ సంచికలో యండమూరి, యద్ధనపూడి, కొమ్మనాపల్లి, సూర్యదేవర రామ్ మోహనరావులతో నేను చేసిన ఇంటర్వ్యూలు, వివాదం వివరాలు పబ్లిష్ అయ్యాయి. అప్పుడు ప్రచురించిన వాటిని యథాతథంగా ఇక్కడ ఇస్తున్నా. ముందస్తు సంజాయిషీ: ఇది ఆసక్తికరమైన సమాచారం. కేవలం కరోనా కాలక్షేపం. గతజలసేతు బంధనమే తప్ప, యండమూరిగారి మీద కోపమో, వ్యతిరేకతో నాకు ఉండాల్సిన అవసరమే లేదు. ఇదీ విజయ విహారం రిపోర్టు: తమిళంలో యండమూరి పేరుతో యద్దనపూడి నవలలు తప్పునాది కాదంటున్న యండమూరి, కోర్టుకెక్కనున్న సులోచనారాణి ఒక చిత్రమైన వివాదం తెలుగు రచయితలు, పాఠకుల్లో క్రమంగా చర్చగా మారుతోంది. పేరున్న రచయితలు, గొడవ గ్రంథ చౌర్యంపై కావడంతో ఈ చినుకులూ చిరుగాలీ తుఫానుగా మారే ప్రమాద సూచన కనడుతోంది. ఈ వివాదం ప్రధానంగా యండమూరి వర్సెస్ యద్దనపూడి సులోచనా రాణి, కొమ్మనాపల్లి గణపతిరావు, సూర్యదేవర రామ్మోహన్ రావు. వారి నవలలు తమిళంలోకి అనువదించి వీరేంద్రనాథ్ డబ్బు మూటగట్టుకున్నారని ఆరోపణ. యద్దనపూడి, కొమ్మనాపల్లి, సూర్యదేవరలు కలిసికట్టుగా కోర్టుకెక్కే ప్రయత్నం చేస్తున్నారు. వాయుగుండం ఏర్పడినట్టే. అయితే ఇంతమంది స్టార్ రైటర్స్‌ని తలదన్నే తెరవెనుక స్టార్ పేరు సుశీలా కనకదుర్గ. తమిళంలోకి అనువాదం చేసుకున్నదీ, డబ్బు తిన్నదీ ఆమేనని యండమూరి అంటున్నారు. ఆమె లేనే లేదు. కనకదుర్గ అనే మహిళ యండమూరి కల్పనా చాతుర్యమనీ, ఆయనే అసలుసిసలు దొంగ అనీ కొమ్మనాపల్లి ఎదురుదాడికి దిగుతున్నారు. ఇక తుఫాను తప్పేట్టు లేదు. అసలిది వివాదమే కాదనీ, తన తప్పేమీ లేదనీ, వుంటే నిరూపించుకోండనీ యండమూరి ధీమాగా సవాల్ చేస్తున్నారు. అతనికి శిక్షపడాలి. నా కష్టార్జితం నాకు రావాలి అని సులోచనారాణి పట్టుబడుతున్నారు. అందరూ రచయితలే. తెలివి ప్రధానాస్త్రంగా బరిలోకి దిగుతున్నారు. గేమ్ పర్‌ఫెక్ట్‌గా ఆడటానికి ఊహాశక్తిని జోడిస్తున్నారు. వీరేంద్రనాథ్ ఈ ముప్పేట దాడిని తట్టుకుని నిలబడగలరా? ఇందులో మనం ఎవరి పక్షం వహించాల్సిన పనీలేదు. నిర్మమకారంగా అందరి అభిప్రాయాలూ యిక్కడ ఇస్తున్నాం. ఈ తమిళ అనువాద సినిమా క్లైమాక్స్ ఎలా ఉంటుందో అంతా ఆ కనకదుర్గ దయ. Dont jump into conclusions, after all, you have nothing to loose. 'వి' ఫర్ విజయమూ, వివాదమూ! యండమూరికిపుడు 51 ఏళ్ళు. 1968 లో తొలి కథ 'ముసురు పట్టిన రాత్రి' ఆంధ్రప్రభలో వచ్చింది. 1972-79 మధ్య కుక్క, రుద్రవీణ నాటికలు ఆంధ్రదేశాన్ని వూగించాయి. 'రఘపతి రాఘవ రాజారాం' నాటకానికి 1984 లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. తొలినవల 'రుషి' 1977లో స్వాతిలో వచ్చింది. 1980లో తొలి అణుబాంబు పేలుడు - తులసీదళం - తెలుగు పాఠక జన హృదయాల్ని భస్మీపటలం చేసింది. మృణాల్ సేన్ ఒక వూరి కథ, చిరంజీవి 'మంచుపల్లకి' సినిమాలకి సంభాషణలు రాశారు. మెగాహిట్ జగదేకవీరుడు అతిలోకసుందరికి స్క్రీన్ ప్లే రాశారు. ఇప్పుడు చిరంజీవి 'మృగరాజు' కి స్క్రీన్ ప్లే రాస్తున్నారు. రెండు సినిమాలకి దర్శకత్వం వహించి అట్టర్ ఫ్లాప్ అయ్యారు. 1996 పడమటి కోయిల పల్లవి' గేయ సంకలనం ప్రచురించారు. దూరదర్శన్లో వచ్చిన 'వెన్నెల్లో ఆడపిల్ల' సీరియల్కి తానే దర్శకత్వం వహించి, 1997 లో ఉత్తమ దర్శకునిగా 'నంది' అవార్డు పొందారు. 'విజయానికి అయిదుమెట్లు' తో వ్యక్తిత్వ వికాసం వైపు మొగ్గారు. నవల్సూ, సీరియళ్ళూ పక్కన పెట్టి పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రధానాంశంగా 'MINDPOWER' - నంబర్ వన్ అవ్వడం ఎలా? అనే పుస్తకాల పరంపర రాయడానికి సిద్ధమౌతున్నారు. వీటిని వెంటనే కన్నడంలోకి అనువదించి, విడుదల చేయడానికి నవసాహితి బుక్ హౌస్ ఏర్పాట్లు చేసింది. ఘోస్టు రచయితల్ని పెంచి పోషించారన్నది పాత ఆరోపణ. 'జ్యోతి' వ్యవహారంతో సహా యండమూరికి వివాదాలేమీ కొత్తకాదు. గ్రంథ చౌర్యం అన్నది మాత్రం ఆషామాషీ విషయం కాదు. కాకినాడకు చెందిన యండమూరి ఆంధ్ర, కర్నాటకల్లో పెద్దరచయిత. తమిళంలో తెలిసో తెలియకో తెలీదుగానీ-స్టార్ రైటర్. మళయాళంలో వీరేంద్రనాథ్ వి నాలుగు నవలలు వచ్చాయి. కథ, నవల, సీరియల్, కవిత్వం, నాటిక, నాటకం, దర్శకత్వం, స్క్రీన్ ప్లే, సంభాషణలు -యిన్ని రంగాల్లో అసాధారణమైన ప్రతిభ కనబరిచిన తెలుగు రచయితలు అరుదు. విజయశిఖరం మీద నిలిచిన వివాదాస్పద ప్రతిభామూర్తి వీరేంద్రనాథ్ అతనికి శిక్ష పడాలి నా డబ్బు నాకు రావాలి యద్దనపూడి సులోచనారాణి ప్రతి తెలుగు ఇంటా తెలిసిన పేరు. పుస్తకాలు చదివే అలవాటుని విపరీతంగా పెంచిన రచయిత్రి. తెలుగు యువతీ యువకుల్ని పాతికేళ్ళపాటు తన కథలు, నవలలతో ప్రభావితం చేసి, కొండొకచో పిచ్చివాళ్ళనూ చేసి రాణించిన ఘటికురాలు. తన ఇంటి గదిలో తనమానాన తాను కూర్చుని తలొంచుకుని బుద్ధిగా రాసిన నవలలతో రాష్ట్రంలో ప్రేమతుఫానులు, కలల భూకంపాలు సృష్టించి ప్రతి తెలుగింటి ముంగిటా నందివర్ధనమై పరిమళించిన మహారచయిత్రి, పత్రికలూ, పబ్లిషర్లూ, సినీ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన కనకమాలక్ష్మీదేవి. ప్రేమ బెంగ పెట్టుకున్న మధ్యతరగతి ఆడపిల్లకి కలలో కైనా రాజశేఖరాన్నీ, పడవకారు పల్లకిని పంపిన స్వాప్నికురాలు సులోచనారాణి. అద్దె పుస్తకాల షాపులకీ, లెండింగ్ లైబ్రరీలకీ దైవమిచ్చిన రచయిత్రి. అనేకమంది ఇంటర్మీడియట్, డిగ్రీ పరీక్షల్ని పాడుచేసింది యద్దనపూడే. సులోచనారాణి ఇప్పటికి 60 నవలలూ. 30 కథలు రాశారు. ఆగమనం, ఋతురాగాలూ టీవీ సీరియల్స్ ప్రజాదరణ పొందాయి. ఏ నవల Magnum opus? అనడిగితే, "అన్నీ యిష్టంలో రాస్తాను. నాకన్నీ ఒక్కలాగే వుంటాయి" అని వినయంగా చెప్పారు. మార్చి 24 హైదరాబాద్ సోమాజిగూడలోని తన యింట్లో విజయవిహారం' ప్రతినిధి తాడి ప్రకాశ్‌కి సులోచనారాణి ఇంటర్వ్యూ యిస్తూ "రేపు అమెరికా వెళ్తున్నాను. అక్కడ మా అమ్మాయి వుంది. అయిదునెలలు అక్కడే ఉంటాను" అని చెప్పారు. తెలుగు వాళ్ళు గర్వంగా చెప్పుకునే ఈ రచయిత్రి పుస్తకాలు 26 కి పైగా తమిళంలోకి అనువాదం అయ్యాయని, పైగా వాటిని సుశీల కనకదుర్గ, యండమూరి వీరేంద్రనాథ్ రాసినట్టుగా వాళ్ళ పేర్లతో వెలువడ్డాయని తెలిసి సులోచనారాణి అవాక్కయ్యారు. విషయం తెలిసిన సంవత్సరం తర్వాత ఈ అక్రమాన్ని వ్యతిరేకిస్తూ, న్యాయం కావాలని కోరుతూ ఆమె కోర్టుకి ఎక్కబోతున్నారు. ఆ సందర్భంగా యుద్దనపూడి మాట్లాడుతూ, "తలొంచుకుని నా పనేదో నేచేసుకుపోయేదాన్ని వూరుకుంటే చాతగాని తనం అవుతుంది. సాహిత్యానికి చీడపట్టినట్టు అనిపించింది. ఈ అంశంపై పోరాడటం నా బాధ్యత ఆనుకున్నాను. యండమూరి వీరేంద్రనాథ్ తానే వచ్చి చెపుతాడేమోనని Expect చేశాను. ఆయన గొయ్యి ఆయనే తవ్వుకున్నాడు. కొంచెం కూడా నన్ను care చేయలేదు. ప్రకాశ్: ఏ ఉద్దేశంతో మీరీపని చేస్తున్నారు? (కేసు పెట్టడం గురించి) యద్దనపూడి: తప్పంతా బయట పడాలి. చేసిన వాళ్ళకు శిక్షపడాలి. ప్రకాశ్: మీ లక్ష్యం ? యద్దనపూడి:న్యాయం జరగాలి. ఆ పుస్తకాలు నావి. అలా చేసినందుకు శిక్షపడాలి. ప్రకాశ్: పారితోషికంగా రావాల్సిన డబ్బుమీకు అవసరం లేదా? యద్దనపూడి: నా డబ్బు నాకు రావాలి. తప్పుచేసిన వాళ్ళు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ప్రకాశ్: అలా క్షమాపణ చెపితే మీడబ్బు మీరు వదులుకోడానికి సిద్ధంగా వున్నారా? యద్దనపూడి: నో, అది నా కష్టార్జితం. ప్రకాశ్: మీ అనుమతితో మీ పుస్తకాలేమైనా తమిళంలో వస్తున్నాయా? యద్దనపూడి:'జీవన తరంగాలు' నవలను గౌరీ కృష్ణానంద అనువదించారు. నాకు రెమ్యునరేషన్ కూడా పంపించారు. ప్రకాశ్:మీ నవలల్ని తమిళంలోకి యండమూరే అనువదింపజేశారనడానికి మీ దగ్గర రుజువులున్నాయా? యద్దనపూడి: నా పుస్తకాలు, యండమూరి పేరుతో తమిళంలో అచ్చయ్యాయి. ఆయన్నే prove చేసుకోమనండి. ప్రకాశ్: మీ నవలల్ని తన పేరుతో వేసుకోవాల్సిన అవసరం యండమూరికి వుందంటారా? యద్దనపూడి: అతని అవసరం ఏంటో మాకు తెలీదు. అతను ఇన్నోసెంట్ అయితే ఆ విషయం పబ్లిక్ గా ఎందుకు చెప్పడు? తెలుగు సాహిత్యంలో ఎన్నడూ యిలా జరగలేదు. యిదే మొదటిసారి, పిచ్చి స్టేట్ మెంట్లు యిచ్చి అతనే యిదంతా కొని తెచ్చుకున్నాడు. అతనే గనక తప్పు ఒప్పుకుంటే, రచయితలంతా కలిసి ఎలా డిసైడ్ చేసేవారో మరి? * * * ఈ సీరియల్ మొత్తం నాలుగు పార్టులు. రేపు: కొమ్మనాపల్లి కంప్లయింట్. ఎల్లుండి: 1. కనకదుర్గ ఎవరు? 2. సూర్యదేవర ఫిర్యాదు. Quote
r2d2 Posted February 19, 2021 Author Report Posted February 19, 2021 Trendsetter in modern Plagiarism-Part 2 By Taadi Prakash --------------------------------------------------- అని వైశంపాయనుడు శౌనకాది మహామునులతో చెప్పిన కథా సంవిధానమేమన.... అంటూ ఈజీగా, కాలం చెల్లిన బుర్రకథా కాలక్షేపం చేయబోతే, జనం మాత్రం బాగా సీరియస్ అయ్యారు. యండమూరి ‘అంతర్ముఖం’ నవల ఆల్బర్ట్ కామూ Outsider కి కల్తీలేని కాపీ కాదా? అలెగ్జాండర్ డ్యూమా రాసిన ‘కౌంట్ ఆఫ్ మాంటో క్రిస్టో’ నవలని ‘చెంగల్వ పూదండ’ చేసి అమ్ముకోలేదా? అదే కదా చిరంజీవి ‘వేట’ సినిమా! యండమూరి సంచలన నవల- తులసీ దళం Blatty రాసిన Exrocistకి మక్కికి మక్కీ కాదా? తుమ్మల వెంకట్రామయ్యగారు ఈ విషయం నాటి విశాలాంధ్ర సాహిత్య పేజీలో ప్రచురించలేదా? ‘‘బయటివాళ్ల రచనలు తన పేరుతో తెలుగులో వేసుకున్నపుడు, ఇతర భాషల్లో పక్క రచయితలవి తన పేరుమీద వేసుకోవడం తప్పెలా అవుతుంది? పేరు రావడం కదా ముఖ్యం’’ అంటూ ఓ మిత్రుడు వెటకారాలు పోయాడు. అంచేత యండమూరి ఒక వ్యక్తి కాదనీ, నిఖార్సయిన ఒరిజినల్ తమిళ్ జిరాక్స్ సెంటర్ అనే సామూహిక శక్తిగా గుర్తించాలనీ ఫేస్ బుక్ వర్గాలు డిమాండు చేస్తున్నాయి. అయితే తర్జుమా అనే ఈ తెలుగు నాటకాన్ని తమిళనాట విజయవంతంగా ఆడించింది నిజంగా యండమూరేనా? ఇటు నవలలు, సీరియళ్లూ, నాటకాలూ, స్క్రీన్ ప్లేలు, సినీ దర్శకత్వాలూ.... ఇన్ని పనులు చేస్తూ- వ్యక్తిత్వ వికాస విస్తరణాభిలాషతో ఆతృతపడుతున్న వేళ... ‘సృజనాత్మకత’ అనేది ఎక్కడ నుంచి తీసుకురావాలో మీరే చెప్పాలి! పోనీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ నే తీసుకోండి! సినిమా వెంట సినిమా... తీయాల్సిందే. హిట్టు తర్వాత హిట్టు... కొట్టాల్సిందే. అప్పుడు ‘మీ... నా....’ అనే తరతమ భేదం లేకుండా ‘అ ఆ’ల నుంచి మొదలుపెట్టాల్సిందే కదా! నా అభిమాన రచయిత్రి యద్ధనపూడి సులోచనారాణి చెవిలో ఒక మాట వేశానన్నారుగా తివిక్రమ్! యండమూరి, త్రివిక్రమ్ అనే బ్లాక్ బస్టర్ మైండ్ సెట్ వాళ్లకి కమర్షియల్ కంపల్షన్ అనేది ఒకటి ఉంటుంది కదా! కొండొకచో... జిజ్ఞాసులకు అజ్ఞాతవాసం తప్పకపోవచ్చు కూడాను. అస్సలు అర్థం చేసుకుచావరేం! సరే, విజయ విహారంలో నాటి కొమ్ములు తిరిగిన రచయిత కొమ్మనాపల్లి ఏం చెప్పారో వినండి: * * * కొమ్మనాపల్లి గణపతిరావు తెలుగులో స్టార్ రైటర్. కొద్దికాలంలోనే పెద్ద పేరు సాధించిన అతి కొద్దిమందిలో ఒకరు. విషయం మీద పట్టు, పూర్తి అవగాహన, పాఠకులని అరెస్ట్ చేసే ప్రతిభాన్వితమైన రేసీ స్టయిల్.. వయసు 50 ఏళ్లు. ఊరు విశాఖజిల్లా తుంపాల. 1981లో తొలి నవల, పడిలేచే కడలి తరంగం, ప్రభలో సీరియల్ గా వచ్చింది. ఇప్పటిదాకా మొత్తం 42 నవలలు రాశారు. 32 సినిమాలకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే రాశారు. మొండి మొగుడు - పెంకి పెళ్ళాం, కలెక్టర్ గారి అబ్బాయి. శ్రీవారంటే మావారే సినిమాలకు కథలు రాశారు. 'గాయం'కి మాటలు రాశారు. సత్తావున్న రచయితగా పేరు పొందారు. రచనా వ్యాసంగంలో యింతగా నిమగ్నమైనా హెచ్.ఎం.టి.లో మేనేజర్‌గా ఉద్యోగం చేస్తూనే వున్నారు. ఇటు సినిమాలు, అటు నవలలు మరో పక్క ఉద్యోగ ధర్మం - A very busy man, writer and employee all the day. తమిళంలోకి నవలల చౌర్యం వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు కొమ్మనాపల్లి. అంతుతేల్చే సన్నద్ధత ఆయన మాటల్లో, పనుల్లో కన్పిస్తోంది. విజయవిహారం ప్రతినిధి తాడి ప్రకాశ్‌తో అమీర్ పేటలోని ఆయన యింట్లో సమగ్రంగా, నీళ్ళు నమలడాలూ, కాళ్ళు తడబడ్డాలూ లేకుండా, ఆవేశంగా, Point blank గా మాట్లాడారు. యండమూరి కణతకి గురి పెట్టిన తుపాకీని దించనంటున్నారు. కొమ్మనాపల్లి గణపతిరావు వాదనను ఆయన మాటల్లోనే చదవండి: సులోచనారాణి యద్దనపూడి సులోచనారాణి నాకు అత్తగారు. ఎందుకంటే ఆమె ప్రతి హీరోయిన్నీ నేను ప్రేమించాను. పాఠకుల్లో పఠనాసక్తిని పెంచిన యద్దనపూడి అంటే నాకు అభిమానం. ప్రపంచాన్ని అంతగా ఆకట్టుకోగలిగిన యద్దనపూడిది చాలా చిన్న ప్రపంచం. ఒక క్రిమినల్ (యండమూరి)ని క్షమించడం కోసం ఆర్నెల్లు టైమ్ తీసుకుంది. తానే వచ్చి చేసిన తప్పుడు పనికి క్షమాపణ వేడుకుంటాడేమోనని ఆమె నిరీక్షించింది. ఒక గొప్ప రచయిత్రి హుందాగా ప్రవర్తించింది. ఇప్పుడామె రాజీలేని పోరాటానికి సిద్ధమైంది. చౌర్యం... చౌర్యం ... సులోచనారాణిగారివి 26 నవలలు తమిళంలో వచ్చాయి. నావి అయిదు నవలలు - గణపతి, మిస్ మేనక, ఐ.పి.ఎస్., గ్రాండ్మాస్టర్, అగ్నిహోత్రుడు - తమిళంలో అచ్చేసుకున్నారు. సూర్యదేవర రామ్మోహనరావు 'మోడల్ నీ తస్కరించారు. సుశీలా కనకదుర్గ, వీరేంద్రనాథ్ పేరుమీద తమిళంలో మొత్తం 93 పుస్తకాలు వచ్చాయి. చివరికి చనిపోయిన చివుకుల పురుషోత్తంగారి నవల 'మూడో పురుషార్ధం" కూడా తమిళంలో తెచ్చేశారు. ఆ తమిళ నవలల మీద A Social Novel by Yandamuri, translated by Suseela kanakadurga అని వుంటుంది. క్షుద్రనవలలు రాసినవాడి బ్రెయిన్ కూడా క్షుద్రంగా మారింది. యండమూరి వీరేంద్రనాథే గనక లేకపోతే మేమంతా ఆడవాళ్ళ పేర్లు పెట్టుకుని నవలలు రాసుకునే పరిస్థితి దాపురించేది. మగాళ్ళ పేర్లతోనూ నవలలు రాసి హిట్టు కొట్టవచ్చని నిరూపించిన వాడు యండమూరి. Wonderful writer. I love him. Trend Setter. ఒక శకానికి ఆద్యుడు. ఆయనకి కాపీ కొట్టే ఖర్మేంటి? అనుకున్నాను. 1993లో నైవేలీ మంచి ఒక మిత్రుడు ఫోన్ చేసి, నీ శిలాశాసనం నవల తమిళంలో యండమూరి పేరుతో వస్తోంది అని చెప్పాడు. నమ్మలేకపోయాను. యండమూరికి ఫ్రెండ్లీగా ఫోన్ చేసి అడిగాను. అంత తప్పే గనక నేను చేస్తే కోర్టులో కేసు పెట్టు అన్నాడు వీరేంద్రనాథ్. నేను చాలా నొచ్చుకున్నాను. ఒక మంచి రచయితని అవమానించానని బాధపడ్డాను. ఆ నమ్మకం ఆరేళ్ళ తర్వాత వమ్మయింది. సాహిత్యానికి యింత నీచస్థితి దాపురిస్తుందని ఎవరూ వూహించి వుండరు. వీరేంద్రనాథ్ వల్ల యింత కళంకం వచ్చింది. తమిళం రాకుండా తమిళంలో కూడా తాను రచయితనని ఎలా చెప్పుకోగలడు? వీరేంద్రనాథ్‌ని మొదట్లో మార్గదర్శకుడనుకున్నాం. ఇలా దుర్మార్గ దర్శకుడయ్యాడు. రుష్యత్వం రావాల్సిన చోట క్షుద్రత్వం వచ్చింది. సుశీలా కనకదుర్గ నవలా చౌర్యంలోకి ఇది వీరేంద్రనాథ్ ప్రవేశ పెట్టిన పాత్ర. అసలు సుశీలా కనకదుర్గ అంటూ ఎవరూ లేరు. వున్నది వీరేంద్రనాథ్ ఒక్కడే. అతను సమర్ధుడైన రచయిత. పాత్రల్ని సృష్టించవచ్చు. కానీ పాత్రల్ని సృష్టించే మాలాంటి రచయితల్తో ఆడుకోకూడదు. నిజంగా సుశీలా కనకదుర్గ అనే అనువాదకురాలే వుంటే బైటకి తీసుకు రమ్మనండి. ఇది `అపవాదు' అని యండమూరి గనక అనుకుంటే, మా సహాయమూ తీసుకోవాలి. అందరం కనకదుర్గ కోసం వెదుకుదాం. నిజం బైట పెడదాం. అతనందుకు సిద్ధమేనా? కనకదుర్గ మీ పారితోషికాలు వాడుకుందనీ, పేదరాలనీ, పుట్టు చెవిటి, వికలాంగురాలనీ యండమూరి అంటున్నాడు. మహా అయితే ఆమెని జైలుకి పంపగలరు అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. . వీరేంద్రనాథ్ నంబర్‌వన్ పొజీషన్ అతన్ని యీ స్థితికి దిగజార్చింది. విజయానికి అయిదు మెట్లు ఏమిటో తెలుసా? 1.ఇతరుల నవలల్ని నీ పేరుమీద అచ్చేయ్! 2.అవి ఒకావిడెవరో అనువదించిందని నెపం `ఆమె` మీదికి నెట్టెయ్. 3.చెక్కులూ, డీడీలు నొక్కెయ్. 4.దమ్ముంటే నిరూపించండి అని సవాల్ చెయ్. 5.కోర్టుకెక్కండి, రుజువులు చూపించండి అని నిర్దోషిత్వం నటించెయ్. పతనానికి పదిమెట్లు బోయవాడు వాల్మీకి అయ్యాడు. వాల్మీకి అయిన యండమూరి మాత్రం మళ్ళీ బోయవాడయ్యా డు. శిఖరాగ్రానికి చేరుకున్నాక యిక ఎక్కడానికి మెట్లుండవు. ఇక్కడ పతనానికి మెట్లు లేవు. పడిపోడానికి లోయ తప్ప! యద్దనవూడి లాంటి గౌరవప్రదమైన రచయిత్రిని హింసించాడు. సుశీలా కనకదుర్గ ముసుగులో లక్షలు ఆర్జించాడు. ఇక యండమూరిని నేను క్షమించలేను. Spare చెయ్యను. అంతం ఏ ప్రజల ముందు సగర్వంగా తెలుగు రచయితలుగా బతికామో. మా సమాధుల మీద ఆ ప్రజలే ఉమ్మేసే విధంగా చేయకూడదు. ఒక నీచ సంస్కృతికి ఇది ప్రారంభం కాకుండా వుండడం కోసం ఇదే ముగింపుగా చేయాలనుకుంటున్నాం. దానికి అందరి సహకారమూ కావాలి. Quote
yskokila Posted February 19, 2021 Report Posted February 19, 2021 1 hour ago, r2d2 said: యద్ధనపూడి, యండమూరి.... ఒక తమిళ కథ! Starwar on 'Novel' Plagiarism - Part 1 --------------------------------------- ఈ సినిమా పేరు: యద్ధనపూడి, యండమూరి, ఒక తమిళ అనువాదం. 20 సంవత్సరాల క్రితం జరిగిన వివాదమిది. ‘జనహర్ష’ రమణమూర్తి గారి సంపాదకత్వంలో వచ్చిన ‘విజయ విహారం’ మాస పత్రికలో 20 నెలలు పని చేశాను. 2000 సంవత్సరం విజయ విహారం ఏప్రిల్ సంచికలో యండమూరి, యద్ధనపూడి, కొమ్మనాపల్లి, సూర్యదేవర రామ్ మోహనరావులతో నేను చేసిన ఇంటర్వ్యూలు, వివాదం వివరాలు పబ్లిష్ అయ్యాయి. అప్పుడు ప్రచురించిన వాటిని యథాతథంగా ఇక్కడ ఇస్తున్నా. ముందస్తు సంజాయిషీ: ఇది ఆసక్తికరమైన సమాచారం. కేవలం కరోనా కాలక్షేపం. గతజలసేతు బంధనమే తప్ప, యండమూరిగారి మీద కోపమో, వ్యతిరేకతో నాకు ఉండాల్సిన అవసరమే లేదు. ఇదీ విజయ విహారం రిపోర్టు: తమిళంలో యండమూరి పేరుతో యద్దనపూడి నవలలు తప్పునాది కాదంటున్న యండమూరి, కోర్టుకెక్కనున్న సులోచనారాణి ఒక చిత్రమైన వివాదం తెలుగు రచయితలు, పాఠకుల్లో క్రమంగా చర్చగా మారుతోంది. పేరున్న రచయితలు, గొడవ గ్రంథ చౌర్యంపై కావడంతో ఈ చినుకులూ చిరుగాలీ తుఫానుగా మారే ప్రమాద సూచన కనడుతోంది. ఈ వివాదం ప్రధానంగా యండమూరి వర్సెస్ యద్దనపూడి సులోచనా రాణి, కొమ్మనాపల్లి గణపతిరావు, సూర్యదేవర రామ్మోహన్ రావు. వారి నవలలు తమిళంలోకి అనువదించి వీరేంద్రనాథ్ డబ్బు మూటగట్టుకున్నారని ఆరోపణ. యద్దనపూడి, కొమ్మనాపల్లి, సూర్యదేవరలు కలిసికట్టుగా కోర్టుకెక్కే ప్రయత్నం చేస్తున్నారు. వాయుగుండం ఏర్పడినట్టే. అయితే ఇంతమంది స్టార్ రైటర్స్‌ని తలదన్నే తెరవెనుక స్టార్ పేరు సుశీలా కనకదుర్గ. తమిళంలోకి అనువాదం చేసుకున్నదీ, డబ్బు తిన్నదీ ఆమేనని యండమూరి అంటున్నారు. ఆమె లేనే లేదు. కనకదుర్గ అనే మహిళ యండమూరి కల్పనా చాతుర్యమనీ, ఆయనే అసలుసిసలు దొంగ అనీ కొమ్మనాపల్లి ఎదురుదాడికి దిగుతున్నారు. ఇక తుఫాను తప్పేట్టు లేదు. అసలిది వివాదమే కాదనీ, తన తప్పేమీ లేదనీ, వుంటే నిరూపించుకోండనీ యండమూరి ధీమాగా సవాల్ చేస్తున్నారు. అతనికి శిక్షపడాలి. నా కష్టార్జితం నాకు రావాలి అని సులోచనారాణి పట్టుబడుతున్నారు. అందరూ రచయితలే. తెలివి ప్రధానాస్త్రంగా బరిలోకి దిగుతున్నారు. గేమ్ పర్‌ఫెక్ట్‌గా ఆడటానికి ఊహాశక్తిని జోడిస్తున్నారు. వీరేంద్రనాథ్ ఈ ముప్పేట దాడిని తట్టుకుని నిలబడగలరా? ఇందులో మనం ఎవరి పక్షం వహించాల్సిన పనీలేదు. నిర్మమకారంగా అందరి అభిప్రాయాలూ యిక్కడ ఇస్తున్నాం. ఈ తమిళ అనువాద సినిమా క్లైమాక్స్ ఎలా ఉంటుందో అంతా ఆ కనకదుర్గ దయ. Dont jump into conclusions, after all, you have nothing to loose. 'వి' ఫర్ విజయమూ, వివాదమూ! యండమూరికిపుడు 51 ఏళ్ళు. 1968 లో తొలి కథ 'ముసురు పట్టిన రాత్రి' ఆంధ్రప్రభలో వచ్చింది. 1972-79 మధ్య కుక్క, రుద్రవీణ నాటికలు ఆంధ్రదేశాన్ని వూగించాయి. 'రఘపతి రాఘవ రాజారాం' నాటకానికి 1984 లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. తొలినవల 'రుషి' 1977లో స్వాతిలో వచ్చింది. 1980లో తొలి అణుబాంబు పేలుడు - తులసీదళం - తెలుగు పాఠక జన హృదయాల్ని భస్మీపటలం చేసింది. మృణాల్ సేన్ ఒక వూరి కథ, చిరంజీవి 'మంచుపల్లకి' సినిమాలకి సంభాషణలు రాశారు. మెగాహిట్ జగదేకవీరుడు అతిలోకసుందరికి స్క్రీన్ ప్లే రాశారు. ఇప్పుడు చిరంజీవి 'మృగరాజు' కి స్క్రీన్ ప్లే రాస్తున్నారు. రెండు సినిమాలకి దర్శకత్వం వహించి అట్టర్ ఫ్లాప్ అయ్యారు. 1996 పడమటి కోయిల పల్లవి' గేయ సంకలనం ప్రచురించారు. దూరదర్శన్లో వచ్చిన 'వెన్నెల్లో ఆడపిల్ల' సీరియల్కి తానే దర్శకత్వం వహించి, 1997 లో ఉత్తమ దర్శకునిగా 'నంది' అవార్డు పొందారు. 'విజయానికి అయిదుమెట్లు' తో వ్యక్తిత్వ వికాసం వైపు మొగ్గారు. నవల్సూ, సీరియళ్ళూ పక్కన పెట్టి పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రధానాంశంగా 'MINDPOWER' - నంబర్ వన్ అవ్వడం ఎలా? అనే పుస్తకాల పరంపర రాయడానికి సిద్ధమౌతున్నారు. వీటిని వెంటనే కన్నడంలోకి అనువదించి, విడుదల చేయడానికి నవసాహితి బుక్ హౌస్ ఏర్పాట్లు చేసింది. ఘోస్టు రచయితల్ని పెంచి పోషించారన్నది పాత ఆరోపణ. 'జ్యోతి' వ్యవహారంతో సహా యండమూరికి వివాదాలేమీ కొత్తకాదు. గ్రంథ చౌర్యం అన్నది మాత్రం ఆషామాషీ విషయం కాదు. కాకినాడకు చెందిన యండమూరి ఆంధ్ర, కర్నాటకల్లో పెద్దరచయిత. తమిళంలో తెలిసో తెలియకో తెలీదుగానీ-స్టార్ రైటర్. మళయాళంలో వీరేంద్రనాథ్ వి నాలుగు నవలలు వచ్చాయి. కథ, నవల, సీరియల్, కవిత్వం, నాటిక, నాటకం, దర్శకత్వం, స్క్రీన్ ప్లే, సంభాషణలు -యిన్ని రంగాల్లో అసాధారణమైన ప్రతిభ కనబరిచిన తెలుగు రచయితలు అరుదు. విజయశిఖరం మీద నిలిచిన వివాదాస్పద ప్రతిభామూర్తి వీరేంద్రనాథ్ అతనికి శిక్ష పడాలి నా డబ్బు నాకు రావాలి యద్దనపూడి సులోచనారాణి ప్రతి తెలుగు ఇంటా తెలిసిన పేరు. పుస్తకాలు చదివే అలవాటుని విపరీతంగా పెంచిన రచయిత్రి. తెలుగు యువతీ యువకుల్ని పాతికేళ్ళపాటు తన కథలు, నవలలతో ప్రభావితం చేసి, కొండొకచో పిచ్చివాళ్ళనూ చేసి రాణించిన ఘటికురాలు. తన ఇంటి గదిలో తనమానాన తాను కూర్చుని తలొంచుకుని బుద్ధిగా రాసిన నవలలతో రాష్ట్రంలో ప్రేమతుఫానులు, కలల భూకంపాలు సృష్టించి ప్రతి తెలుగింటి ముంగిటా నందివర్ధనమై పరిమళించిన మహారచయిత్రి, పత్రికలూ, పబ్లిషర్లూ, సినీ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన కనకమాలక్ష్మీదేవి. ప్రేమ బెంగ పెట్టుకున్న మధ్యతరగతి ఆడపిల్లకి కలలో కైనా రాజశేఖరాన్నీ, పడవకారు పల్లకిని పంపిన స్వాప్నికురాలు సులోచనారాణి. అద్దె పుస్తకాల షాపులకీ, లెండింగ్ లైబ్రరీలకీ దైవమిచ్చిన రచయిత్రి. అనేకమంది ఇంటర్మీడియట్, డిగ్రీ పరీక్షల్ని పాడుచేసింది యద్దనపూడే. సులోచనారాణి ఇప్పటికి 60 నవలలూ. 30 కథలు రాశారు. ఆగమనం, ఋతురాగాలూ టీవీ సీరియల్స్ ప్రజాదరణ పొందాయి. ఏ నవల Magnum opus? అనడిగితే, "అన్నీ యిష్టంలో రాస్తాను. నాకన్నీ ఒక్కలాగే వుంటాయి" అని వినయంగా చెప్పారు. మార్చి 24 హైదరాబాద్ సోమాజిగూడలోని తన యింట్లో విజయవిహారం' ప్రతినిధి తాడి ప్రకాశ్‌కి సులోచనారాణి ఇంటర్వ్యూ యిస్తూ "రేపు అమెరికా వెళ్తున్నాను. అక్కడ మా అమ్మాయి వుంది. అయిదునెలలు అక్కడే ఉంటాను" అని చెప్పారు. తెలుగు వాళ్ళు గర్వంగా చెప్పుకునే ఈ రచయిత్రి పుస్తకాలు 26 కి పైగా తమిళంలోకి అనువాదం అయ్యాయని, పైగా వాటిని సుశీల కనకదుర్గ, యండమూరి వీరేంద్రనాథ్ రాసినట్టుగా వాళ్ళ పేర్లతో వెలువడ్డాయని తెలిసి సులోచనారాణి అవాక్కయ్యారు. విషయం తెలిసిన సంవత్సరం తర్వాత ఈ అక్రమాన్ని వ్యతిరేకిస్తూ, న్యాయం కావాలని కోరుతూ ఆమె కోర్టుకి ఎక్కబోతున్నారు. ఆ సందర్భంగా యుద్దనపూడి మాట్లాడుతూ, "తలొంచుకుని నా పనేదో నేచేసుకుపోయేదాన్ని వూరుకుంటే చాతగాని తనం అవుతుంది. సాహిత్యానికి చీడపట్టినట్టు అనిపించింది. ఈ అంశంపై పోరాడటం నా బాధ్యత ఆనుకున్నాను. యండమూరి వీరేంద్రనాథ్ తానే వచ్చి చెపుతాడేమోనని Expect చేశాను. ఆయన గొయ్యి ఆయనే తవ్వుకున్నాడు. కొంచెం కూడా నన్ను care చేయలేదు. ప్రకాశ్: ఏ ఉద్దేశంతో మీరీపని చేస్తున్నారు? (కేసు పెట్టడం గురించి) యద్దనపూడి: తప్పంతా బయట పడాలి. చేసిన వాళ్ళకు శిక్షపడాలి. ప్రకాశ్: మీ లక్ష్యం ? యద్దనపూడి:న్యాయం జరగాలి. ఆ పుస్తకాలు నావి. అలా చేసినందుకు శిక్షపడాలి. ప్రకాశ్: పారితోషికంగా రావాల్సిన డబ్బుమీకు అవసరం లేదా? యద్దనపూడి: నా డబ్బు నాకు రావాలి. తప్పుచేసిన వాళ్ళు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ప్రకాశ్: అలా క్షమాపణ చెపితే మీడబ్బు మీరు వదులుకోడానికి సిద్ధంగా వున్నారా? యద్దనపూడి: నో, అది నా కష్టార్జితం. ప్రకాశ్: మీ అనుమతితో మీ పుస్తకాలేమైనా తమిళంలో వస్తున్నాయా? యద్దనపూడి:'జీవన తరంగాలు' నవలను గౌరీ కృష్ణానంద అనువదించారు. నాకు రెమ్యునరేషన్ కూడా పంపించారు. ప్రకాశ్:మీ నవలల్ని తమిళంలోకి యండమూరే అనువదింపజేశారనడానికి మీ దగ్గర రుజువులున్నాయా? యద్దనపూడి: నా పుస్తకాలు, యండమూరి పేరుతో తమిళంలో అచ్చయ్యాయి. ఆయన్నే prove చేసుకోమనండి. ప్రకాశ్: మీ నవలల్ని తన పేరుతో వేసుకోవాల్సిన అవసరం యండమూరికి వుందంటారా? యద్దనపూడి: అతని అవసరం ఏంటో మాకు తెలీదు. అతను ఇన్నోసెంట్ అయితే ఆ విషయం పబ్లిక్ గా ఎందుకు చెప్పడు? తెలుగు సాహిత్యంలో ఎన్నడూ యిలా జరగలేదు. యిదే మొదటిసారి, పిచ్చి స్టేట్ మెంట్లు యిచ్చి అతనే యిదంతా కొని తెచ్చుకున్నాడు. అతనే గనక తప్పు ఒప్పుకుంటే, రచయితలంతా కలిసి ఎలా డిసైడ్ చేసేవారో మరి? * * * ఈ సీరియల్ మొత్తం నాలుగు పార్టులు. రేపు: కొమ్మనాపల్లి కంప్లయింట్. ఎల్లుండి: 1. కనకదుర్గ ఎవరు? 2. సూర్యదేవర ఫిర్యాదు. bokka lee, asalu aa yedhava gurunchi intha discussion waste. Typing waste. Let him rot in hell to death. 1 Quote
summer27 Posted February 19, 2021 Report Posted February 19, 2021 31 minutes ago, yskokila said: bokka lee, asalu aa yedhava gurunchi intha discussion waste. Typing waste. Let him rot in hell to death. Why so angry yaa Quote
dasari4kntr Posted December 12, 2021 Report Posted December 12, 2021 On 2/19/2021 at 8:12 AM, r2d2 said: యద్ధనపూడి, యండమూరి.... ఒక తమిళ కథ! Starwar on 'Novel' Plagiarism - Part 1 --------------------------------------- ఈ సినిమా పేరు: యద్ధనపూడి, యండమూరి, ఒక తమిళ అనువాదం. 20 సంవత్సరాల క్రితం జరిగిన వివాదమిది. ‘జనహర్ష’ రమణమూర్తి గారి సంపాదకత్వంలో వచ్చిన ‘విజయ విహారం’ మాస పత్రికలో 20 నెలలు పని చేశాను. 2000 సంవత్సరం విజయ విహారం ఏప్రిల్ సంచికలో యండమూరి, యద్ధనపూడి, కొమ్మనాపల్లి, సూర్యదేవర రామ్ మోహనరావులతో నేను చేసిన ఇంటర్వ్యూలు, వివాదం వివరాలు పబ్లిష్ అయ్యాయి. అప్పుడు ప్రచురించిన వాటిని యథాతథంగా ఇక్కడ ఇస్తున్నా. ముందస్తు సంజాయిషీ: ఇది ఆసక్తికరమైన సమాచారం. కేవలం కరోనా కాలక్షేపం. గతజలసేతు బంధనమే తప్ప, యండమూరిగారి మీద కోపమో, వ్యతిరేకతో నాకు ఉండాల్సిన అవసరమే లేదు. ఇదీ విజయ విహారం రిపోర్టు: తమిళంలో యండమూరి పేరుతో యద్దనపూడి నవలలు తప్పునాది కాదంటున్న యండమూరి, కోర్టుకెక్కనున్న సులోచనారాణి ఒక చిత్రమైన వివాదం తెలుగు రచయితలు, పాఠకుల్లో క్రమంగా చర్చగా మారుతోంది. పేరున్న రచయితలు, గొడవ గ్రంథ చౌర్యంపై కావడంతో ఈ చినుకులూ చిరుగాలీ తుఫానుగా మారే ప్రమాద సూచన కనడుతోంది. ఈ వివాదం ప్రధానంగా యండమూరి వర్సెస్ యద్దనపూడి సులోచనా రాణి, కొమ్మనాపల్లి గణపతిరావు, సూర్యదేవర రామ్మోహన్ రావు. వారి నవలలు తమిళంలోకి అనువదించి వీరేంద్రనాథ్ డబ్బు మూటగట్టుకున్నారని ఆరోపణ. యద్దనపూడి, కొమ్మనాపల్లి, సూర్యదేవరలు కలిసికట్టుగా కోర్టుకెక్కే ప్రయత్నం చేస్తున్నారు. వాయుగుండం ఏర్పడినట్టే. అయితే ఇంతమంది స్టార్ రైటర్స్‌ని తలదన్నే తెరవెనుక స్టార్ పేరు సుశీలా కనకదుర్గ. తమిళంలోకి అనువాదం చేసుకున్నదీ, డబ్బు తిన్నదీ ఆమేనని యండమూరి అంటున్నారు. ఆమె లేనే లేదు. కనకదుర్గ అనే మహిళ యండమూరి కల్పనా చాతుర్యమనీ, ఆయనే అసలుసిసలు దొంగ అనీ కొమ్మనాపల్లి ఎదురుదాడికి దిగుతున్నారు. ఇక తుఫాను తప్పేట్టు లేదు. అసలిది వివాదమే కాదనీ, తన తప్పేమీ లేదనీ, వుంటే నిరూపించుకోండనీ యండమూరి ధీమాగా సవాల్ చేస్తున్నారు. అతనికి శిక్షపడాలి. నా కష్టార్జితం నాకు రావాలి అని సులోచనారాణి పట్టుబడుతున్నారు. అందరూ రచయితలే. తెలివి ప్రధానాస్త్రంగా బరిలోకి దిగుతున్నారు. గేమ్ పర్‌ఫెక్ట్‌గా ఆడటానికి ఊహాశక్తిని జోడిస్తున్నారు. వీరేంద్రనాథ్ ఈ ముప్పేట దాడిని తట్టుకుని నిలబడగలరా? ఇందులో మనం ఎవరి పక్షం వహించాల్సిన పనీలేదు. నిర్మమకారంగా అందరి అభిప్రాయాలూ యిక్కడ ఇస్తున్నాం. ఈ తమిళ అనువాద సినిమా క్లైమాక్స్ ఎలా ఉంటుందో అంతా ఆ కనకదుర్గ దయ. Dont jump into conclusions, after all, you have nothing to loose. 'వి' ఫర్ విజయమూ, వివాదమూ! యండమూరికిపుడు 51 ఏళ్ళు. 1968 లో తొలి కథ 'ముసురు పట్టిన రాత్రి' ఆంధ్రప్రభలో వచ్చింది. 1972-79 మధ్య కుక్క, రుద్రవీణ నాటికలు ఆంధ్రదేశాన్ని వూగించాయి. 'రఘపతి రాఘవ రాజారాం' నాటకానికి 1984 లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. తొలినవల 'రుషి' 1977లో స్వాతిలో వచ్చింది. 1980లో తొలి అణుబాంబు పేలుడు - తులసీదళం - తెలుగు పాఠక జన హృదయాల్ని భస్మీపటలం చేసింది. మృణాల్ సేన్ ఒక వూరి కథ, చిరంజీవి 'మంచుపల్లకి' సినిమాలకి సంభాషణలు రాశారు. మెగాహిట్ జగదేకవీరుడు అతిలోకసుందరికి స్క్రీన్ ప్లే రాశారు. ఇప్పుడు చిరంజీవి 'మృగరాజు' కి స్క్రీన్ ప్లే రాస్తున్నారు. రెండు సినిమాలకి దర్శకత్వం వహించి అట్టర్ ఫ్లాప్ అయ్యారు. 1996 పడమటి కోయిల పల్లవి' గేయ సంకలనం ప్రచురించారు. దూరదర్శన్లో వచ్చిన 'వెన్నెల్లో ఆడపిల్ల' సీరియల్కి తానే దర్శకత్వం వహించి, 1997 లో ఉత్తమ దర్శకునిగా 'నంది' అవార్డు పొందారు. 'విజయానికి అయిదుమెట్లు' తో వ్యక్తిత్వ వికాసం వైపు మొగ్గారు. నవల్సూ, సీరియళ్ళూ పక్కన పెట్టి పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రధానాంశంగా 'MINDPOWER' - నంబర్ వన్ అవ్వడం ఎలా? అనే పుస్తకాల పరంపర రాయడానికి సిద్ధమౌతున్నారు. వీటిని వెంటనే కన్నడంలోకి అనువదించి, విడుదల చేయడానికి నవసాహితి బుక్ హౌస్ ఏర్పాట్లు చేసింది. ఘోస్టు రచయితల్ని పెంచి పోషించారన్నది పాత ఆరోపణ. 'జ్యోతి' వ్యవహారంతో సహా యండమూరికి వివాదాలేమీ కొత్తకాదు. గ్రంథ చౌర్యం అన్నది మాత్రం ఆషామాషీ విషయం కాదు. కాకినాడకు చెందిన యండమూరి ఆంధ్ర, కర్నాటకల్లో పెద్దరచయిత. తమిళంలో తెలిసో తెలియకో తెలీదుగానీ-స్టార్ రైటర్. మళయాళంలో వీరేంద్రనాథ్ వి నాలుగు నవలలు వచ్చాయి. కథ, నవల, సీరియల్, కవిత్వం, నాటిక, నాటకం, దర్శకత్వం, స్క్రీన్ ప్లే, సంభాషణలు -యిన్ని రంగాల్లో అసాధారణమైన ప్రతిభ కనబరిచిన తెలుగు రచయితలు అరుదు. విజయశిఖరం మీద నిలిచిన వివాదాస్పద ప్రతిభామూర్తి వీరేంద్రనాథ్ అతనికి శిక్ష పడాలి నా డబ్బు నాకు రావాలి యద్దనపూడి సులోచనారాణి ప్రతి తెలుగు ఇంటా తెలిసిన పేరు. పుస్తకాలు చదివే అలవాటుని విపరీతంగా పెంచిన రచయిత్రి. తెలుగు యువతీ యువకుల్ని పాతికేళ్ళపాటు తన కథలు, నవలలతో ప్రభావితం చేసి, కొండొకచో పిచ్చివాళ్ళనూ చేసి రాణించిన ఘటికురాలు. తన ఇంటి గదిలో తనమానాన తాను కూర్చుని తలొంచుకుని బుద్ధిగా రాసిన నవలలతో రాష్ట్రంలో ప్రేమతుఫానులు, కలల భూకంపాలు సృష్టించి ప్రతి తెలుగింటి ముంగిటా నందివర్ధనమై పరిమళించిన మహారచయిత్రి, పత్రికలూ, పబ్లిషర్లూ, సినీ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన కనకమాలక్ష్మీదేవి. ప్రేమ బెంగ పెట్టుకున్న మధ్యతరగతి ఆడపిల్లకి కలలో కైనా రాజశేఖరాన్నీ, పడవకారు పల్లకిని పంపిన స్వాప్నికురాలు సులోచనారాణి. అద్దె పుస్తకాల షాపులకీ, లెండింగ్ లైబ్రరీలకీ దైవమిచ్చిన రచయిత్రి. అనేకమంది ఇంటర్మీడియట్, డిగ్రీ పరీక్షల్ని పాడుచేసింది యద్దనపూడే. సులోచనారాణి ఇప్పటికి 60 నవలలూ. 30 కథలు రాశారు. ఆగమనం, ఋతురాగాలూ టీవీ సీరియల్స్ ప్రజాదరణ పొందాయి. ఏ నవల Magnum opus? అనడిగితే, "అన్నీ యిష్టంలో రాస్తాను. నాకన్నీ ఒక్కలాగే వుంటాయి" అని వినయంగా చెప్పారు. మార్చి 24 హైదరాబాద్ సోమాజిగూడలోని తన యింట్లో విజయవిహారం' ప్రతినిధి తాడి ప్రకాశ్‌కి సులోచనారాణి ఇంటర్వ్యూ యిస్తూ "రేపు అమెరికా వెళ్తున్నాను. అక్కడ మా అమ్మాయి వుంది. అయిదునెలలు అక్కడే ఉంటాను" అని చెప్పారు. తెలుగు వాళ్ళు గర్వంగా చెప్పుకునే ఈ రచయిత్రి పుస్తకాలు 26 కి పైగా తమిళంలోకి అనువాదం అయ్యాయని, పైగా వాటిని సుశీల కనకదుర్గ, యండమూరి వీరేంద్రనాథ్ రాసినట్టుగా వాళ్ళ పేర్లతో వెలువడ్డాయని తెలిసి సులోచనారాణి అవాక్కయ్యారు. విషయం తెలిసిన సంవత్సరం తర్వాత ఈ అక్రమాన్ని వ్యతిరేకిస్తూ, న్యాయం కావాలని కోరుతూ ఆమె కోర్టుకి ఎక్కబోతున్నారు. ఆ సందర్భంగా యుద్దనపూడి మాట్లాడుతూ, "తలొంచుకుని నా పనేదో నేచేసుకుపోయేదాన్ని వూరుకుంటే చాతగాని తనం అవుతుంది. సాహిత్యానికి చీడపట్టినట్టు అనిపించింది. ఈ అంశంపై పోరాడటం నా బాధ్యత ఆనుకున్నాను. యండమూరి వీరేంద్రనాథ్ తానే వచ్చి చెపుతాడేమోనని Expect చేశాను. ఆయన గొయ్యి ఆయనే తవ్వుకున్నాడు. కొంచెం కూడా నన్ను care చేయలేదు. ప్రకాశ్: ఏ ఉద్దేశంతో మీరీపని చేస్తున్నారు? (కేసు పెట్టడం గురించి) యద్దనపూడి: తప్పంతా బయట పడాలి. చేసిన వాళ్ళకు శిక్షపడాలి. ప్రకాశ్: మీ లక్ష్యం ? యద్దనపూడి:న్యాయం జరగాలి. ఆ పుస్తకాలు నావి. అలా చేసినందుకు శిక్షపడాలి. ప్రకాశ్: పారితోషికంగా రావాల్సిన డబ్బుమీకు అవసరం లేదా? యద్దనపూడి: నా డబ్బు నాకు రావాలి. తప్పుచేసిన వాళ్ళు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ప్రకాశ్: అలా క్షమాపణ చెపితే మీడబ్బు మీరు వదులుకోడానికి సిద్ధంగా వున్నారా? యద్దనపూడి: నో, అది నా కష్టార్జితం. ప్రకాశ్: మీ అనుమతితో మీ పుస్తకాలేమైనా తమిళంలో వస్తున్నాయా? యద్దనపూడి:'జీవన తరంగాలు' నవలను గౌరీ కృష్ణానంద అనువదించారు. నాకు రెమ్యునరేషన్ కూడా పంపించారు. ప్రకాశ్:మీ నవలల్ని తమిళంలోకి యండమూరే అనువదింపజేశారనడానికి మీ దగ్గర రుజువులున్నాయా? యద్దనపూడి: నా పుస్తకాలు, యండమూరి పేరుతో తమిళంలో అచ్చయ్యాయి. ఆయన్నే prove చేసుకోమనండి. ప్రకాశ్: మీ నవలల్ని తన పేరుతో వేసుకోవాల్సిన అవసరం యండమూరికి వుందంటారా? యద్దనపూడి: అతని అవసరం ఏంటో మాకు తెలీదు. అతను ఇన్నోసెంట్ అయితే ఆ విషయం పబ్లిక్ గా ఎందుకు చెప్పడు? తెలుగు సాహిత్యంలో ఎన్నడూ యిలా జరగలేదు. యిదే మొదటిసారి, పిచ్చి స్టేట్ మెంట్లు యిచ్చి అతనే యిదంతా కొని తెచ్చుకున్నాడు. అతనే గనక తప్పు ఒప్పుకుంటే, రచయితలంతా కలిసి ఎలా డిసైడ్ చేసేవారో మరి? * * * ఈ సీరియల్ మొత్తం నాలుగు పార్టులు. రేపు: కొమ్మనాపల్లి కంప్లయింట్. ఎల్లుండి: 1. కనకదుర్గ ఎవరు? 2. సూర్యదేవర ఫిర్యాదు. Whats the update on this issue…? Quote
MuPaGuNa Posted December 12, 2021 Report Posted December 12, 2021 publishers ni rendu mingithe evadiki check issue chesado, evadi acc lo deposit ayyindo telisipothadi kada..inthaki case emayindi... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.