Manchodu_Chedodu Posted April 3, 2021 Report Posted April 3, 2021 భర్త మందలింపు; టైలరింగ్ షాప్‌కు వెళ్తున్నానని చెప్పి.. Apr 03, 2021, 07:56 IST సాక్షి, మల్కాజిగిరి: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వివాహిత అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఏఎస్‌ఐ సుబ్బరాయుడు తెలిపిన వివరాల ప్రకారం... గౌతంనగర్‌కు చెందిన గడ్డం మహేందర్, అనూష(24) ఇద్దరూ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొంత కాలంగా సెల్‌ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడడాన్ని గమనించి అనూషను మహేందర్ ప్రశ్నిస్తే సోదరితో మాట్లాడుతున్నానని చెప్పింది. ( (inthaki evaratho matladuthunao e akka chepalede e paper vadu)గత నెల 30వ తేదీ ఉదయం ఇంటి నుంచి టైలరింగ్ దుకాణానికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిన అనూష ఇంటికి తిరిగి రాలేదు. ఆమె ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో శుక్రవారం భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. E paper vadu rasindi , bartha mandalinchadani, continue sesthe sodiratho matladuthundi ani chepindani rasadu, I am not clear what he is talking about మహిళ అదృశ్యం అఫ్జల్‌గంజ్: బంధువులను కలిసేందుకు నగరానికి వచి్చన ఓ బధిర మహిళ అదృశ్యమైన సంఘటన అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రమేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సీహెచ్ చంద్రకళ అనే మహిళ గతంలో కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రి ప్రాంగణంలోని క్యాంటీన్‌లో పని చేస్తూ జీవనం సాగించేది. మూడు నెలల క్రితం పనిమానేసి నల్గొండకు వెళ్లింది. ఈ నెల 27న బంధువులను కలిసేందుకు వచి్చన చంద్రకళ ఇంటికి తిరిగి రాలేదు. ఆమె కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో ఆమె కుమార్తె శ్రీలత అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చంద్రకళ, శైలజ ఇంట్లో చెప్పకుండా.. బహదూర్‌పురా: ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ దుర్గా ప్రసాద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కిషన్‌బాగ్ ఎక్స్ రోడ్డు ప్రాంతానికి చెందిన ఏక్‌నాథ్ కుమార్తె శైలజ గత నెల 31వ తేదీ తెల్లవారుజామున ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లింది. ఆమె తండ్రి ఏక్‌నాథ్ పరిసర ప్రాంతాలు, స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో బహదూర్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.