Jump to content

Recommended Posts

Posted

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సందర్శించుకోవాలని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి కోరారు. నవంబర్‌లో ఒబామా భారత్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఒబామా తిరుపతి సందర్శనకు రావాలని చిరు విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి లేఖ రాశారు. భారత పర్యటన సందర్భంగా తిరుపతి సందర్శనకు రావాలని ఆయన శనివారం ఆ లేఖలో ఒబామాను కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె. రోశయ్యకు కూడా చిరంజీవి ఓ లేఖ రాశారు.

ఇప్పటికే ఇదే విషయంపై కాంగ్రెసు నాయకులు ఒబామాకు, రోశయ్యకు లేఖలు రాశారు. ఇదే తరహాలో ఒబామా భారత పర్యటనలో తిరుమలోని అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలని చిరంజీవి కోరారు.

కాగా.. తిరుపతి తన నియోజకవర్గం కావడంతో చిరంజీవి ఒబామాకు ఆ లేఖ రాసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Posted

@3$% @3$% @3$% chiru mind dobbindi. state lone evadu dekhatla veedini veediki obama kavalsi vachada los@r

×
×
  • Create New...