kakatiya Posted April 5, 2021 Report Posted April 5, 2021 10 కి.మీ. ప్రయాణం.. రూ. 22,000 కిరాయి.. శంషాబాద్ విమానాశ్రయంలో అద్దెకు ఖరీదైన కార్లు దేశంలో తొలిసారిగా అందుబాటులోకి శంషాబాద్, న్యూస్‌టుడే: ఫెరారీ కంపెనీకి చెందిన ఓ కారు ధర రూ. 4.97 కోట్లు. దేశవ్యాప్తంగా ఆ తరహా కార్లలో ప్రయాణించే ప్రముఖ పారిశ్రామికవేత్తలను చేతి వేళ్ల మీద లెక్కించొచ్చు.. అలాంటి లగ్జరీ కార్లు ప్రస్తుతం శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులకు అద్దెకు దొరుకుతున్నాయి. దేశంలో ఏ విమానాశ్రయంలోనూ అందుబాటులోని లేని ఈ సేవలను శంషాబాద్‌లో 4 వీల్స్ ట్రావెల్స్, డ్రైవెన్ బై యూ మొబిలిటీ, అర్బన్ ఓయాసిస్ సంస్థలు సంయుక్తంగా ఈనెల నుంచి అందుబాటులోకి తీసుకువచ్చాయి. విమానం దిగిన ప్రయాణికులు అరైవల్ వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ద్వారా కాని, రిజర్వేషన్ ఎట్ అర్బన్ ఓయాసిస్.ఇన్ వెబ్‌సైట్‌లో కాని ఈ లగ్జరీ కార్లను బుకింగ్ చేసుకోవచ్చు. గంటకు రూ. 5,000 అద్దె బీఎండబ్ల్యూ 7 సిరీస్ కారులో సెల్ఫ్ డ్రైవింగ్‌తో ప్రయాణించాలంటే ముందుగా లక్ష రూపాయలు డిపాజిట్ చేయాలి. గంటకు రూ. 5 వేల చొప్పున అద్దె, 10 కి.మీ. తర్వాత ప్రతి కి.మీ. దూరానికి రూ. 177 చొప్పున అదనంగా ఛార్జీ చెల్లించాలి. * లంబోర్గిని కారులో డ్రైవర్‌తో 10 కి.మీ. ప్రయాణించడానికి రూ.22 వేలు చెల్లించాలి. ఆ తర్వాత ప్రతి కి.మీ. దూరానికి రూ. 706, గంటకు రూ. 22 వేల చొప్పున అదనంగా వసూలు చేస్తారు. డ్రైవర్‌కు రూ.వెయ్యి బత్తా కూడా చెల్లించాల్సి ఉంటుంది. అందుబాటులో ఉన్న కార్లు ఇవే.. ఫెరారీ, రేంజ్‌రోవర్, లంబోర్గిని, బెంట్లీ కాంటినెంటల్, మెర్సిడెస్ బెంజ్, పోర్షే 911, జాగ్వార్, ఫోర్డ్ ముస్తాగ్, ఆడి, వోల్వో, టయోటా, బీఎండబ్ల్యూ కంపెనీలకు చెందిన 30కి పైగా మోడల్స్ కార్లు ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి Quote
Peter123 Posted April 5, 2021 Report Posted April 5, 2021 ఫోర్డ్ ముస్తాగ్ - idi eppdu dimparu ford valu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.