tamu Posted March 30, 2021 Author Report Posted March 30, 2021 మామూలుగా హీరోయిన్ల తొలి సినిమాలు హిట్టయితేనే తర్వాత అవకాశాలు వస్తాయి. కానీ కొంతమంది హీరోయిన్లకు మాత్రం తొలి సినిమా ఫలితం లేకుండా మంచి పేరొస్తుంది. తమ అందంతో, అభినయంతో వాళ్లు తమదైన ముద్ర వేస్తుంటారు. లావణ్య త్రిపాఠి ఆ కోవకే చెందుతుంది. ఈ ఉత్తరాది భామ తెలుగులో చేసిన తొలి సినిమా అందాల రాక్షసి పెద్దగా ఆడలేదు. కానీ ఆ సినిమాలో ఆమె పాత్ర మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ప్రత్యేకమైన ఆమె అందం కుర్రాళ్ల మనసులకు గాయం చేసింది. ఆమెకు అభిమానగణం బాగానే తయారైంది. దీంతో మంచి మంచి అవకాశాలే వచ్చాయి. దూసుకెళ్తా, సోగ్గాడే చిన్నినాయనా, భలే భలే మగాడివోయ్ లాంటి విజయాలతో లావణ్య ఒక దశలో ప్రామిసింగ్‌గా కనిపించింది. కానీ ఆ విజయాలను ఆమె నిలబెట్టుకోలేకపోయింది. గత కొన్నేళ్లలో అర్జున్ సురవరం మినహాయిస్తే లావణ్యకు ఓ మోస్తరు హిట్ కూడా లేదు. ఆ సినిమా తర్వాత తన నుంచి వస్తున్న చిత్రాలు నిరాశ పరుస్తూ కెరీర్‌ను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. తాజాగా రెండు వారాల వ్యవధిలో ఆమె సినిమాలు రెండు రిలీజయ్యాయి. ఈ సినిమాల మీద లావణ్య చాలా ఆశలే పెట్టుకుంది. కానీ సందీప్ కిషన్‌తో చేసిన ఎ1 ఎక్స్‌ప్రెస్ కానీ.. కార్తికేయ సరసన నటించిన చావుకబురు చల్లగా కానీ ఆమెకు ఆశించిన ఫలితాలివ్వలేదు. ఎ1 ఎక్స్‌ప్రెస్‌కు ఆమె గ్లామర్ ప్లస్ కాలేదు. అలాగే చావు కబురు చల్లగాలో డీగ్లామరస్‌గా కనిపిస్తూ నటనకు ప్రాధాన్యమున్న పాత్ర చేయగా అదీ నిరాశపరిచింది. ఈ రెండు సినిమాల ఫలితాలు లావణ్య భవిష్యత్తు మీద తీవ్ర ప్రభావమే చూపేలా ఉన్నాయి. ఆమె చేతిలో ప్రస్తుతం సినిమాలే లేవు. పై రెండు సినిమాలు ఆడితే అవకాశాలు వచ్చేవేమో. అవి రెండూ పోవడంతో ఇక ఆమె కెరీర్ ముందుకు సాగడమే కష్టంగా ఉంది. Quote
Hydrockers Posted March 30, 2021 Report Posted March 30, 2021 Pelli with mega hero ani @NiranjanGaaru annaru Quote
NiranjanGaaru Posted March 30, 2021 Report Posted March 30, 2021 9 hours ago, Hydrockers said: Pelli with mega hero ani @NiranjanGaaru annaru Varuntej gf Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.