Somedude Posted February 28, 2021 Report Posted February 28, 2021 పోస్కోతో పుట్టి ముంచేలా! ఒప్పందంలో విశాఖ ఉక్కుకు ఎంత వాటానో తెలీదు మూడో వాటాదారుకూ అవకాశమివ్వొచ్చు అదనపు భూమిని పొందేందుకు వెసులుబాటు విస్మయం కలిగించే నిబంధనలెన్నో! ఈనాడు - విశాఖపట్నం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఉద్యమం ఉద్ధృతమవుతోంది. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌తో ఆందోళనలు జరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఒకవేళ ప్రైవేటీకరణ వాయిదా వేస్తే దక్షిణ కొరియా ఉక్కు తయారీ సంస్థ పోస్కోతో విశాఖ ఉక్కు సంస్థ (ఆర్‌ఐఎన్‌ఎల్) చేసుకున్న ఒప్పందం మళ్లీ తెరపైకి రానున్నట్లు సమాచారం. ఈ ఒప్పందంలోని పలు నిబంధనలు ఉక్కు కర్మాగారం పుట్టి ముంచేలా ఉన్నాయని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఒప్పందంలోని అంశాలివీ.. * విశాఖ ఉక్కు, పోస్కో సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసే సంస్థలో కనీసం 50 శాతం వాటా పోస్కోకు ఉంటుంది. విశాఖ ఉక్కు కర్మాగార వాటా ఎంతన్నది మాత్రం ఒప్పందంలో ప్రస్తావించలేదు. నూతన సంస్థకు కేటాయించే భూమి విలువను బట్టి వాటా శాతం ఆధారపడి ఉంటుందనడం గమనార్హం. అవసరాన్ని బట్టి పోస్కో, ఆర్‌ఐఎన్‌ఎల్‌ల ఆమోదంతో నూతన సంస్థలో మూడో వాటాదారును చేర్చుకుంటారు. మరో పారిశ్రామికవేత్తకు ఆ వాటా దక్కితే ప్రైవేటు పెత్తనం ఎక్కువవుతుంది. పోస్కో చెప్పినట్లుగానే ఉత్పత్తుల తయారీ నూతన కర్మాగారంలో తయారుచేసే హాట్‌రోల్డ్ ఉత్పత్తులను మహారాష్ట్రలోని పోస్కో కర్మాగారానికి విక్రయించడానికి ప్రాధాన్యమిచ్చేలా హక్కు (ప్రిఫరెన్షియల్ రైట్) కల్పించాలని ఒప్పందంలో పేర్కొన్నారు. పోస్కో మహారాష్ట్ర సంస్థ అవసరాలకు తగినట్లుగా ఉత్పత్తులను రూపొందించి ఇవ్వాలని కూడా నిబంధనల్లోనే పొందుపరిచారు. మార్కెట్ స్థితిగతులు, లాభదాయకతను బట్టి కాకుండా సంస్థకు నష్టదాయకంగా ఉండేలా ఉత్పత్తులు తయారుచేసేలా ఒప్పందం కుదుర్చుకోవడం ఏమిటో అర్ధం కావడం లేదు. * పోస్కో భాగస్వామ్యంతో ఏర్పడబోయే సంస్థకు 1,167 ఎకరాల భూమిని ఇవ్వడానికి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రతిపాదించింది. అవసరానికి తగ్గట్లుగా అదనపు భూమిని కూడా ఆర్‌ఐఎన్‌ఎల్ ఇవ్వాల్సి ఉంటుందని నిబంధనను పొందుపరిచారు. * ఉక్కు సంస్థలో భూమి విలువను ఖరారు చేయడానికి సంస్థకు సంబంధం లేని నిపుణుడి (అవుట్‌సైడ్ ఎక్స్‌పర్ట్) సేవలు పొందుతారు. అంటే తన భూమి విలువను నిర్ణయించుకునే హక్కును కూడా ఉక్కు కర్మాగారం కోల్పోయినట్టే. ఉక్కు అధికారులు ఏమంటారంటే.. పోస్కో ఒప్పందం ప్రస్తుత స్థితి ఏమిటో తమకు తెలియదని ఉక్కు అధికారి ఒకరు ‘ఈనాడు’కు వెల్లడించారు. వందశాతం ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో పాత ఒప్పందం అమలవుతుందా? లేదా? అన్నది చెప్పలేమన్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.