Jump to content

psycho sekhar gaadnini pattukunnaru


Recommended Posts

Posted

[size=14pt][size=12pt]దివ్యను నేనే చంపాను
ఉన్మాది శేఖర్ అంగీకారం
పోలీసులకు చిక్కిన నిందితుడు
దివ్య మృతిపై పలు అనుమానాలు
దుస్తులు మారాయంటున్న తల్లిదండ్రులు

ఉన్మాది దొరికాడు. అతనిలో కాసింతైనా తడబాటు లేదు. 'ఔను.. నేనే చంపాను' అని అంగీకరించాడు! తానే హంతకుడిని అని ఒప్పుకొన్నాడు. ఇటీవల హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్యను బేస్‌బాల్ బ్యాట్‌తో కొట్టి చంపిన శేఖర్‌ను పోలీసులు శుక్రవారం విలేకరుల ముందు ప్రవేశపెట్టారు.

మరొకరితో సన్నిహితంగా ఉండటం సహించలేకే దివ్యను కొట్టి చంపానని అతను చెప్పాడు. శేఖర్ పట్టుబడినప్పటికీ ఈ కేసుపై ఉన్న అనుమానాల నీలినీడలు తొలగిపోలేదు. ఆమె కుటుంబ సభ్యులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంటి నుంచి బయలుదేరినప్పుడు దివ్య వేసుకున్న దుస్తులు వేరు.

ఆమె చనిపోయాక మృతదేహంపై ఉన్న దుస్తులు వేరు. ఆమె తొలుత ధరించిన దుస్తులు శేఖర్ ఇంట్లో ఒక మూలన ఉన్నాయి. మరోవైపు... శేఖర్‌ను అరెస్టు చేశామని పోలీసులు చెబుతుండగా, అతనే లొంగిపోయాడనే వార్తలు కూడా వస్తున్నాయి. శేఖర్‌ను కాపాడేందుకు కొందరు రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నారని, వారి ప్రమేయంతోనే అతను లొంగిపోయాడని దివ్య కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్, సెప్టెంబర్ 24 : ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్యను అత్యంత దారుణంగా హత్య చేసిన ఉన్మాది శేఖర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ముంబైలో తలదాచుకున్న నిందితుడిని ప్రత్యేక పోలీసు బృందాల సాయంతో పట్టుకున్నట్టు సైబరాబాద్ కమిషనర్ ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం విలేకరులకు తెలిపారు. ఆయన ఏం చెప్పారంటే... 'హత్యకు గురైన దివ్య (23) నగర శివారులోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతోంది.

శేఖర్ కూడా అదే కాలేజీలో గత ఏడాదే ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. దివ్యను శేఖర్ గాఢంగా ప్రేమిస్తున్నా.. దివ్య మాత్రం అతడిని ప్రేమించడంలేదని దర్యాప్తులో వెల్లడైంది. కొన్ని రోజులుగా ఆమె తన స్కూల్‌మేట్ ప్రదీప్‌కుమార్‌తో సన్నిహితంగా ఉంటోంది. దీనిని శేఖర్ జీర్ణించుకోలేక పోయాడు. అయితే, శేఖర్‌తో స్నేహంగా ఉంటూనే.. ప్రదీప్‌తో దివ్య సన్నిహితంగా మెలగుతోంది. దీంతో శేఖర్ చాలా సార్లు వారిద్దరినీ హెచ్చరించాడు.

చివరకు ఆమెపై కక్ష పెంచుకొని హత్యకు పథకం వేశాడు. ఈనెల 19న దివ్యను, ప్రదీప్‌ను ఇంటికి రమ్మని పిలిచాడు. నేను ముంబై వెళ్లిపోతున్నా. ఇక నుంచి నాతో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు..అని చెప్పాడు. దివ్య మాత్రమే శేఖర్ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ప్రదీప్ నుంచి దివ్య మొబైల్‌కు మెసేజ్ వచ్చింది. అది చూసి శేఖర్ ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది.

బ్యాట్‌తో దివ్య తలపై బాదడంతో ఆమె అక్కడిక్కడే మరణించింది. వెంటనే తాను కూడా చనిపోతున్నట్టు స్నేహితులకు మెసేజ్ ఇచ్చి తలుపులు మూసి ముంబై పారిపోయాడు' అని ప్రభాకర్‌రెడ్డి హత్య వివరాలను వెల్లడించారు. కాగా, దివ్య ఒంటిపై ఉన్న దుస్తులు ఎలా మారాయి? ఆమెపై అఘాయిత్యం జరిగిందా? అన్న విషయాలు తేలాల్సి ఉందని చెప్పారు.

రెండేళ్లుగా ప్రేమించుకున్నాం: శేఖర్
మేమిద్దరం రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. దివ్య కూడా నన్ను ప్రేమించింది. అయితే ఈ మధ్య కాలంలో ఆమె ప్రదీప్‌కు దగ్గరైంది. దీంతో నేను దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నా. చివరి సారిగా దివ్యను ఇంటికి పిలిచా. మాటా మాటా పెరిగి క్షణికావేశంలో ఆమెను బ్యాట్‌తో కొట్టా. ఆ తర్వాత తప్పు చేశానని బాధపడ్డా. చనిపోవాలనుకున్నా. కానీ అమ్మానాన్న గుర్తుకు వచ్చి విరమించుకున్నా.

అనుమానాల నీలినీడలు
శేఖర్ చెబుతున్న మాటల్లో అనేక వైరుధ్యాలు ఉండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. దివ్య చనిపోయి ఉన్నప్పుడు ఆమె ఒంటిపై ఉన్న దుస్తులపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మోడర్న్ దుస్తులను దివ్య ఎప్పుడూ ధరించదని వారు చెబుతున్నారు.

ఇంటి నుంచి బయలుదేరినపుడు దివ్య వేసుకున్న దుస్తులు శేఖర్ ఇంట్లో ఒక మూలన ఉండగా, మృతదేహంపై వేరే దుస్తులు ఉండటం అనుమానాస్పదమైంది. కాగా శేఖర్‌ను పోలీసులు అరెస్టు చేయలేదని, కొందరు పెద్ద మనుషుల సహకారంతో అతనే లొంగిపోయాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి[/size][/size]

Posted

Veedini  Encounter cheyyali....police vaadini save ceyyataniki choostunnatunnaru

×
×
  • Create New...